Seethe ramudi katnam Serial Today August 31st: ‘సీతే రాముడి కట్నం సీరియల్ : తాంబూలాలు తీసుకోవడానికి వచ్చిన శివకృష్ణ దంపతులు – ఇంట్లోంచి వెళ్లిపోయిన మహా, జనా.
Seethe ramudi katnam Today Episode: మహా, జనా ఇద్దరు కలిసి రేవతి ఎంగేజ్ మెంట్ చెడగొట్టి బయటకు వెళ్లిపోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Seethe ramudi katnam Serial Today Episode: కిరణ్ తరపున తాంబూలాలు తీసుకోవడానికి వాళ్లు వస్తున్నారు అని రామ్ చూపించడంతో అందరూ షాక్ అవుతారు వస్తున్నది ఎవరా? అని గుమ్మం వైపు చూస్తారు. అక్కడ శివకృష్ణ వాళ్లు తాంబూలం పట్టుకుని ఉంటారు. వాళ్లను చూసిన మహాలక్ష్మీ, జనార్దన్ షాక్ అవుతారు. ఇప్పుడు నిశ్చితార్థం ఎలా ఆపుతారో చూస్తామని చలపతి అనడంతో ఈ నిశ్చితార్థానికి మేము ఒప్పుకోమని చెప్తారు. దీంతో అందరి మధ్య గొడవ జరుగుతుంది. మరోవైపు రేవతి కిందకు వెళ్లబోతుంటే విద్యాదేవి ఆపుతుంది.
రేవతి: కింద ఏదో గొడవ జరుగుతున్నట్లుంది టీచర్. నేను వెళ్లి చూసి వస్తాను.
విద్యాదేవి: వద్దు రేవతి ఏం జరిగినా సీత చూసుకుంటుంది. నువ్వు కంగారుపడకు.
రేవతి: లేదు టీచర్ నావల్ల సీత మాటలు పడటం నాకు ఇష్టం లేదు. నా కోసం సీత కింద ఫైట్ చేస్తుంటే ఏమీ పట్టనట్టు నేను పైన ఉండటం కరెక్టు కాదు.
విద్యాదేవి: సీతకు తోడుగా రాము ఉన్నాడు కదా రేవతి వాళ్లు మేనేజ్ చేస్తారు. వాళ్లు వచ్చి పిలిచినప్పుడే కిందకు వెళ్దాం.
రేవతి: అంత వరకు నేను ఆగలేను టీచర్. కిరణ్ కూడా వచ్చినట్టు ఉన్నాడు. ఆయన్ని ఎన్ని మాటలు అంటున్నారో..? రండి టీచర్ వెళ్దాం.
విద్యాదేవి: నీ ఇష్టం రేవతి. నువ్వు వెళ్లు. నన్ను చూస్తే మీ మహలక్ష్మీ వదినకు మరింత కోపం పెరుగుతుంది. నిన్నింకా ఎక్కువ మాటలు అంటుంది.
రేవతి: సరే టీచర్ మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లొస్తాను.
అని రేవతి వెళ్లిపోతుంది.
విద్యాదేవి: కింద నుంచి అన్నయ్యా, వదినల గొంతు వినిపిస్తుందేంటి? అయినా వాళ్లెందుకు వస్తారు. గొడవ సద్దుమణిగాక అన్ని విషయాలు తెలుస్తాయి.
అని విద్యాదేవి అనుకుంటుంది. మరోవైపు జనార్థన్, మహాలు శివకృష్ణ వాళ్లను అవమానిస్తుంటారు. ఆరోజు మీ పెద్ద చెల్లెలు విషయంలో.. మీ పెద్ద కూతురు మధు విషయంలో ఒకలా ఇంకొకరి విషయంలో ఇంకోలా ఉంటారేంటి అని ప్రశ్నిస్తారు. దీంతో మేమెప్పుడు ప్రేమ పెళ్లిలకు వ్యతిరేకం కాదని శివకృష్ణ వాళ్లు చెప్తారు. ఇంతలో తాము ఇక్కడ ఉండలేమని కలకత్తా నుంచి ముఖర్జీ గారు వచ్చారని మాకు ఆయనతో బిజినెస్ డీల్ ఉందని మహాలక్ష్మీ, జనార్థన్ వెళ్లబోతుంటే సీత ఆపుతుంది.
సీత: ఆగండి మామయ్య.. ఇంట్లో మీ చెల్లెలికి నిశ్చితార్తం జరుగుతుంటే ఇది వదిలేసి బిజినెస్ కోసం వెళ్తారా?
మహా: మాకు ఆ ప్రాజెక్టు ఇంపార్టెంటు కానీ ఇష్టం లేని ఈ ఎంగేజ్‌మెంట్ కాదు.
సీత: అంటే మీకు సొంత మనుషుల కన్నా వ్యాపారమే ముఖ్యమైందా?
జనా: ఆ ప్రాజెక్టు ఎంత ముఖ్యమో రామ్ కు తెలుసు కావాలంటే వాణ్నే అడుగు.
శివకృష్ణ: వ్యాపారం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో జరిగే శుభకార్యం ముఖ్యం కదా బావ.
మహా: ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి మేము చేసేది కిరాణ కొట్టు వ్యాపారం కాదు.
అంటూ వెళ్లబోతుంటే ఒక్క గంట ఉండి వెళ్లలేరా? అని సీత అడుగుతుంది. దీంతో రామ్ కూడా ముఖర్జీ గారిని ఒక గంట వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేయమని జనార్ధన్ ను అడుగుతాడు. లేదని ఇద్దరూ వెళ్లబోతుంటే రేవతి తన అన్నా వదినలకు దండం పెట్టి నా నిశ్చితార్థం జరిపించండి అని వేడుకుంటుంది. దీంతో ఎవరేం చెప్పినా మేము వినము అని జనార్ధన్ చెప్పగానే రేవతి ఏడుస్తూ పైకి వెళ్లిపోతుంది. జనా, మహా ఆఫీసుకు వెళ్లిపోతారు. తర్వాత సీత, రేవతి, రామ్ ముగ్గురూ కలిసి గిరి, అర్చన దగ్గరకు వెళ్తారు. మీకు కూడా బాధ్యత ఉంది కదా అంటూ మీరు పెద్దరికం తీసుకుని ఈ కార్యక్రమం జరిపించండి అని సీత అడుగుతుంది. మేము ఆ పని చేయలేమని చెప్పేస్తారు గిరి, అర్చన దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్, కావ్యను విడదీసేందుకు రుద్రాణి ప్లాన్ – స్వప్నను పూల్ చేసిన రాహుల్