Seethe Ramudi Katnam Serial Today December 31st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మరీ దారుణంగా ఆలోచిస్తున్న సీత.. భగవంతుడా.. ఇలాంటి చావు ఎవరికీ వద్దు!
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ నిజంగా చనిపోయిందా లేదంటా ఇదంతా నాటకమా అని సీత తన అనుమానాన్ని తండ్రి, టీచర్‌తో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ చనిపోయింది అని విద్యాదేవినే చంపిందని సీఐ త్రిలోక్ చెప్పి విద్యాదేవిని అరెస్ట్ చేయాలని అంటారు. సీత మాత్రం తను సుమతి అత్తమ్మ ఆమె చంపదు అని చెప్తుంది. విద్యాదేవిని అరెస్ట్ చేయమని త్రిలోక్ కానిస్టేబుల్స్‌కి చెప్తారు. ఇక అప్పుడే శివకృష్ణ అక్కడికి వస్తాడు. టీచర్‌ని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటాడు.
శివకృష్ణ: ఆవిడను అరెస్ట్ చేయడానికి వీల్లేదు.
త్రిలోక్: ఏంటి శివకృష్ణ ఎస్ఐ ఐయ్యుండి ఈ సీఐ మాట వినవా. అయినా ఎలాగూ వచ్చావ్ కదా నీ చేతులతోనే నువ్వు ఈ విద్యాదేవిని అరెస్ట్ చేయ్.
శివకృష్ణ: ప్రతీ సారి నాతో నిరపరాధిని అరెస్ట్ చేయించలేరు. ఈ ఆధారాలతో తనని అరెస్ట్ చేయమని అంటున్నారు.
త్రిలోక్: తనకు ప్రాణ హాని ఉందని మహాలక్ష్మీ గారు రెండు రోజు క్రితం కంప్లైంట్ ఇచ్చారు పైగా వీడియో కూడా ఉంది. ఇవి చాలా.
శివకృష్ణ: సార్ మహాలక్ష్మీని ఎవరూ చంపలేదు. ఆవిడ కారు బ్రేకులు ఫెయిల్ అయి అదుపు తప్పి లోయలో పడిపోయింది. అందుకు ప్రత్యక్ష సాక్షిని నేనే. ఆ విషయం చెప్పాలనే ఇక్కడికి వచ్చా కానీ మీరేమో తనే కారు లోయలోకి తోసిందని క్రియేట్ చేస్తున్నారు.
త్రిలోక్: మహాలక్ష్మీ గారు కారు అదుపు తప్పి పడిపోయినప్పుడు నువ్వు చూశావ్ అనడానికి సాక్ష్యాలు ఉన్నాయా.
శివకృష్ణ: ఈవిడే కారు తోసేసింది అనటానికి సాక్ష్యాలు ఉన్నాయా.
సీత: పొద్దున్నుంచి టీచర్ ఇక్కడే ఉన్నారు నాన్న.
త్రిలోక్: అన్ని సాక్ష్యాలతో వచ్చి ఈవిడను అరెస్ట్ చేస్తా.
శివకృష్ణ: సారీ బావ అంతా నా కళ్ల ముందే ఇదంతా జరిగిపోయింది.
సీత, విద్యాదేవి, శివకృష్ణ మాట్లాడుకుంటారు. మహాలక్ష్మీ చనిపోయింది అంటే నమ్మబుద్ధి కావడం లేదు అని సీత అంటే అంతా నా కళ్ల ముందే జరిగిందని శివకృష్ణ చెప్తాడు. మహాలక్ష్మీ కాలి బూడిదైందని చెప్తాడు. ఇక విద్యాదేవి ఏడుస్తూ వెళ్లే ముందు చాలా జాగ్రత్తలు చెప్పింది మంచిగా మాట్లాడిందని బాధ పడుతుంది. ఇక శివకృష్ణ సీత ఏం మాట్లాడకూడదు.. మహాలక్ష్మీ చెడ్డది అయినా ఇలాంటి చావు రాకూడదని అంటాడు. ఇక మెకానిక్‌లు మనం కారు పూర్తిగా రిపేర్ చేసి డెలివరీ చేయకపోవడం వల్లే ఇలా అయిందని విషయం ఎవరికీ చెప్పొద్దని అంటాడు. త్రిలోక్ ఘటనాస్థలానికి వచ్చి మహాలక్ష్మీ గారు కారు లోయలోకి తోస్తా అని చెప్పారు కానీ శివకృష్ణ మహాలక్ష్మీ కూడా లోయలో పడిపోయిందని కొంప తీసి ప్లాన్ రివర్స్ అయిందా అనుకుంటాడు. ఆవిడ చనిపోయింటుందని ఫోరెన్సిక్ వాళ్లు వస్తే తప్ప మహాలక్ష్మీ చనిపోయిందో లేదో తెలీదని అనుకుంటాడు.
రామ్ ఇంట్లో అందరూ మహాలక్ష్మీ ఫొటోకి దండ వేసి నివాళులు అర్పిస్తారు. ప్రీతి, ఉషలు వచ్చి ఏడుస్తారు. అమ్మ వదిలేసినట్లు పిన్ని వదిలేసి వెళ్లిపోయిందని ప్రీతి ఏడుస్తుంది. కనీసం చివరి చూపులకు కూడా నోచుకోలేకపోయాం అని ఉష ఏడుస్తుంది. గిరిధర్, అర్చన, జనార్థన్ ఏడుస్తారు. ఇక టీచరే చంపిందని అందరూ కోప్పడతారు. మా అమ్మని చంపేశావ్ పిన్ని చంపేశావ్ నన్ను కూడా చంపేయ్ అని ప్రీతి ఎమోషనల్ అవుతుంది. కిరాయి రౌడీలతో ఈవిడే చంపించుంటుందని గిరధర్, అర్చన అంటారు. విద్యాదేవి వల్లే ఇంట్లో దరిద్రం అని అందరూ ప్రశాంతత పోయిందని ప్రీతి, ఉష ఇద్దరూ విద్యాదేవిని చేయి పట్టుకొని లాక్కెళ్లి బయటకు పంపేటైంకి జనార్థన్ ఆపుతాడు. మహా చనిపోవడానికి ఈ విద్యాదేవికి సంబంధం లేదని చెప్తాడు. సీత విద్యాదేవితో ఇదంతా మహలక్ష్మీ అత్తయ్య కావాలనే ఇదంతా చేస్తుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.