అన్వేషించండి

Satyabhama Serial Today June 10th: సత్యభామ సీరియల్: మైత్రి, హర్షల ప్రేమ గురించి తెలుసుకున్న నందిని.. క్రిష్‌ని రక్తమొచ్చేలా కొట్టిన కాళీ!

Satyabhama Serial Today Episode: విశ్వనాథాన్ని బెదిరిస్తూ సంధ్యని పెళ్లి చేసుకోవాలి అని కాళీ ప్రయత్నిస్తున్నాడు అని క్రిష్ తెలుసుకొని కాళీ దగ్గరకు వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode: క్రిష్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అని చేసి చూపించడంతో.. సత్య క్రిష్‌ని తిడుతుంది. తాగిన మత్తులో ఉన్న తనని ఆపాలి అని తెలీదా అని తిడుతుంది. కొన్ని నెలల్లో విడిపోతున్నాం కదా నీ పరిమితుల్లో నీకు ఉండటం తెలీదా.. అవకాశం దొరికింది కదా అని నా జీవితం నాశనం చేసేశావ్ అంటూ చివాట్లు పెడుతుంది. క్రిష్ నిజం చెప్పాలి అని ప్రయత్నించినా వినదు. క్రిష్ ఏం చెప్పినా వినకుండా గట్టిగా తిట్టేసి వెళ్లిపోతుంది. 

మరోవైపు విశాలాక్షి వ్రతానికి ఏర్పాట్లు చేస్తుంది. విశ్వనాథం అక్కడికి వచ్చి ముభావంగా ఉండటం బాలేదు అని అంటాడు. సమస్యల వలలో చిక్కుకున్నాం కాబట్టి ఇలా ఉన్నాను అని అంటుంది. ఇక విశ్వనాథం సంధ్యకు ధైర్యం చెప్పాను అని తాను బాగానే ఉందని మనం కూడా నార్మల్‌గానే ఉందాం అప్పుడే పిల్లలు చక్కగా ఉంటారు అని అంటాడు. ఇక సత్య వాళ్లకి కాల్ చేసి చెప్పమంటాడు.

విశాలాక్షి సత్యకి కాల్ చేసి తొందరగా రమ్మని చెప్తుంది. క్రిష్ బయటకు వెళ్లాడు అని వచ్చాక వస్తామని సత్య అంటుంది. ఇక భైరవికి కాల్ ఇవ్వమని విశాలాక్షి అంటే సత్య ఇవ్వదు. ఇక విశ్వనాథం వాళ్ల ఇంటికి మైత్రి వస్తుంది. ఇక సంధ్య మైత్రి వచ్చిందని హర్షని పిలుస్తుంది. మైత్రి తనకు పెళ్లి ఫిక్స్ అయిందని అది చెప్పడానికే వచ్చాను అని అంటుంది. ఇక నందిని రావడంతో విశాలాక్షి పరిచయం చేస్తుంది. వ్రతం పూర్తి అయ్యేవరకు ఉండమని చెప్తారు. ఇక నందిని మనసులో.. ఎవరీ క్యారెక్టరూ ఇంతలా ప్రేమలు కురిపిస్తున్నారేంటి అని అనుకుంటుంది.

మరోవైపు క్రిష్ తన ఫ్రెండ్స్‌ని కలుస్తాడు. ఇంతలో బాబీ క్రిష్‌ దగ్గరకు పరుగున వచ్చి కాళీ హాస్పిటల్‌ నుంచి బయటకు వచ్చాడని.. వాడు బయటకు వస్తూనే నీకు రివర్స్ డోస్ ప్లాన్ చేశాడు అని.. వదిన వాళ్ల నాన్నని బెదిరిస్తున్నాడు అని నీ మరదలిని ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాడని బాబీ చెప్తాడు. క్రిష్‌ కోపంతో వాడు సత్య ఫ్యామిలీ జోలికి వచ్చాడు అంటే నా ఫ్యామిలీ జోలికి వచ్చినట్లే అని అంటాడు.  కోపంతో కాళీ ఉన్న దగ్గరకు వెళ్తాడు. బాబీ వాళ్లు వస్తాం అంటే వద్దు అని క్రిష్ ఒక్కడే వెళ్తాడు. 

సత్య తన అత్తయ్య దగ్గరకు వెళ్లి నేను వ్రతానికి వెళ్లి వస్తాను అని అంటుంది. భైరవి కావాలనే నా పుట్టింటి తాళుక చుట్టాలు వస్తాను అన్నారు అని వాళ్లు వచ్చే టైంకి నువ్వు లేకపోతే నా పరువు పోతుందని అంటుంది. ఇక సత్య ఎంత చెప్పినా భైరవి వద్దని అంటుంది. ఏదో ఒక వంక పెట్టుకొని పుట్టింటికి వెళ్లి వస్తున్నావ్ అని అత్తారింటి కంటే పుట్టింటిలోనే ఎక్కువ ఉంటున్నావ్ అని అంటుంది. సత్య రెండు చేతులు జోడించి తన వాళ్ల తరుఫున క్షమాపణ అడుగుతుంది. 

మైత్రి, హర్ష మాట్లాడుకుంటారు. హర్ష సైలెంట్‌గా ఉంటాడు. ప్రేమించడం కంటే ప్రేమను మర్చిపోవడం కష్టంగా ఉంటుందని మైత్రి అంటుంది. మనసు నిండా ప్రేమ ఉండి సరిగా మాట్లాడలేకపోతున్నాం అని అంటుంది మైత్రి. ఇక ఇద్దరూ మాట్లాడుకోవడం నందిని చూస్తుంది. సంధ్య అక్కడికి రావడంతో మైత్రి గురించి అడుగుతుంది. మైత్రి మా అక్క ఫ్రెండ్ అని ఫ్యామిలీకి బాగా క్లోజ్ అని  చెప్తుంది.

నందిని తనకు ఈ ఇన్‌ఫర్‌మేషన్ సరిపోదు అని నువ్వు దాస్తున్న నిజం చెప్పు అని సంధ్యతో అంటుంది. ఇక సంధ్య నువ్వు ఎంత మంది దేవుళ్లకు మొక్కు కున్నా నీకు మా అన్నయ్య కంటే మంచి భర్త దొరకడు అని అంటుంది. నందిని ఒప్పుకోకపోవడంతో మా అన్నయ్య ప్రేమించిన మైత్రి లాంటి మంచి అమ్మాయిని దూరం చేసుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్తుంది. నందిని మాత్రం హర్ష, మైత్రిల మధ్య ఇంకా సంబంధం ఉంది అని అనుకుంటుంది.

మరోవైపు కాళీ తన బ్యాచ్‌తో మందు తాగుతుంటాడు.  క్రిష్ అక్కడికి వస్తాడు. కాళీ భయపడతాడు. క్రిష్‌ని చూసిన కాళీ క్రిష్‌ కాళ్ల మీద పడి క్షమించమని అడుగుతాడు. ఇంతలో మరో రౌడీ క్రిష్ తల మీద కొట్టేస్తాడు. క్రిష్‌ని రౌడీలు  కొడుతుంటే కాళ్లు పట్టుకొని కాళీ లాగేస్తాడు. క్రిష్‌ని కాళీ గట్టిగా కొడతాడు. క్రిష్‌ సృహా కోల్పోతాడు. ఇక సత్య క్రిష్‌ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న చేతిలో చేయి వేసి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన కార్తీక్.. బావ కాలర్ పట్టుకొని నిలదీసిన మరదలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Embed widget