Seethe Ramudi Katnam September 4th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అత్తా కోడళ్ల ఛాలెంజ్ అదుర్స్.. సుమతి వస్తే మహాలక్ష్మీ తట్టాబుట్టా సర్దాల్సిందేనా!
Seethe Ramudi Katnam Today Episode సుమతిని ఇంటికి తీసుకొచ్చి మహాలక్ష్మీని ఇంటి నుంచి గెంటేస్తానని సీత మహాతో ఛాలెంజ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ, జనార్థన్ చేతుల మీదగా కిరణ్, రేవతిల నిశ్చితార్థాన్ని సీత జరిపిస్తుంది. తర్వాత రేవతి, కిరణ్‌లు అందరి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత సీత ముఖర్జీకి అక్షింతలు ఇచ్చి దీవించమని అంటుంది. ముఖర్జీ నిశ్చితార్థంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మహాలక్ష్మీ, జనార్థన్‌లకు చెప్తాడు. ఇక ప్రాజెక్ట్ కూడా మీకు వచ్చేలా చేస్తానని అంటాడు. ఇక సీత కావాలనే ముఖర్జీకి సుమతి గురించి చెప్తుంది. సుమతి జనా మొదటి భార్య అని ఆస్తి మొత్తం ఆమెదే అని చెప్తుంది. దాంతో ముఖర్జీ మహాలక్ష్మీ ఎవరని అడుగుతాడు. దాంతో రామ్ తను పిన్ని అని తన తండ్రికి రెండో భార్య అని చెప్తాడు.
సీత వాళ్ల మాటలకు ముఖర్జీ ఈ కంపెనీకి అసలైన వారసురాలు సుమతి ఏనా అని అంటాడు. సీత అవునని చెప్తుంది. ఇక మహాలక్ష్మీ మనసులో అనవసరంగా ఇప్పుడు సుమతి గురించి ఎందుకు చెప్తుంది నన్ను అవమానించడానికేనా అని అనుకుంటుంది. ఇక ముఖర్జీ ఫ్యామిలీ బాగా నచ్చిందని చెప్పి వెళ్లిపోతాడు. రామ్, సీత అతనికి పంపిస్తారు.
కిరణ్: ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి మా పెళ్లి పెద్దలుగా తాంబూలం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నయ్య గారు.
రేవతి: తోడ బుట్టకపోయినా చాలా సాయం చేశారు థ్యాంక్స్.
లలిత: సీతకి నువ్వంటే చాలా ఇష్టం రేవతి నీ గురించే సీత ఎప్పుడూ చెప్తుంది సీత చెప్పడంతో మేం వచ్చాం.
చలపతి: మరి ఇన్నాళ్లు ఈ ఇంట్లో సీతకి రేవతి గారే సపోర్ట్‌గా వస్తున్నారు కదా. ఆమె కోసం సీత ఈ మాత్రం చేయదా ఏంటి.
రేవతి: సీతని హగ్ చేసుకొని థ్యాంక్యూ సీత అంతా నేను కోరుకున్నట్లు చేశావ్ నాకు చాలా సంతోషంగా ఉంది.
కిరణ్: థ్యాంక్యూ రామ్ నువ్వు సీత చాలా సాయం చేశారు.
చలపతి: అన్నయ్య గారు పెళ్లి కూడా మీరే ఇలాగే చేయాలి. నిజానికి ఇక్కడ కొంత మంది కడుపులు కాలుతున్నట్లు ఉన్నాయి.
మహాలక్ష్మీ అండ్ బ్యాచ్ వెళ్లిపోతారు. ఇక శివకృష్ణ, లలితలు ఇంటికి వెళ్లిపోతారు. తన చేతులతోనే నిశ్చితార్థం జరిపించిందని ప్రాజెక్ట్ కోసం పరువు తీసుకున్నానని మహాలక్ష్మీ అనుకుంటుంది. సీత అక్కడికి వస్తుంది. అత్త ఎలా ఉంది ఈ కోడలి దెబ్బ. షాక్‌తో మైండ్ బ్లాక్ అయిపోయిందా అని అంటుంది. చేయను అన్న మీ చేతులతోనే నిశ్చితార్థం ఎలా జరిపించానో చూశారా అని అంటుంది. ప్రతీ సారి నువ్వే గెలవవు అని మహాలక్ష్మి అంటే న్యాయం నా వైపు ఉంది నేనే గెలిచాను అని గెలిపిస్తాను అని త్వరలోనే పెళ్లి చేస్తానని సీత అంటుంది.
మహాలక్ష్మీ: పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది కదా ఆ లోపు ఆ పెళ్లి చేస్తావో లేక నీ పెళ్లి పెటాకులు అవుతుందో ఎవరికి తెలుసు.
సీత: అదీ చూద్దాం అత్తయ్య. ఆ లోపు మా సుమతి అత్తయ్య రాకుండా పోతుందా. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతానో మీరు వెళ్లిపోతారో చూద్దాం.
రాత్రి సీత గదిలో రామ్ కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో సీత స్లిప్ అయి కళ్లద్దాలు కింద పడిపోతాయి. దాంతో సీతకు ఏం కనిపించదు. ఇంతలో రామ్ వస్తాడు. కళ్లద్దాలు చూసి తీసి దాచేస్తాడు. సీత కళ్లద్దాల కోసం వెతుకుతుంది. అవి లేకపోతే గదిలోకి ఎవరు వచ్చినా గుర్తు పట్టలేనని అనుకుంటుంది. ఇంతలో రామ్ సీతని గట్టిగా పట్టుకొని నేను దొంగని నిన్ను దోచుకుంటానని అంటాడు. నగలు డబ్బు కావాలంటే తీసుకో నన్ను వదిలేయ్ అని సీత అంటే నాకు డబ్బు, నగలు వద్దు నిన్ను దోచుకుంటా అంటాడు. ముద్దు పెట్టుకుంటా అని దగ్గరకు వెళ్తే సీత రామ్‌ని బెడ్ మీదకు తోసేసి కొట్టడానికి పూల కుండీ తీసుకొని వస్తుంది. దాంతో రామ్ సీత నేను రామ్‌ని అని చెప్తాడు. దాంతో సీత గొంతు మార్చి మాట్లాడుతున్నావా అని కొట్టడానికి వెళ్తుంది. రామ్ ఎంత చెప్పినా వినదు. దాంతో రామ్ సీతకి కళ్లద్దాలు ఇస్తాడు. సీత రామ్‌ని చూసి నవ్వుకుంటుంది. ముందే గుర్తు పట్టి కావాలనే ఇలా చేశానని చెప్తుంది. దాంతో రామ్ సీతని గట్టిగా పట్టుకుంటాడు. సీత కితకితలు పెట్టి వదిలించుకుంటుంది. రామ్‌ని కవ్వించి బయటకు వెళ్లిపోతుంది. ఉదయం మహాతో పాటు అందరూ కాఫీ తాగుతూ నిశ్చితార్థం గురించి మాట్లాడుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.