Seethe Ramudi Katnam Serial Today April 16th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కలిసి భోజనం చేసిన రామ్, మధులు, సీత సువాసనలకు ఫిదా.. మరో కిష్కిందకాండే అంటూ అత్తకి వార్నింగ్!
Seethe Ramudi Katnam Serial Today Episode ఆఫీస్‌లో అందరికీ తన చేతి వంట రుచి చూపించి మహాని సీత అవమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode సీత క్యారేజ్ తీసుకొని రావడం సీసీ కెమెరాలో చూసిన మహాలక్ష్మి సెక్యూరిటీకి కాల్ చేసి సీతని లోపలికి పంపిచొద్దని చెప్తుంది. సెక్యూరిటీ సీతని అడ్డుకోవడంతో సీత చాటుగా దాక్కొని చలపతికి కాల్ చేస్తుంది. చలపతి వచ్చి మహా వక్కలు తీసుకురమ్మని చెప్పిందని సెక్యూరిటీని బయటకు పంపించి ఎవరూ చూడకుండా సీతని లోపలికి పిలుస్తాడు.
సీత రామ్ క్యాబిన్‌కు వచ్చేసరికి మధుమిత రామ్‌కు వడ్డిస్తుంది. అది చూసి సీత ఫీలవుతుంది. ఇక చలపతి ఇదంతా మహాలక్ష్మి ప్లాన్ అని కావాలనే ఇలా ఇద్దరికీ క్యాబిన్‌కు ఫుడ్ తెప్పించిదని చెప్తాడు. ఇక సీత తాను చేసి తీసుకొచ్చిన వంటలు తన భర్తతో తినిపిస్తాను అని అంటుంది.
ఇక సీత క్యారేజ్ బయటకు తీసుకెళ్లి అందరికీ ఫుడ్ ఇస్తాను అని రమ్మని చెప్తుంది. అందరికీ ఫుడ్ ఇస్తుంది. అందరూ పొగుడుతూ తింటారు. ఇక ఆ వాసనలు అన్నీలోపల ఉన్న రామ్ పీల్చి మధుతో చెప్తాడు. అది సీత వంట అని చెప్తాడు. సీత వంట చేసి అందరి కోసం తీసుకొచ్చినట్లు ఉందని రామ్ మధుతో చెప్తాడు. ఇక మధు, రామ్ ఇద్దరూ బయటకు వస్తారు.
రామ్: సీత నువ్వు ఫుడ్ తీసుకొని నా క్యాబిన్‌కే రావాల్సింది కదా..
సీత: వచ్చాను మామ కానీ అక్కడ నువ్వు అక్క తింటున్నారు అని డిస్ట్రబ్ చేయడం ఎందుకు అని బయటకు వచ్చేశా.
రామ్: ఆ ఫుడ్ అస్సలు బాలేదు సీత.. ఐటెమ్స్ టేస్ట్ బాలేవు. నువ్వు చేసిన వంట స్మెల్ గుర్తు పట్టి వచ్చాను.
సీత: అవునా నా వంటల వాసన మీ దాక వచ్చిందా..
రామ్: ఈ ఫుడ్ వాసనకు ఆకలి డబుల్ అవుతుంది నాకు పెట్టు సీత..
సీత: మీకు పెట్టకుండా ఉంటానా తీసుకొచ్చిందే మీ కోసం..
రామ్: సీత మీ అక్కకి కూడా వడ్డించు..
మధు: చాలా రుచిగా ఉంది అక్క. నాకు తెలీకుండా ఇంత టేస్టీగా ఎలా వండటం నేర్చుకున్నావ్.
సీత: అవసరం అన్నీ నేర్పిస్తాయి అక్క.
ఇంతలో మహా వాళ్లకు బయట మాటలు వినిపించి సెక్యూరిటీని పిలిచి అడిగితే ఎవరో భోజనాలు తీసుకొని వచ్చారు. అందరికీ పెట్టారని చెప్తారు. ఇక మహా అందరికీ సీత వచ్చిందని మహా చెప్తుంది. సీత సంగతి చెప్తా అని బయటకు వస్తుంది.
మహాలక్ష్మి: స్టాప్ ఇట్. ఇది ఆఫీస్ అనుకుంటున్నావా.. రోడ్డు సైడ్ సత్రం అనుకుంటున్నావా.. ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నావ్. మీరు కూడా ఏంటి ఎవరో వచ్చి భోజనం పెడితే వర్క్ మర్చిపోయి తింటున్నారా.. మీ లంచ్ ఫినీష్ అయితే అందరూ వెళ్లండి.
రామ్: ఇంత టేస్టీ ఫుడ్ మీరు ఎప్పుడు తినలేదు తినండి పిన్ని..
మధు: అవునండి మీరు ఇంకా తినలేదు కదా తినండి.
మహాలక్ష్మి: తర్వాత తింటాం.
సీత అర్చన వాళ్లకు ప్లేట్‌లో అన్నం వేసి ఇచ్చి తర్వాత అయ్యో ఐటెమ్స్ ఏం లేవు.. మీకు పెట్టడానికి అని మహాలక్ష్మితో అంటుంది. నా మామకు పెట్టాను, మా అక్కకు పెట్టాను, చివరికి చలపతి బాబాయ్, అర్చన అత్తయ్య, మామయ్య, గిరిధర్ మామయ్య అందరికీ నా చేతి వంట తినే అదృష్టం ఉంది కానీ మీకు లేదు అంటుంది. ఇక సీత అత్తయ్య కాంటీన్ ఫుడ్ తింటే మీరు మాత్రం నా చేతి వంట తింటారు అనడంతో అందరూ ప్లేట్స్ పక్కన పెట్టేస్తారు.
ఇక సీత మహాకు మీకు ఎంత ధైర్యం ఉంటే మా అక్కని ఆఫీస్‌కు రప్పిస్తారు. ఇక్కడ మా అక్క చేసే పనులేంటి అని ప్రశ్నిస్తుంది. దానికి మహా అందరూ ఏం చేస్తారో మీ అక్క అదే పని చేస్తుందని చెప్తుంది.
సీత: అంటే మీరు రోజు ఇక్కడ పని చేసే అమ్మాయిలను మామ పక్కన కూర్చొపెడుతున్నారా.. మామతో కలిసి భోజనం చేసేలా చేస్తున్నారా. మామకు అమ్మాయిలను దగ్గర చేస్తున్నారు.
మహాలక్ష్మి: సీత నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావ్.
సీత: ఇలా మాట్లాడటం తప్పు అని నాకు తెలుసు. కానీ అదే తప్పు మీరు చేస్తున్నారు. మా అక్కని ఆఫీస్‌కు తీసుకురావడం వెనక మీ ఉద్దేశం ఏంటి. మా అక్క పొద్దున్న నుంచి ఇక్కడ ఏం చేస్తుంది. మా అక్కకి ఇక్కడ మీరు ఇస్తున్న విలువ ఏంటి. మీరే చెప్పారు కదా ఇక్కడ అయితే నా అడ్డు మీకు ఉండదు అని.. మామని మా అక్కకి దగ్గర చేస్తాను అని.
మహాలక్ష్మి: అవునే అయితే ఏంటి. అసలు నువ్వు ఎందుకు వచ్చావ్ ఆఫీస్‌కు.
సీత: అందుకే వచ్చా.. మీరు తీసే గోతులు పూడ్చిపెట్టడానికి వచ్చా. ఇది నా భర్త ఆఫీస్. నన్ను లోపలికి రానివ్వకుండా సెక్యూరిటీతో చెప్పి బయటకు పంపించాలి అని అనుకున్నారు. నేను రామ్ భార్య అని చెప్పి ఉంటే అదే సెక్యూరిటీ వాళ్లు సెల్యూట్ కొట్టి నన్ను లోపలికి తీసుకొచ్చేవాడు. ఈ ఒక్క పూట కాదు.. ఇక మా అక్క ఆఫీస్‌కు వచ్చే వరకు రోజూ ఇలాగే నేను వస్తాను.
మహాలక్ష్మి: చాలా తల పొగరుగా మాట్లాడుతున్నావ్ సీత.
సీత: అత్త పేరుకో నేను సీతని.. అవసరం అయితే కోతిని కూడా అవ్వగలను. మా అక్కని ఆఫీస్‌కు తీసుకొచ్చి నన్ను రెచ్చగొట్టాలి అని చూస్తే ఆఫీస్‌ను కిష్కింధకాండ చేసేస్తా జాగ్రత్త అని సీత వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.