Seethe Ramudi Katnam Serial Today April 13th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: నువ్వు సామాన్యురాలివి కాదు సుమతి, మహా గెటప్‌కి కారణం నువ్వేనా.. రామ్‌తో ఆఫీస్‌కు వెళ్లిన మధు!
Seethe Ramudi Katnam Serial Today Episode మధుమితని తమతో పాటు ఆఫీస్‌కు తీసుకెళ్లిన మహాలక్ష్మి రామ్ మధులకు గ్రాండ్ వెల్‌కమ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode మధుమిత అంటే నీకు చాలా ఇష్టం అని.. మనసులో ప్రేమ ఉంచుకొని బయటకు ఒకలా ఉంటే మధు నిన్ను అర్థం చేసుకోదని శివకృష్ణకు తన తల్లి, భార్య, మరదలు చెప్తారు. తండ్రిగా మీ ప్రేమ మధుకు అర్థం కావాలి అని చెప్తారు. ఇక సుమతి మీద కూడా నీకు ఇంకా ప్రేమ ఉందా.. అది మన పిలుపు కోసం ఎదురు చూస్తుందని.. ఏదో ఒక రోజు అది మన ఇంటి తలుపు కొడితే క్షమిస్తావా అని తల్లి అడుగుతుంది. దీంతో శివకృష్ణ సైలెంట్‌గా వెళ్లిపోతాడు.
మరోవైపు సుమతి గురువుగారు చెప్పే ప్రవచనాలు వింటుంటుంది. ఇంతలో ఒకామె వచ్చి ఆశ్రమానికి ప్రతీ నెలలాగే ఈ నెల కూడా లక్ష డొనేషన్ ఇస్తుంది. ఇక తాను నాటిన మొక్కని చూపిస్తాను అని గురువుగారు తనని తీసుకెళ్తారు. ఇక ఆమెను చూడగానే తనకు తన స్నేహితురాలు మహాలక్ష్మి గుర్తొస్తుంది అని సుమతి మరొకామెకు చెప్తుంది.
ఫ్లాష్‌బ్యాక్
మహాలక్ష్మి: ఎవరికి సుమతి బట్టలు కుడుతున్నావ్..
సుమతి: ఎవరికో కాదు నీకే.. నువ్వు అందంగా ఉంటావ్. ట్రెండీగా ఉంటావ్.. ట్రెండ్‌కు తగ్గట్టు బట్టలు వేసుకొని నగలు పెట్టుకుంటే ఇంకా బాగుంటావ్. నీకు అందం అన్నా అందాల పోటీలు అన్నా ఇష్టం కాబట్టి నేను నీకు కుట్టిన ఈ బట్టలు వేసుకొని అందాల పోటీలకు వెళ్లొచ్చు. నీకు ఈ సారీ కట్టి నగలు పెట్టి మిస్ ఇండియాలా తయారు చేస్తా పద.. సుమతి ప్రస్తుతం మహా గెటప్ ఎలా ఉందో మహాను అలా రెడీ చేస్తుంది. నిజంగా మహాలక్ష్మిగా ఉన్నావని పొగుడుతుంది. నీ పేరుతో నీ అందం పోటీ పడుతుంది అని దిష్టి చుక్క పెడుతుంది.
మహా థ్యాంక్స్ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ రుణం తీర్చుకోలేను అని జన్మలో నిన్ను మర్చిపోలేను అని అంటుంది. ఇక ప్రస్తుతం..
మహాలక్ష్మి: మధుమిత గురించి నేను తీసుకున్న నిర్ణయం మీకు ఎవరికీ ఇబ్బంది లేదు కదా..
రామ్: నీ ఇష్టమే మా ఇష్టం పిన్ని..
అర్చన: మధు ఒప్పుకుంటుందా మహా.
మహాలక్ష్మి: మధుమితకి ఇష్టమే మనతో రావడానికి మధు ఒప్పుకుంది. ఇంతలో మధు మోడ్రన్ డ్రెస్‌లో అందంగా రెడీ అయి కిందకి వస్తుంది. అందరూ మధు అందంగా ఉందని పొగుడుతారు.
సీత: ఈ అవతారం ఏంటి అక్క. ఆ బ్యాగ్ వేసుకొని ఎక్కడికి బయల్దేరావ్.
జనార్థన్: ఆఫీస్‌కు..
సీత: మా అక్కని ఆఫీస్‌కు వెళ్లమని ఎవరు చెప్పారు.
మహాలక్ష్మి: నేనే చెప్పాను. ఈ రోజు నుంచి మధుమిత రామ్‌తో కలిసి ఆఫీస్‌కు వెళ్తుంది.
సీత: ఎందుకు..
మహాలక్ష్మి: టైం పాస్ చేయడానికి..మధు ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. పైగా తనకి సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు కూడా వస్తున్నాయి. అదే ఆఫీస్‌కు వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది.
సీత: ప్రశాంతంగా ఉండాలి అంటే మా అక్కని మీరు పంపించాల్సిది ఆఫీస్‌చు కాదు. మా ఇంటికి..
జనార్థన్: అక్కడ ప్రశాంతత లేదు కాబట్టే మధు ఇక్కడికి వచ్చింది.
సీత: సూర్య బావని విడిపిస్తాను అని అది చేయడం లేదు.
మహాలక్ష్మి: అది కూడా జరుగుతుంది. కాకపోతే సూర్య బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు మధు ఆఫీస్‌కు వస్తుంది. నేను ఇదే విషయం మధుకి చెప్పాను అందుకే మధు రెడీ అయింది. వీళ్లందరికీ చెప్పాను అందుకే మధుని తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నారు.
రామ్: అవును సీత మధుమిత విషయంలో మా పిన్ని మంచి నిర్ణయం తీసుకుంది. నాకు బాగా నచ్చింది.
సీత: నాకు నచ్చలేదు. నువ్వు ఆఫీస్‌కి వెళ్లడానికి వీల్లేదు.
మధు: ఎందుకు వద్దు.. కారణం ఏంటి అని అడుగుతున్నాను.
సీత: ఒకటి కాదు వీళ్లు నీకు ఆఫీస్‌కు తీసుకెళ్లడం వెనకు వంద కారణాలు ఉన్నాయి. అందుకే నీకు ఆఫీస్‌కు వద్దు అంటున్నా.
మహాలక్ష్మి: మేం మధుకి మంచి చేయాలనే ఆఫీస్‌కు తీసుకెళ్తున్నాం.
సీత: మీరు చేసే మంచి ఏంటో నాకు తెలుసు.
జనార్థన్: మధు చదువుకుంది మన ఆఫీస్‌లో పని చేస్తే తప్పేంటి సీత.
గిరిధర్: మనం ఏం చేసినా సీతకు తప్పుగా కనిపిస్తుందిలే అన్నయ్య.
సీత: వెళ్లకు ఇష్టం లేదు అక్క వెళ్లకు.
మధు: నీ ఇష్టంతో నాకు పని లేదు సీత. నా బాధని మహాలక్ష్మి గారు అర్థం చేసుకున్నారు. అందుకే నన్ను ఆఫీస్‌కు తీసుకెళ్తున్నారు. అది నీకు ఎందుకు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదు. నన్ను డిస్ట్రబ్ చేయడానికి ఇంట్లో నువ్వు ఉంటావ్. ఆఫీస్‌లో ఉండవు కదా.. తప్పుకో సీత.. రామ్ గారు రండి..
మహాలక్ష్మి: నీకు మీ అక్క మంచి సమాధానం చెప్పింది కదా. నాది కూడా సేమ్ ఆన్సర్. మధు, రామ్‌లకు ఇంట్లో నువ్వు ప్రతీ దానికి అడ్డుకుంటున్నావ్. అదే ఆఫీస్‌లో అయితే వాళ్ల కెమిస్ట్రీ బాగా వర్క్‌అవుట్ అయి ప్రేమలో పడతారు. అదే నా ప్లాన్.
రామ్ మధుని తీసుకొని ఆఫీస్‌కు వెళ్తాడు. స్టాఫ్ అందరూ మధు, రామ్‌ల మీద పూలు పడేలా చేసి గ్రాండ్ వెల్‌కమ్ చెప్తారు. రామ్ స్టాఫ్‌ని మధుమితకి పరిచయం చేస్తాడు. ఇక క్యాబిన్‌లో మహావాళ్లు మధుకి వెల్‌కమ్ చెప్తారు. ఇక నువ్వు ఎంప్లాయ్ కాదు అని మాలో ఒకదానికి అని అంటారు. ఇంటిని ఓన్ చేసుకున్నట్లు ఆఫీస్‌ని కూడా ఓన్ చేసుకో అని చెప్తారు. ఇక రామ్ దగ్గరుండి మధుకి అన్నీ చెప్పు అని చెప్పి మహాలక్ష్మి వాళ్లు వెళ్లిపోతారు.
మహాలక్ష్మి: రోజూ మధుని ఆఫీస్‌కు తీసుకొచ్చి రామ్, మధులను ఒకటి చేయాలి. రామ్ మధు ఒక్కటైతే సీత మనల్ని ఏం చేయలేదు.
రేవతి: మీ అక్క ఆఫీస్‌లో ఉంటే నువ్వు ఇక్కడ వంట చేస్తున్నావా సీత.
సీత: మా అక్కకి చదువు వచ్చు కాబట్టి ఆఫీస్‌కి వెళ్లింది నాకు వంట వచ్చు కాబట్టి వంట చేస్తున్నా.
రేవతి: మధుకి చదువు వచ్చు కాబట్టి ఆఫీస్‌కు వెళ్లలేదు. మహా తీసుకెళ్లాలి అనుకుంది కాబట్టి వెళ్లింది.
సీత: తెలుసు పిన్ని..
రేవతి: మీ అక్కని మహాలక్ష్మి బ్రైన్ వాష్ చేస్తుంది. నువ్వు ఇక్కడ ఇలా ఎలా ఉండగలుగుతున్నావ్.
సీత: అక్కడ అందరికీ ఉద్యోగం ఇస్తుంది నా మొగుడే కదా. నాకు కూడా ఏ జాబ్ కావాలి అంటే అది ఇస్తాడు.
రేవతి: రామ్ మాట ఇంట్లోనే చెల్లనివ్వదు మహాలక్ష్మి. అలాంటిది ఆఫీస్‌లో చెల్లనిస్తుందా..
సీత: నేను జాబ్ చేయడానికి వెల్లను నా మామతో పాటు అందరికీ నా చేతి వంట రుచి చూపిస్తా. అందుకే కష్ట పడి వంట చేస్తున్నా. పేరుకో వంట తీసుకెళ్తున్నా.. కానీ నేను చేసేది అది కాదు.. ఇద్దరు మామలు, అత్తల్ని ఓ ఆట ఆడుకుంటా.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.