Seethe Ramudi Katnam Serial Today March 19th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతకు రొమాంటిక్ యాక్సిడెంట్.. సుమతి మర్డర్ కేసులో కీలక మలుపు!
Seethe Ramudi Katnam Today Episode సుమితిని పొడిచిన కత్తి మీద సీత వేలిముద్రలతో పాటు మరొవ్యక్తికి ఉన్నాయని శివకృష్ణ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత కారులోనే బట్టలు మార్చేసి మిధునలా సీఐ త్రిలోక్‌కి కనిపిస్తుంది. రేవతి ఫోన్‌లో ఇంగ్లీష్ చెప్తుంటే సీత వాటిని త్రిలోక్‌కి అప్పజెప్పేస్తుంది. ఈ నెల 16న అమెరికా నుంచి ఇండియా ఇచ్చానని మిధున చెప్తుంది. ఇక త్రిలోక్ కారు చెక్ చేస్తాడు. సీత తన చీరని త్రిలోక్ చూడకుండా కారులో దాచేస్తుంది. ఇక సీత అలియాస్ మిధునని పంపేస్తాడు. సీత రేవతితో సీన్ ఓవర్ పిన్ని అని చెప్తుంది. త్రిలోక్ మహాలక్ష్మీకి కాల్ చేసి మిధున రోడ్డు మీద కలిసిందని మిధున అచ్చం సీతలా ఉందని అంటాడు.
మహాలక్ష్మీ: ఇంతకీ తను సీత అయ్యే ఛాన్స్ ఉందా మీరు ఏమైనా కనిపెట్టారా.
త్రిలోక్: మీరు సీతని ఈ నెల 16న ఇంటి నుంచి పంపేశారా. మిధున కూడా ఇండియా వచ్చిన డేట్ అదే అని చెప్తుంది. అద కో ఇన్స్‌డెన్స్ అనుకుంటున్నా ఆ ఒక్క డౌట్ తప్ప మరే అనుమానం లేదు.
మహాలక్ష్మీ: మేం సీతని మిధునని రెండు ప్లేస్‌లలో ఒకేసారి చూశాం. ఎందుకైనా మంచిది అని మీకు చెప్పాం.
త్రిలోక్: ఇంకాస్త డీప్‌గా పరిశీలిస్తే తేలిపోతుంది.
మహాలక్ష్మీ: మీ ప్రయత్నంలో మీరు ఉండండి ఏమైనా తెలిస్తే చెప్పండి.
సీత మోడ్రన్ డ్రస్‌లో రేవతి వాళ్ల దగ్గరకు వెళ్లి త్రిలోక్‌కి ఏం అర్థం అవ్వలేదని అంటాడు. ఇప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని సీతతో రేవతి వాళ్లు చెప్తారు. ఇక అక్కడికి సీత తండ్రి రావడం చూసి సీత కంగారు పడుతుంది.నాన్న నన్ను ఇలా చూస్తే ఇబ్బంది అని బట్టలు మార్చుకోవడానికి వెళ్తుంది. ఇక కిరణ్, రేవతిలు శివకృష్ణతో మాట్లాడుతారు. సీత చీర మార్చుకొని వచ్చేస్తుంది. సుమతి కేసు ఇన్విస్టిగేషన్ చేస్తున్నానని ఆ కేసు పని మీదే వచ్చానని శివకృష్ణ చెప్తాడు. సుమతిని చంపడానికి వాడిని కత్తి మీద ఇంకో వేలి ముద్రలు కూడా ఉన్నాయి అని మహాలక్ష్మీ ఇంట్లో అందరి వేలిముద్రలు తీసుకోవాలని చెప్తారు. ఇంట్లో ఒకరి మీద తనకు అనుమానం ఉందని వాడే తనని కూడా చంపడానికి ప్రయత్నించాడని సీత గౌతమ్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడుతుంది. సీత, శివకృష్ణలు బయల్దేరుతారు. శివకృష్ణకు మిధున క్యారెక్టర్ గురించి కిరణ్ వాళ్లు నిజం చెప్పమని సీతకి చెప్తే ఇప్పుడు వద్దని టైం వచ్చినప్పుడు చెప్తానని అంటుంది.
సీత, శివకృష్ణ మహాలక్ష్మీ ఇంటికి వెళ్తారు. ఎందుకు ఇలా వచ్చారు. ఈసారి అయినా మీ గన్ మీ దగ్గరే ఉందా సీతకి ఇచ్చారా అని మహాలక్ష్మీ అడుగుతుంది. దానికి సీత ఈ సారి బాంబ్ తీసుకొచ్చానని అంటుంది. సుమతి మర్డర్ కేసు పని మీద వచ్చానని మీ అందరి వేలి ముద్రలు కావాలని శివకృష్ణచెప్తాడు. మావి ఎందుకు అని మహాలక్ష్మీ అడిగితే సుమతి అక్కని పొడిచిన కత్తి మీద సీత వేలిముద్రలతో పాటు మరొకరి వేలి ముద్రలు ఉన్నాయని ఎంక్వైరీలో పనిగా వచ్చామని చెప్తారు. ఇంట్లో అందరి వేలి ముద్రలు తీసుకోమని అంటారు. వేలి ముద్రలు ఇవ్వడం కుదరదు అని మహాలక్ష్మీ అంటుంది. ఎవరూ చెప్పినా వినని మీరు మామ చెప్తే వింటారు అని మామతో తేల్చుకుంటానని సీత రామ్ దగ్గరకు వెళ్తుంది. మహాలక్ష్మీ మనసులో ఫ్రింగర్ ఫ్రింట్స్ ఇవ్వకూడదు ఇస్తే గౌతమ్‌నే మర్డర్ చేసింది అని తెలిసిపోతుందని అనుకుంటుంది. సీత రామ్ దగ్గరకు వెళ్లి ఫోన్ మాట్లాడుతున్న రామ్‌ని గుద్దేసి ఇద్దరూ బెడ్ మీద పడిపోతారు. ఇదేంటి ఇది అని రామ్ అడిగితే రొమాంటిక్ యాక్సిడెంట్ మామ అని సీత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

