Seethe Ramudi Katnam Serial Today October 11th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతకి కోలుకోలేని దెబ్బ తీసిన మహాలక్ష్మీ.. భార్య చెంప చెల్లుమనిపించిన రామ్!
Seethe Ramudi Katnam Today Episode సీత బొటిక్‌ని మహాలక్ష్మీ అక్రమ కట్టడం అని హైడ్రాతో కూలగొట్టించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode అర్చన మహాలక్ష్మీ దగ్గరకు వెళ్లి సీతకు ఏం చేయలేకపోయావ్ అని సీతతో కాంప్రమైజ్ అయిపో అని అంటుంది. ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావ్ ఇంకోసారి అలా మాట్లాడకు అని మహాలక్ష్మీ అర్చనను హెచ్చరిస్తుంది. ఎన్నో ఛాలెంజ్‌లు చేశావ్ కానీ ఏం చేయలేకపోయావ్ అని అంటుంది. దాంతో మహాలక్ష్మీ ఈసారి నేను వేసే ప్లాన్‌తో సీత పని అయిపోతుందని సీత వ్యాపారాన్ని దెబ్బ తీసి ఇంట్లో కూర్చొపెడతా అని అంటుంది మహాలక్ష్మీ. ఈ సారి సీత షాప్ లేకుండా చేసి సీతకు పెద్ద షాక్ ఇస్తానని అంటుంది.
సీత బొటిక్ దగ్గర ఆఫీసర్లు కొలతలు చూస్తుంటారు. సీత అక్కడికి చేరుకుంటుంది. ఎవరు మీరు అని అడిగితే దానికి వాళ్లు మేం హైడ్రా అధికారులమని ఈ షాప్ రూల్స్‌కి విరుద్ధంగా ఉందని అందుకే కూల్చేస్తామని అంటారు. దానికి సీత వాళ్లని ఎంత బతిమాలినా వినకుండా అధికారులు షాప్‌కి సీల్ వేసేస్తారు. సీత చాలా బాధ పడుతుంది. స్వతంత్రంగా కాళ్ల మీద నిలబడాలని కష్టపడుతున్న తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదని అనుకుంటుంది. మరోవైపు మహాలక్ష్మీ అధికారులను కలిసి సీత రియాక్షన్ ఏంటి అని అడుగుతుంది. సీత చాలా బాధ పడిందని గడువు కూడా అడిగిందని అంటారు. ఆ షాప్ అక్రమ కట్టడం కాదని పై అధికారులకు తెలిస్తే తమ ఉద్యోగం పోతుందని అధికారులు మహాలక్ష్మీతో మొరపెట్టుకుంటారు. ఇక అందరూ ఇంట్లో ఉంటారు. ఇంతలో సీత డల్‌గా ఇంటికి వస్తుంది. ఉత్సాహంగా వెళ్లి డల్‌గా వచ్చావేంటని అందరూ ప్రశ్నిస్తారు.
సీత: షాప్ సీల్ చేశారు.
మహాలక్ష్మీ: అర్చనతో షాప్ నేను క్లోజ్ చేయించా.
సీత: ఓనర్‌కి నోటీసు ఇచ్చారంట ఆయన్ను కాంటాక్ట్ చేస్తే ఫలితం లేదు.
చలపతి: నీకు అధికారులు తెలుసు కదా చెల్లాయ్ చెప్పొచ్చు కదా.
మహాలక్ష్మీ: అక్రమ కట్టడం అయితే నేను ఏం చేయలేను కదా. షాప్ పోయింది బిజినెస్ పోయింది చివరకు చిప్ప మిగిలింది. ఏం చేయలేని వాళ్లు బిల్డప్ ఇస్తే ఇలాగే ఉంటుంది. ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు.
సీత: మీకు తెలుసు అంటున్నారు అంటే ఇదంతా మీరే చేయించారన్న మాట నా మీద కక్షతో మీరు షాప్ మూయించారన్నమాట ఈ కుట్ర వెనక మీరున్నమాట.
రామ్: ఆవేశంతో ఏదోదో మాట్లాడుతున్నావ్ సీత.. పిన్నికి నీ మీద కోపం ఎందుకు ఉంటుంది. కుట్రతో నీ షాప్ మూయించాల్సిన అవసరం తనకేంటి.
సీత: నేను ఎదుగుతున్నానని కుళ్లు మామ అందుకే పంతంతో ఇలా చేసింది.
రామ్: ఆపు ఆధారాలు లేకుండా అలా నిందలు వేయకు. పిన్నికి కోపం ఉండి ఉంటే షాప్ ఓపెన్ చేయించేదా. మీడియాతో నీ గురించి మాట్లాడేదా రెండు రోజుల క్రితం నీకు నడుం నొప్పి అంటే పిన్ని వెళ్లి షాప్ ఓపెన్ చేయించింది. ఆధారాలు లేని అబద్ధాలు చెప్పకు సీత. పిన్ని ఎవరినీ చీటింగ్ చేయదు. పిన్నిని అర్థం చేసుకో ఎంతో మందికి సాయం చేసింది. సూర్య ఆపరేషన్‌కి డబ్బు ఇచ్చింది కూడా పిన్నే
సీత: ఇంక ఆపు మామ మీ పిన్ని అందరి ముందు మంచిగా ఉంటుంది కానీ వెనక చేయాల్సినవి చేస్తుంది. మా బావ కాలు పోవడానికి కారణమే మీ పిన్ని. నన్ను తప్పించి మా అక్కతో నీకు పెళ్లి చేయాలి అనుకుంది. ఆవిడ ఆవులా కనిపించే పులి. నమ్మించి నట్టేటి ముంచేస్తుంది. మీ అమ్మని మాయం చేసింది కూడా ఇదే.
రామ్: సీతా అని చెంప పగల కొడతాడు. సీత నీ నోటి నుంచి ఇంకోక్క మాట మాట్లాడితే మరో చెంప పగులుతుంది.
మహాలక్ష్మీ: రామ్ ఏంటి నువ్వు అందరి ముందు సీతని అలా కొట్టేశావ్ సీత తెలీక ఏదో అంది తన మాటలకు ఆధారాలు లేవు అని నువ్వే అంటున్నావ్ కదా. సీత నన్ను అలా నిందించడం కొత్త కాదు కదా సీత మాటలకు నిందలు నాకు అలవాటు అయిపోయింది. ఎంత కోపం వచ్చినా కోపం కంట్రోల్ చేసుకోవాలి రామ్. సీత ఎంత చేసినా నాకు ఏం అనిపించదు. నాకు ప్రీతి, ఉషలు ఎంతో సీత అంతే.
రామ్: విన్నావా ఇప్పటికైనా అర్థం చేసుకో.
సీత గదిలోకి వెళ్లిపోతుంది. రామ్ బయటకు వస్తాడు. ఇక విద్యాదేవి అక్కడికి వచ్చి నువ్వు చేసిన పని మంచిది కాదు అని అంటుంది. అన్ని విషయాల్లో సీతకి అండగా ఉండాలని అంటుంది. దాంతో రామ్ ఎవరో షాప్ క్లోజ్ చేస్తే మా పిన్నిని అనడం ఏంటి అని అంటాడు. పిన్నిని అలా అవమానిస్తే నాకు బాధగా ఉంటుందని అంటాడు. దానికి విద్యాదేవి పిన్ని గురించి ఆలోచించడం కరెక్టే కానీ భార్యకి తోడుగా ఉండాలని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.