Guppedantha Manasu Serial Today April 13th: గుప్పెడంత మనసు సీరియల్: మూడు నెలల్లో రిషి తిరిగి వచ్చేస్తాడా.. మీటింగ్‌లో మనుపై రివేంజ్ ప్లాన్ చేసిన శైలేంద్ర, రాజీవ్!
Guppedantha Manasu Serial Today Episode రిషిని వెతికి తీసుకురావడంలో సాయం చేస్తానని మను వసుధారకు మాటివ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Guppedantha Manasu Today Episode అనుపమ, మహేంద్ర, వసుధార, మను భోజనం చేస్తూ ఉంటారు. పేరెంట్స్ మీటింగ్‌కు అందరూ వస్తారా అని మహేంద్ర వసుని అడుగుతాడు. అందరూ వస్తారు అని వసు చెప్తుంది. మరి అనుపమ వస్తుందా అని అడగ్గానే.. వసు అనుపమతో మేడం మీరు వస్తారా అని అడుగుతుంది.
మహేంద్ర: మను కూడా వస్తున్నాడు.
అనుపమ: నేను రావడం లేదు.
వసుధార: రావొచ్చు కదా మేడం మీరు కూడా వస్తే బాగుంటుంది. పేరెంట్స్ మీ సలహాలు సూచనలు కూడా తీసుకుంటారు కదా.
అనుపమ: నేను రాలేను వసుధార. నాకు ఇబ్బందిగా ఉంది.
మహేంద్ర: అదేంటి పూర్తిగా క్యూర్ అయిపోయింది అన్నావు కదా. ఇంతకు ముందులా పెయిన్ కూడా లేదుగా..
వసుధార: మేడం ఎవరో వస్తున్నారు అని మీరు రాకుండా ఉంటే బాగుండదు. మేడం మీరు కూడా వస్తే బాగుంటుంది. అందులోనూ మీరు మిషన్ ఎడ్యూకేషన్ ఇన్‌ఛార్జి కదా.
మహేంద్ర: మౌనం అంగీకారం అంటారు కదా అనుపమ వస్తుందిలే వసుధార. అందరం కలిసే వెళ్దాం. ఏమంటావ్ మను.
మను: కలిసే వెళ్దాం సార్..
మరోవైపు శైలేంద్ర రాగానే దేవయాని క్లాప్స్ కొట్టి నాన్న.. మనం సరైన దారిలో వెళ్తున్నాం.. విజయం మనదే.. అని అంటుంది. దానికి శైలేంద్ర ఎందుకు అమ్మ ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్. విజయం మనదే అంటున్నావ్. అంత గట్టిగా ఎలా నమ్ముతున్నావ్ అని ప్రశ్నిస్తాడు. దానికి దేవయాని ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనల్ని మనం నమ్మాలి అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది అని అంటుంది.
శైలేంద్ర: నమ్ముతున్నాను కాబట్టే.. ఆ ఎండీ సీటుకు ఉన్న ఒక్కో అడ్డూ తొలగిస్తూ ఉన్నాను. కానీ ఇప్పటికీ ఆ ఎండీ సీట్ నా సొంతం కాలేదు.
దేవయాని: ఇప్పుడు అవుతుంది నాన్న. బోర్డ్ మీటింగ్ జరిగిన తర్వాత నాకు ఓ ఆలోచన వచ్చింది.
శైలేంద్ర: ఆ మను గాడు కాలేజ్ నుంచి వాళ్ల జీవితాల నుంచి వెళ్తే కదా మనం ఏమైనా సాధించగలం. అక్కడ నువ్వు వసూని బాధ పెట్టాలి అని రిషి టాపిక్ తీసుకొచ్చావ్. అది కూడా మన మంచికే అనుకో కానీ అంతలోనే డాడ్ మధ్యలో వచ్చి నీ నోరు మూయించారు కదా. ఆ వసుని ఒక్క మాట కూడా అనకుండా చేశారు కదా. అసలు డాడ్ ఏంటి మామ్ అంత మంచిగా ఉన్నారు. అలా ఉంటే కష్టం కదా. అసలు డాడ్ చేసిన పనికి నా ఒళ్లు మండిపోతుంది. ప్రతీ దానికి అడ్డు వస్తున్నారు. అసలు మనల్ని ప్రశాంతంగా ఒక్క పని చేసుకోనివ్వరా.. అసలు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది మన శత్రువు నాన్న వాళ్లా.. అని ... మామ్ రేపు డాడీకి మన నిజస్వరూపం తెలిసినా ఏం కాదు అందరిలా ఆయన సైలెంట్‌గా ఉంటారు.
దేవయాని: అని నువ్వు అనుకుంటున్నావ్. నీకు ఆయన గురించి ఏం తెలీదు. ఆయన ఒక్క సారి కన్ను ఎర్ర చేస్తే మనం భష్మం అయిపోతాం. మంచివాళ్లకు న్యాయం చేయడానికి ఆయన ఎంత కైనా తెగిస్తారు. చెడ్డవాళ్ల పని పట్టడానికి ఎంతకైనా తెగిస్తారు. ఆయన ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకు. దులిపేసుకో... నిన్ను ఎండీ సీట్‌లో కూర్చొబెట్టి డీబీఎస్‌టీ కాలేజీని రాజును చేస్తా. అందుకు నా దగ్గర ఓ ఆయుధం ఉంది. దాంతో మను, అనుపమలే కాదు వాళ్లతో పాటు వసుధార, మహేంద్ర కూడా కాలేజీని వదిలిపెట్టి దూరంగా పారిపోతారు. కచ్చితంగా నీకు అది హెల్ప్ అవుతుంది.
ధరణి: మీరు హెల్ప్ అన్నారంటే ఎవరికో మూడిందని అర్థమైంది. సెటైర్ వేస్తుంది. ఆమె సడెన్ ఎంట్రీని ఊహించలేకపోతారు శైలేంద్ర, దేవయాని. ఆమెపై ఫైర్ అవుతారు. ధరణి ఎంతకు అక్కడి నుంచి కదలకపోవడంతో మమ్మల్ని ఇరిటేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని దేవయాని కోపంగా అంటుంది. దీంతో సెటైర్లు వేసి ధరణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు మను దగ్గరకు వసు వస్తుంది. వసుతో మను.. మేడంని మరికొన్నాళ్లు రెస్ట్ తీసుకోనివ్వండి ఎందుకు కాలేజ్‌కి రమ్మని చెప్తున్నారు అడుగుతాడు. దీంతో వసు మీరు కనబడరు కానీ అమ్మపై మనసులో మీకు బాగానే ప్రేమ ఉందని అంటుంది. మేడం చాలా రోజులుగా రెస్ట్ తీసుకుంటున్నారు. కాలేజీకి వస్తే రిఫ్రెషింగ్‌గా ఉంటుందని. పేరెంట్స్ మీటింగ్‌లో మేడం కచ్చితంగా ఉంటేనే బాగుంటుందని వసుధార చెప్తుంది. మీ ఇద్దరి మధ్య సమస్య ఉందని తెలిసింది అని సమస్యలు తొలగిపోయి మీరు త్వరలోనే కలిసిపోయే రోజులు వస్తాయి అని వసు అంటుంది.
మను: దేవయాని మేడం రిషిని మర్చిపోయావంటూ కాలేజీలో అన్న మాటలకు మీరు బాధపడ్డారు కదా..
వసుధార: అవునండి.. రిషి సార్ నా ప్రాణం. నాలో సగభాగం. అలాంటిది నేను ఆయన్ను మర్చిపోయాను అనగానే బాధ అనిపించింది.
మను: రిషి సార్‌ని వెతికి తీసుకురావడంలో మీకు నేను సాయంగా చేస్తా.. మూడు నెలల్లో తీసుకొస్తా అని అన్నారు కదా.. ఇక మను మహేంద్ర, అనుపమకు చెప్పి ఇంటికి వెళ్తాడు.
మరోవైపు శైలేంద్ర రాజీవ్‌కు కాల్ చేస్తాడు. ప్లాన్ సక్సెస్ అయ్యేలా చేయమని శైలేంద్ర అంటాడు. ఇక శైలేంద్ర మనసులో.. మను రేపు నువ్వు నీకు ఎదురయ్యే సమస్యను ఫేస్ చేయలేవు అంటాడు. ఇక దేవయాని రాజీవ్‌కు కాల్ చేసి శైలేంద్ర చెప్పిన పని అవ్వగానే ఇంకో పని చేయాలి అని మరో ప్లాన్ చెప్పి ఎలాంటి పరిస్థితుల్లో మిస్ చేయకు అంటుంది. ఇక దేవయాని రేపు మను కాలేజ్ నుంచి పారిపోవాల్సిందే అనుకుంటుంది.
ఇక రాజీవ్ కాలేజ్‌లో పని చేసిన కూలీలతో తాను చెప్పినట్లు చేస్తే లక్ష ఇస్తాను అని వాళ్లకి చెప్పి తాను వేసిన ప్లాన్ వాళ్లకి చెప్పి ఇదే మీరు చేయాలి అంటాడు. వాళ్లు తప్పేమో సార్ అంటే.. నిజాలే మాట్లాడమంటున్నాను అని అంటాడు. ఇక వాళ్లు ఒప్పుకుంటారు. రాజీవ్ వాళ్లకు డబ్బులు ఇస్తాడు. ఇక మీటింగ్ స్టార్ట్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: అంజనంలో కనిపించిన గాయత్రీ దేవి ప్రతిబింబం.. కళ్లుతిరిగి పడిపోయిన గాయత్రీ పాప!