అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today May 7th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఓరి దేవుడా ఏం ట్విస్ట్‌రా.. కొడుకుని కాపాడి కరెంట్‌ షాక్‌తో కాలిపోయిన సుమతి, అల్లాడిపోయిన రామ్!

Seethe Ramudi Katnam Serial Today Episode : మహాలక్ష్మి తనకు చేసిన అన్యాయం తెలుసుకున్న సుమతి రామ్‌ని కాపాడబోయి కరెంట్ షాక్‌తో ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode : సుమతి చెప్పిన అడ్రస్‌కు మహాలక్ష్మి వస్తుంది. సుమతి కూడా అక్కడికి వస్తుంది. మహాలక్ష్మిని చూసి దగ్గరకు వెళ్తుంటుంది. ఇంతలో మహాలక్ష్మి దగ్గరకు రౌడీ రావడంతో సుమతి దాక్కుంటుంది. మెసేజ్‌ గురించి అడుగుతుంది. సుమతి..  మహాలక్ష్మి, రౌడీ రంగ మాటలను చాటుగా వింటుంది.  

మహాలక్ష్మి: నాకు తెలిసిన సుమతి ఒక్కర్తే. అది నువ్వు చంపిన సుమతి. ఆ రోజు నిన్ను సుమతిని యాక్సిడెంట్ చేసి చంపమని చెప్పాను కదా. అప్పుడు నిజంగా సుమతి చనిపోయిందా.

రంగ: అలా అడుగుతారేంటి మేడం ఆరోజు సుమతి కారుని నా లారీతో గుద్దాను. అప్పుడే సుమతి చనిపోయింది. కారు తుక్కుతుక్కు అయిపోయింది. అయినా ఇది జరిగి ఎన్నో ఏళ్లు అయితే ఇప్పుడు అడుగుతున్నారేంటి మేడమ్.

మహాలక్ష్మి: సుమతి పేరుతో ఇప్పుడు ఎవరో నాకు మెసేజ్ చేశారు. నువ్వు మెసేజ్ చేయలేదు. ఇక్కడికి వస్తున్నప్పుడు ఇంట్లో పూజ చేస్తున్న సీతని చూశాను అది కూడా ఈ మెసేజ్ చేసుండరు. మరి ఎవరు ఈ మెసేజ్ చేసుంటారు. సుమతి చావు నీకు నాకు తప్ప మరెవరికీ తెలీదు. ఇది ఎవరో నా గురించి బాగా తెలిసిన వారే ఇలా చేసుంటారు. మెసేజ్ చేసిన ఫేక్ సుమతి ఎవరో ఇంకా ఇక్కడికి రాలేదు. 

రంగ: ఎవరో వేరే సుమతి అయ్యుంటారు మేడమ్. వేరే వాళ్లకి చేయబోయి మీకు మెసేజ్ చేసుంటారు వదిలేయండి.

మహాలక్ష్మి: నాకు అలాగే అనిపిస్తుంది. సుమతి విషయం నువ్వు ఇక్కడే మర్చిపోవాలి. మూడో మనిషికి తెలీకూడదు. తెలిసిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. 

సుమతి: నేను ఎంత మోస పోయాను. మహాలక్ష్మి నిజస్వరూపం ఇదా. కిరాయి హంతకులతో నన్ను చంపించాలనుకుందా. నా ఆస్తి కోసం నా భర్త పిల్లల కోసం నా అడ్డు తొలగించుకోవాలనుకుందా.  మహాలక్ష్మి నన్ను దారుణంగా మోసం చేసింది. ఇది ఇంత మోసగత్తె అని తెలిసుంటే నా ఇంట్లోకి రానిచ్చేదాన్ని కాదు. దాని వల్ల నేను అప్పుడు బాధ పడ్డాను. ఇప్పుడు నా మేనకోడలు ఇప్పుడు బాధ పడుతుంది. ఇప్పుడే ఇంటికి వెళ్లి ఆ మహాలక్ష్మిని తన్ని తరిమేసి నా భర్త పిల్లల్ని నా మేనకోడలు సీతని రక్షించుకోవాలి. 

సీత తెగిన ముత్యాలహారంలోని ముత్యాలు మళ్లీ దండలా గుచ్చుతుంది. తనకు కీడు శంఖిస్తుందని బాధ పడుతుంది. మరోవైపు రామ్‌ కారులో వెళ్తుండగా దాహం వేసి చూస్తే బాటిల్  ఉండదు. సీత వాటర్ బాటిల్ పెట్టలేదని ఒక బాటిల్ కొనుక్కోవాలని ఓ చోట ఆగుతాడు. మరోవైపు సుమతి మహా అంతు తేలుస్తానని ఆవేశంగా వెళ్తుంటుంది. ఇంతలో రామ్‌ని చూస్తుంది. అయితే రామ్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉండగా ఓ లారీ రామ్ మీదకు వస్తుంటుంది. అది సుమతి చూస్తుంది. రామ్‌ని పిలిచినా వినిపించుకోడు. సుమతి పరుగున వెళ్లి రామ్‌ని కాపాడుతుంది. అయితే సుమతిని లారీ ఢీ కొట్టడంతో ట్రాన్స్‌ఫార్మర్ మీద పడి కరెంట్ షాక్ తగిలి ముఖం గుర్తుపట్టలేనంతగా మాడిపోతుంది. 

రామ్‌తో పాటు చుట్టు పక్కల వాళ్లు పరుగున వెళ్తారు. రామ్ అక్కడి వారికి సాయం చేయమని కారులో సుమతిని ఎక్కించి హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. మరోవైపు సీత టెన్షన్ పడుతుంది. తన భర్త క్షేమంగా ఆఫీస్‌కు వెళ్లాడా లేదా అని కాల్ చేయాలనుకుంటుంది. ఇక తన తల్లే అని తెలియని రామ్ సుమతికి ఏం కాకూడదని వేడుకుంటాడు. ఇంతలో సీత కాల్ చేస్తే తనకు పెద్ద ప్రమాదం తప్పిందని ఆమె రిస్క్‌లో ఉందని హాస్పిటల్‌కి వెళ్తున్నాని చెప్తాడు. సీత కూడా హాస్పిటల్‌కి వస్తానని అంటుంది. 

మరోవైపు సుమతి తల్లి సుమతి కోసం వెతుకుతూ ఉంటుంది. సుమతి కనిపించడం లేదని ఇంట్లో వాళ్లకి చెప్తుంది. అందరూ కంగారు పడతారు. రామ్ సుమతిని హాస్పిటల్‌కి తీసుకొస్తాడు. సీత కూడా హాస్పిటల్‌కి వస్తుంది. తనని యాక్సిడెంట్‌ నుంచి తప్పించి ఆవిడ ప్రమాదంలో పడిందని రామ్ జరిగింది సీతకు చెప్పి బాధ పడతాడు. సీత రామ్‌కి ధైర్యం చెప్తుంది. పెషెంట్‌ ఏమవుతారని నర్స్ అడిగితే సీత వెంటనే పేషెంట్ తనకు అమ్మ అవుతుందని పేరు సుమతి అని తనకు తెలీకుండానే నిజం చెప్తుంది. రామ్ ఎమోషనల్‌గా ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ : ముకుంద డబుల్ గేమ్ తెలుసుకున్న కృష్ణ.. మురారి పక్కన చూసి రచ్చ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Pawan Kalyan News: ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
Roti Kapda Romance Review - రోటి కపడా రొమాన్స్ రివ్యూ: రొమాంటిక్‌గా కలిశాక... లవర్స్ మధ్య ప్రాబ్లమ్స్ వస్తే?
రోటి కపడా రొమాన్స్ రివ్యూ: రొమాంటిక్‌గా కలిశాక... లవర్స్ మధ్య ప్రాబ్లమ్స్ వస్తే?
GV Prakash Kumar: జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
Embed widget