Satyabhama Serial Today March 4th: సత్యభామ సీరియల్: కుండ మార్పిడి పెళ్లిళ్లకు ఒకే అన్న మహదేవయ్య, హర్ష నిర్ణయం మార్చుకుంటాడా!
Satyabhama Serial Today Episode మహదేవయ్య పెద్దమ్మ భానుమతి రాకతో క్రిష్ కోసం నందినిని హర్షకి ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది.
Satyabhama Telugu Serial Today Episode: మహదేవయ్య దగ్గరకు తన పెద్దమ్మ వస్తుంది. ఆమెని చూసిన మహదేవయ్య కంగారు పడతాడు. ఆమె ఎవడ్రా నిన్ను ఇంత పరేషాన్ చేస్తుంది అని అడుగుతుంది. దీంతో మహదేవయ్య చిన్నా వల్లే ఇదంతా జరుగుతుంది అని అంటాడు. తన కొడుకు ఎదురించి మాట్లాడుతున్నాడని అంటాడు.
భానుమతి: ఎవరినైనా ప్రేమించాడా..
మహదేవయ్య: అదే కదా నెత్తి నొప్పి. మీసాలు రాగానే పెద్దొడిని అయిపోయా అనుకుంటున్నాడు. నా పెద్దరికానికే ఎదురుతిరుగుతున్నాడు.
భానుమతి: ప్రేమ ముందు పెద్దరికం నిలబడదురా. పెద్దరికం చూపించే బెదిరిస్తే మాట వినే రోజులు పోయాయి. ఇలాంటప్పుడే పట్టు విడుపులు ఉండాలి. లేదంటే పెద్దరికం కూడా నిలబడదు.
మహదేవయ్య: వాళ్లు మన స్థాయికి తగ్గవాళ్లు కాదు పెద్దమ్మ అయినా తగ్గి నిశ్చితార్థం చేసుకుందామని వెళ్లాం అయినా ఆ పిల్ల అన్న అడ్డం తిరిగాడు. కుండమార్పిడి పెళ్లి కావాలి అంట పెద్దమ్మ. నా కూతుర్ని ఇచ్చి వాడికి పెళ్లి చేయాలి అంట. జరిగే పెళ్లి కాదు అని చెప్పే వచ్చినా.
భానుమతి: నువ్వు చెప్పావ్ సరే మరి చిన్నా గాడు మాట వినాలి కదా..
మహదేవయ్య: సతాయించుకొని తింటున్నాడు. ఆ కుండమార్పిడి పెళ్లి చేయమని ఉంచడు.
భానుమతి: చేసేయ్. బంధం నిలబడాలి అంటే వాడైనా నీ మాట వినాలి నువ్వు అయినా వాడి మాట వినాలి.
మహదేవయ్య: మొండి తనంతో వాడి జీవితం ఎట్లానో నాశనం చేసుకుంటున్నాడు. ఇప్పుడు నా బిడ్డ జీవితం కూడా నాశనం చేసుకోమంటావా. ఇదేం తీర్పు పెద్దమ్మ. నువ్వు వాడికి నచ్చచెప్పాల్సింది పోయి నాకు చెప్తున్నావ్ ఏంటి.
భానుమతి: వాడిది ఉడుకు రక్తం. నువ్వే ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. ఒప్పుకుంటా ఈ పెళ్లిళ్లు చేస్తే నీకు నష్టం జరుగుతుంది అని. తెలివితో ఆ నష్టాన్ని లాభంగా మార్చుకో. నువ్వే కాదు నీ కుటుంబం మొత్తం లాభపడుతుంది. నీకు ఎమ్మెల్యే కావాలి అని లేదా.. మినిస్టర్ కావాలి అని లేదా..
మహదేవయ్య: దాని సంగతి ఇప్పుడు ఎందుకు పెద్దమ్మ.
భానుమతి: అడిగింది చెప్పు. ముడి పడితేనే జీవితంలో బాగుపడతావ్. అవకాశం అందుకోవడానికి నిచ్చెన దొరుకుతుంది. బయట కనపడితే జనాలు నీకు దండం పెడుతున్నారు. అది ప్రేమతో కాదు. నువ్వంటే భయంతోనే. ఆ భయం నిన్ను ఎమ్మెల్యేని చేయడానికి సరిపోదు. ఇంకా ఏదో కావాలి. జనం నిన్ను గొప్పొడు అని మోసే అంత మంచితనం కావాలి.
మహదేవయ్య: ఇప్పటికిప్పుడు అది ఎలా కుదురుతుంది పెద్దమ్మ.
భానుమతి: నీ ఇంటికి ఒక పేదింటి పిల్లని తెచ్చుకుంటే నువ్వు మంచోడివి అవుతావ్. అదే నీ కూతుర్ని ఓ పేదింటికి పంపిస్తే అంత కన్నా మంచోడివి అవుతావ్. జనం నిన్ను సొంతం చేసుకుంటారు. వాళ్ల బాధలు అర్ధం చేసుకుంటావని నమ్ముతారు. నమ్మితే కదరా మోసం చేయగలిగేది.
మహదేవయ్య: అంతా బాగుంది పెద్దమ్మ కానీ పెళ్లికి నందిని ఒప్పుకోదు కదా..
భానుమతి: అవును ఒప్పుకోదు. మంచిగా చెప్పి చూడు. నచ్చచెప్పి చూడు. బెదిరించి చూడు.
మహదేవయ్య: అరే అది తప్పు కదా పెద్దమ్మ.
భానుమతి: పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు తప్పులే చేయలేదా..
మహదేవయ్య: సరే అని ఒప్పుకుంటాడు.
భైరవి: మనసులో మీద ఏదో రాజకీయం జరుగుతుంది.
మహదేవయ్య: చిన్నా.. మాస్టార్‌కి ఫోన్ చేసి చెప్పు రెండు పెళ్లిళ్లు ఒకేసారి చేయడానికి రెడీ అవ్వమని..
భైరవి: అట్లా ఎట్లా కుదురుతాది.
మహదేవయ్య: ఎందుకు కుదరదు.
భైరవి: నందినికి ఈ పెళ్లి ఇష్టం లేదు.
మహదేవయ్య: చిన్నా గాడి పెళ్లి కూడా మనకు ఇష్టం లేదు కదా. ఆ తర్వాత మనసు మార్చుకొని ఒప్పుకున్నామా లేదా.. నందిని కూడా అంతే ఇది నా నిర్ణయం మారదు.
భైరవి: నేను ఒప్పుకోను.
భానుమతి: మహదేవుడు.. చెప్పింది విని తలూపడం తప్ప ఎదురు తిరగడం తప్పు అని నీ పెళ్లానికి చెప్పు. ముహూర్తాలు పెట్టుకున్నాక చెప్పండి కుదురితే పెళ్లికి వస్తా అర్థమైందా.. నందిని ఏడుస్తుంది.
హర్ష: ఎందుకు అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇంటికి వెళ్లిన మహదేవయ్య నుంచి ఫోన్ రాలేదు అంటే తోక ముడిచినట్లే కదా.
విశ్వనాథం: అసలు ఏ ధైర్యంతో ఆయన కూతుర్ని అడిగావ్ రా..
హర్ష: ఒప్పుకోరు అనే ధైర్యంతో.. నేను తెగించాను కాబట్టే ఈ రోజు నిశ్చితార్థం ఆగింది. హ్యాపీగా పాయసం చేయమ్మా..
విశాలాక్షి: ఏవండీ చేయమంటారా..
విశ్వనాథం: హా చేయండి.. పాయసాలు పరమాన్నాలు చేయడానికి గుడికి వెళ్లడానికి ఇలాంటి వాటికి మాత్రమే ఈ ఇంట్లో నా పర్మిషన్ కావాలి అంతే కదా..
క్రిష్: ఈ విషయం అర్జెంటుగా సంపంగితో చెప్పాలి అని ఫోన్ చేస్తాడు.
విశ్వనాథం: క్రిష్ కాల్ చేస్తున్నాడు. ఇతనికి నాతో ఏం పని నాకు ఎందుకు కాల్ చేస్తున్నాడు.
శాంతమ్మ: ఈ ఇంట్లో ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సమాధానం చెప్పాల్సింది మాత్రం నువ్వే. ఫోన్ ఎత్తి మాట్లాడు.
విశాలాక్షి: నందినితో లింక్ పెట్టకుండా ముందు సత్యతో పెళ్లి చేయమని అంటాడేమో.
హర్ష: అస్సలు ఒప్పుకోకండి నాన్న ఆగండి నేను మాట్లాడుతా..
సత్య: నాన్న మీరే మాట్లాడండి..
క్రిష్: మాస్టారూ నేను మీకు కాబోయే అల్లుడిని.. ఇక ఏ మాత్రం చేయకుండా వెంటనే పెళ్లి పనులు చేసుకోండి. సంపంగికి మనం గ్రాండ్ శారీ కొనాలి అది నేను సెలక్ట్ చేస్తా.
హర్ష: నీ సంపంగి సంగతి సరే నందిని సంగతి ఏంటి..
క్రిష్: ఎక్స్‌పెక్ట్ చేశా బామర్ది. నువ్వు పక్కనే ఉంటావు అని టెన్షన్ పడుతూ ఉంటావని.. నా చెల్లిని కోపంతో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా ప్రేమతో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా.
హర్ష: ఇష్టంతోనే..
క్రిష్: అలాంటప్పుడు ఆ విషయం నవ్వుతూ చెప్పొచ్చు కదా.. నువ్వు కూడా నా చెల్లికి పెళ్లి చీర సెలక్ట్ చేసుకో.. ఏయ్ కంగ్రాట్స్ బామర్ది.. గుడ్ న్యూస్ చెప్పా బామర్ది థ్యాంక్స్ చెప్పవా అలా సైలెంట్‌గా ఉంటావేంటి. నా చెల్లికి కొంచెం గారాభం ఎక్కువ దాన్ని భరించాలి అంటే మామూలు ముచ్చట కాదు మస్త్ ఓపిక ఉండాలి. ఓ పని చేయ్ ఇప్పటి నుంచే మెడిటేషన్ క్లాస్‌కి వెళ్లిపో. మజాక్‌లో కూడా దానికి కోపం తెప్పించకు వెంటనే మా బాపుకి ఫోన్ చేస్తాది. ఆయన సంగతి నీకు తెలిసిందే. ఏ లెవల్‌లో వీరంగం ఆడుతాడో నువ్వు చూశావు కదా.. అది చిన్న పిల్ల బామర్ది నువ్వే మంచి చెప్పుకొని దారిలో పెట్టుకోవాలి. మాస్టారూ ఈ రెండు పెళ్లిళ్లకు ఏర్పాట్లు మేమే చేసుకుంటాం. జస్ట్ మీరు బట్టల షాపింగ్ చేసుకొని రిలాక్స్ అవ్వండి చాలు. నేను మొత్తం ప్లాన్ చేసి కాల్ చేస్తా.. అన్నట్లు నా సంపంగిని అడిగాను అని చెప్పండి.
శాంతమ్మ: కుదిరిందా రోగం ఇప్పుడు చేసి పెట్టవే వాడికి పాయసం. పండగ చేసుకుంటాడు అంట పండగ. ఒక పెళ్లితో పోయేదాన్ని రెండు పెళ్లళ్ల వరకు తీసుకొచ్చాడు. ఓరేయ్ నీకు పెళ్లాన్ని తీసుకురావడం కాదురా.. మా అందరికీ మొగుడిని తీసుకొస్తున్నావ్.
సత్య: విన్నావుగా నందిని గురించి ఇంకా ఇప్పటికి పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంన్నావా..
సంధ్య: అంత గొడవ చేసి కండీషన్ పెట్టి నిశ్చితార్థం ఆపాడు. ఇప్పుడు వెనక్కి తగ్గితే వాళ్లు ఊరుకుంటారా అక్క.
శాంతమ్మ: ఆ ఊరుకుంటారు మూతి మీద వాతలు పెడతారు. పెద్దవాళ్లకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడం కాదురా ఇప్పుడు అనుభవించు.
విశ్వనాథం: హర్ష ఏం చేయాలి అనుకుంటున్నావ్..
హర్ష: నందినిని పెళ్లి చేసుకోవాలి అనే అనుకుంటున్నాను. వెనక్కి తగ్గేదే లేదు.
క్రిష్ తన నానమ్మ దగ్గరకు వచ్చి నీకు అన్ని సీక్రెట్స్ చెప్పేశా కదా ఇప్పుడు కూడా ఒక సీక్రెట్ చెప్తా అని అంటాడు. సత్యతో తన పెళ్లి అవ్వదేమో అనే భయంతో బాపు మనసు మార్చి పెళ్లికి ఒప్పుకునేలా ఒప్పించే దమ్ము ఎవరికి ఉందా అని ఆలోచించాను అని అప్పుడు మీ అక్క భానుమతి గుర్తొచ్చి ఆమెను నేనే పిలిపించాను అని అంటాడు. దీంతో క్రిష్ నానమ్మ బుంగమూతి పెట్టుకుంటుంది. ఇక క్రిష్ తన నానమ్మను నవ్విస్తాడు. మరోవైపు బాబీ క్రిష్‌కి ఫోన్ చేస్తాడు. కాళీ గురించి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: వేణు: ఏడాది పూర్తి చేసుకున్న 'బలగం' - ఎమోషనల్ పోస్ట్ చేసిన వేణు!