Bramayugam: ఓటీటీలోకి వచ్చేసిన 'భ్రమయుగం', స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Bramayugam:మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ ‘భ్రమయుగం’ థియేటర్లలో రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక రిలీజైన మూడు వారాల్లోనే డిజిటల్ వేదికపై అభిమానులకు అందుబాటులోకి వచ్చేసింది.
Bramayugam OTT Release Update: మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన సినిమా ‘భ్రమయుగం’. వివిధ భాషల్లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. విభిన్న కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. నిజానికి ఇలాంటి కథలు ఎన్నుకోవడంలో మమ్ముట్టి ఎప్పుడూ ముందుంటారు. గతంలో కూడా ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు చేసి ప్రేక్షకుల ఆదరణ పొందారు మమ్ముట్టి. ఇక అలా విభిన్న కథాంశంతో రూపొందింన సినిమా ‘భ్రమయుగం’. ఇప్పుడిక ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. రిలీజైన మూడు వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే?
‘భ్రమయుగం’ సినిమా తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇక ఓటీటీలో కూడా ఈ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. సోనీ లైవ్ లో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న వాళ్లంతా.. ఈ వీకెండ్ కి ఓటీటీలో ‘భ్రమయుగం’ ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు.
బ్లాక్ అండ్ వైట్ లో ‘భ్రమయుగం’
‘భ్రమయుగం’ ఈతరం వాళ్లకి ఇది వెరైటీ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాలో కేవలం మూడు, నాలుగు పాత్రలు ఉంటాయి. ఈ పాత్రలతోనే రెండున్నర గంటల పాటు సినిమా నడిపించడం విశేషం. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా. మలయాళంలో ఫిబ్రవరి 15న రిలీజైన ఈ సినిమా తెలుగులో మాత్రం23న వచ్చింది. మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. బ్లాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. అయితే, తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమాకి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు. ఇందులో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భారతన్, అమాల్డా లిజ్, మణికందన్ ఆర్ ఆచారీ కీలక పాత్రల్లో కనిపించారు.
ట్రైలర్ నుంచే అంచనాలు..
ప్రస్తుతం వస్తున్న సినిమాలు అన్నీ.. కలర్ లోనే చూస్తున్నాం. హెచ్ డీ క్వాలిటీలో చూస్తున్నాం. అలాంటిది ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ లో తెరకెక్కించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఈసినిమాని రాహుల్ సదాశివన్ తెరకెక్కించారు. 'భ్రమయుగం'. 'ది ఏజ్ ఆఫ్ మ్యాడ్ నెస్' అనేది దీనికి ట్యాగ్ లైన్. టీజర్, ట్రైలర్ పిచ్చెక్కించాయి. చాలా స్పెషల్ గా అనిపించాయి. దీంతో ఈసినిమా చూసేందుకు ఆసక్తి చూపించారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు ఓటీటీల్లోకి వచ్చేసింది.
కథేంటంటే?
'భ్రమయుగం' సినిమా కథ 17వ శతాబ్దానికి చెందినది. మలబారు తీరంలోని ఓ రాజ్యంలో రాజు దగ్గర గాయకుడిగా పనిచేసే దేవన్ (అర్జున్ అశోకన్) అడవికి వెళ్లి తప్పిపోతాడు. అటూ ఇటూ తిరుగుతూ కుముదన్ పొట్టి (మమ్ముట్టి) నివాసం ఉండే ప్రాంతానికి చేరుకుంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా అక్కడే ఆశ్రయం పొందుతాడు. అక్కడి నుంచి తప్పించుకోవాలని దేవన్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. చివరకు ఏమైంది? ఇంతకీ కుముదన్ పొట్టి ఎవరు? అనేది ఈ సినిమాలో చూపించారు దర్శకుడు.
Also Read: తండ్రిలాంటి వ్యక్తితో సంబంధం కట్టారు - అందుకే ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ వదిలేశా: జయలలిత