Satyabhama Serial Today December 31st: సత్యభామ సీరియల్: సత్య ఎనౌన్స్‌మెంట్‌కి ఫ్యామిలీ ఫ్యూజులు అవుట్.. క్రిష్ చేతకాని వాడంటూ విరుచుకుపడ్డ భైరవి!
Satyabhama Today Episode సత్య మీడియాని పిలిచి ఫ్యామిలీ ముందే తాను ఎలక్షన్ బరిలో నిల్చొంటున్నట్లు ప్రకటించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode సత్య క్రిష్‌తో సాంబారు అన్నం బాక్స్‌లో తీసుకొచ్చి బాక్స్ మీద హార్ట్ సింబల్ పేపర్ పెడుతుంది. ముద్దులు కావాలా ముద్దలు కావాలా అని క్రిష్‌ని అడుగుతాడు. ప్రశాంతత కావాలని క్రిష్ అంటాడు. ఇక సత్య మామయ్యకే నేను ఎమ్మెల్యే అవుతాను అంటే ఏ ప్రాబ్లమ్ లేదు నామినేషన్ వేయమ్మా నీకు అంత సీన్ లేదు అని తీసి పారేశారు. నువ్వు మాత్రం ఎందుకు అంత పట్టుకున్నావ్ గెలిచేస్తా అని భయమా అని క్రిష్‌ని సత్య అడుగుతుంది. నీకు అంత సీన్ లేదని క్రిష్ అంటాడు.
క్రిష్: మళ్లా మళ్లా చెప్పున్నా నాకు నువ్వు పోటీ చేయడం ఇష్టం లేదు.
సత్య: నాకు తిప్ప రేపావంటే వారం వరకు చీరే మార్చుకోను. అసలేంటి నీ సమస్య. ఈ రోజు అటో ఇటో తేలిపోయాలి అని క్రిష్ మీద మీదకు వెళ్తుంది. క్రిష్ కావాలనే దూరం పెడతాడు.
క్రిష్: రిమోట్ నీ చేతిలో పెట్టుకొని నాకు ఛానెల్ మార్చమని చెప్పినట్లు ఉంది.
సత్య: రొమాంటిక్‌గా.. నాకు అదంతా తెలీదు నేను పోటీ చేయాలా వద్దా.
క్రిష్: ఏం అనుకోకపోతే అబద్ధం చెప్తా.. పోటీ చేయ్.
సత్య: సరే నా ఢీల్‌కి ఒప్పుకుంటే వదిలేస్తా. మన ఎలక్షన్ గోల గదిలోకి వద్దు గదిలో భార్యభర్తల్లా ఉందాం ఏమంటావ్.
క్రిష్: ఇంత ముద్దుగా అడిగితే ఏమంటా సరే అంటా.
నందిని, హర్ష బైక్ మీద బయటకు వెళ్తారు. ఓ చోట హర్ష బైక్ ఆగిపోతుంది. టైర్ పంక్షర్ అయిపోతుంది. నందిని హర్ష మీద కస్సుబుస్సులాడుతుంది. ఇక హర్ష బైక్ తీసుకొని షాప్‌కి వెళ్తాడు. ఇక నందిని తన తండ్రి సత్య పుట్టింటి ఇంటి డ్రామా అడినప్పుడు వచ్చిన వ్యక్తిని చూసి తన తండ్రికి ఆయనకు ఎంటి సంబంధం అని అనుకొని చీకటిలో బాణం వేద్దామని ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తుంది. కావాలనే పైసలన్నీ నీకు ముట్టాయా అని అడుగుతుంది. తనకు తన తండ్రికి మధ్య సీక్రెట్స్ ఏం ఉండవని అన్ని చెప్పేస్తాడని అంటుంది. దాంతో ఆ వ్యక్తి దొంగ రిజిస్టేషన్ డాక్యుమెంట్స్ కథ మొత్తం చెప్పేస్తాడు. నందిని షాక్ అయిపోతుంది. ఇళ్లు కొనిపెట్టడం కూడా నాటకం అని చెప్తాడు. హర్ష రాగానే ఆ వ్యక్తి వెళ్లిపోతాడు. నందిని కూడా హర్ష దగ్గర ఏం చెప్పదు. ఇక మహదేవయ్య ఇంటికి మీడియా వస్తుంది. భైరవి ఎగ్జైట్ అవుతూ మహదేవయ్య దగ్గరకు వెళ్లి మీడియా వాళ్లకి చెప్పినప్పుడు నాకు చెప్పాలి కదా రెడీ అయివస్తా అని పరుగులు తీస్తుంది. మీడియా వాళ్లని నేను పిలవలేదని మహదేవయ్య చెప్తాడు. భైరవి వాళ్లతో కాఫీ కావాలా టిఫెన్ కావాలా అంటే మీడియా మొత్తం సత్యభామ గురించి వచ్చాం అంటారు.
ఇంతలో సత్య బయటకు వస్తుంది. మీడియాను నేనే పిలిచానని చెప్పి మీడియాతో మాట్లాడుతుంది. క్రిష్తో పాటు అందరూ బయటకు వస్తారు. ఇక సత్య ఇండిపెండెంట్‌గా విజిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చెప్తుంది. మీడియా మొత్తం షాక్ అయిపోతారు. ఒకే ఇంటి నుంచి ఇద్దరూ పోటీదారులేంటి అని అడుగుతారు. పోటీ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే కబ్జా గురించి చెప్పి ఎమ్మెల్యేగా మారి బలం పెంచుకోవాలని అంటుంది. మహదేవయ్యని తాను గెలిపించుకుంటానని క్రిష్ చెప్తాడు.
ఇక సత్య మీడియాని పంపేస్తుంది. నా పెనిమిటిని కొడుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తావా అని భైరవి సత్యని కొట్టడానికి చేయి ఎత్తుతుంది. మహదేవయ్య ఆపుతాడు. దాంతో భైరవి క్రిష్‌ని చేతకాని వాడని అంటుంది. మహదేవయ్య మాత్రం సత్యకి ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు టీవీలో సత్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు న్యూస్ వస్తుంది. విశ్వనాథం ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోతారు. వదిన గెలిచే వరకు వదలదు అని నందిని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: మా అమ్మ ఎవరు? అసలు ఉందా లేదా? ఇంట్లో వాళ్లని ప్రశ్నించిన బంటీ