Seethe Ramudi Katnam Serial Today June 10th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అత్తకి వీడియో చూపించి చెమటలు పట్టించేసిన సీత.. జీవితంలో తనకి కాల్ చేయొద్దని మహాకి చెప్పేసిన మధు!
Seethe Ramudi Katnam Serial Today Episode మధుమితకి కాల్ చేసిన మహా మళ్లీ తనని రామ్‌కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పగా మధు సూర్యతోనే ఉంటాను అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ జనార్థన్ బ్రేస్‌లెట్ విద్యాదేవి దొంగతనం చేసిందని నిందిస్తే అర్చన దొంగతనం చేసి దాన్ని విద్యాదేవి బ్యాగ్‌లో వేసినట్లు సీత వీడియో చూపిస్తుంది. శిక్ష ఏం వేద్దామని సీత అంటుంది. ఇంటి నుంచి పంపేస్తామా అని అంటుంది. మహాలక్ష్మి అర్చనను సీరియస్‌గా చూసి అందరి ముందు చెంప పగలగొడుతుంది. ఇక అర్చనకు మహా సైగ చేసి కావాలనే అర్చనను మహాలక్ష్మి తిడుతుంది. రామ్ కూడా సీరియస్ అవుతాడు.
మహాలక్ష్మి: అర్చన విద్యాదేవికి సారీ చెప్పు. క్షమించమని అడుగు.
అర్చన: సారీ విద్యాదేవి గారు క్షమించండి.
చలపతి: సారీ చెప్తే సరిపోతుందా శిక్ష ఉండాలి కదా.
విద్యాదేవి: సారీ చెప్పారు కదా శిక్ష వద్దు.
సీత: అది మా టీచర్ అంటే శత్రువులను కూడా క్షమిస్తారు.
రామ్: అమ్మా.. సారీ అమ్మ నేను కూడా మిమల్ని అనకూడని మాటలు అన్నాను. నన్ను క్షమించండి.
విద్యాదేవి: పర్లేదు బాబు నా మీద ఉన్న నమ్మకమే మీతో అలా మాట్లాడించింది.
సీత: అందరికీ నిజం తెలిసింది కదా ఇక మా టీచర్‌కి సన్మానం చేస్తారా అత్తయ్య గారు.
మహాలక్ష్మి సరే అని విద్యాదేవికి సన్మానం చేస్తుంది. సీత గురుబ్రహ్మ గురు విష్ణు అంటూ పాట పాడుతుంది. విద్యాదేవి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక మహా విద్యాదేవికి చీర, డబ్బు ఇస్తే విద్యాదేవి వద్దు అనేస్తుంది. ఇక రామ్ తన కుటుంబం మీ పట్ల తప్పుగా ప్రవర్తించింది కాబట్టి క్షమాపణలు చెప్పి కొన్ని రోజులు తమ ఇంట్లో ఉండాలి అనుకున్నారు కాబట్టి మాతో ఉండమని కోరుతాడు. విద్యాదేవి సంతోషంతో సరే అంటుంది. మహా కోపంతో రగిలిపోతుంది.
అర్చన: ప్లానింగ్ ఏమో నీది.. చెంప దెబ్బ నాకా మహా. అందరి ముందు నన్ను కొట్టి అవమానిస్తావా మహా.
మహాలక్ష్మి: నేను కొట్టకపోయి ఉంటే సీతో ఆ విద్యాదేవో నిన్ను కొట్టేవాళ్లు. అయినా ఎవరూ చూడకుండా చేయమంటే సీతకి దొరికి పోయావు. సీత వీడియో తీసుకున్న వరకు ఏం చేశావ్.
అర్చన: అయినా నన్ను కొట్టకుండా ఉండాల్సింది మహా. ఆ విద్యాదేవి ముందు నా పరువు పోయింది.
మహాలక్ష్మి: మళ్లీ అదే అంటున్నావ్. ఆ విద్యాదేవి దొంగ అని తేలుతుందని తలా ఓ మాట అనేశాం. నువ్వేమో ఏకంగా కొరడా దెబ్బలు అంటూ చెలరేగిపోయావ్. నేను నిన్ను కొట్టకపోయి ఉంటే ఆ శిక్షలు నీకు పడేవి. నేను నిన్ను కాపాడాను.
ఇంతలో సీత చప్పట్లు కొట్టుకొని వస్తుంది. ఒకర్ని ఒకరు బాగానే కాపాడుకున్నారు అని అంటుంది. మీ ఇద్దరినీ నేను కాపాడాను అని సీత అంటుంది. మహానే ఇందంతా చేసింది మీరే అని నాకు తెలుసు అని ఇందాక సగం సినిమా చూపించాను అని మిగతా సినిమా ఇప్పుడు చూడండి అని అంటుంది. మహా, అర్చన ప్లాన్ గురించి మాట్లాడుకోవడం సీత వీడియో తీసి మహాకి చూపిస్తుంది. మహా, అర్చనలు షాక్ అయిపోతారు. ముందే మీ మీద నిఘా పెట్టాను అని అంటుంది. తన భర్త మహాని దేవతలా చూస్తున్నాడు అని మీరు ఇలాంటి వారు అని తెలిస్తే ఆయన మనసు ముక్కలు అవుతుందని చెప్పలేదని సీత అంటుంది. విద్యాదేవి టీచర్‌ని పంపేయాలి అనుకున్నారు కానీ టీచర్ ఇంకో వారం పదిరోజులు ఇక్కడే ఉంటారు అని సీత చెప్తుంది. సీత ఇచ్చిన ట్విస్ట్‌కి మహా తనని ఒంటరిగా వదిలేయమని అరుస్తుంది
మహాలక్ష్మి మధుకి కాల్ చేస్తుంది. అనవసరంగా పందెం కాసి నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం అయ్యాను అని మహా మధుకి సారీ చెప్తుంది. ఆశ పెట్టి నిరాశ పరిచినందుకు కోపంగా ఉందా అని అడుగుతుంది మహా. దానికి మధు మీ మీద నాకు ఎందుకు కోపం ఉంటుంది అండి జరిగిపోయింది వదిలేయండి అని అంటుంది. మహా అలా ఎలా వదిలేస్తాం నిన్ను మళ్లీ ఇక్కడికి తీసుకొస్తా అని అంటుంది. దానికి మధు ఇక వదిలేయండి నేను ఎక్కడికి రాను ఇక్కడే ఉంటాను అంటుంది. మహా షాక్ అయిపోతుంది. మధుని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అయినా మధు ఒప్పుకోదు. అయినా మహా ఒప్పుకోకపోతే మధు ఇక తనకు కాల్ కూడా చేయొద్దు అని గుడ్ బాయ్ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.