Satyabhama Serial Today June 5th: సత్యభామ సీరియల్: మహదేవయ్యను చంపడానికి ప్రయత్నిస్తున్న అజ్ఞాత వ్యక్తి కన్న కొడుకేనా!
Satyabhama Serial Today Episode :సంధ్యని ఇచ్చి పెళ్లి చేయమని మరోసారి కాళీ విశ్వనాథానికి కాల్ చేసి బెదించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode : క్రిష్ అబద్ధం చెప్తున్నాడు అని సత్య ఫైర్ అవుతుంది. క్రిష్ మాత్రం అది అబద్ధం కాదు నిజమే అని అంటాడు. అనవసరంగా హనీమూన్‌కి వచ్చాను అని సత్య అంటే ఇలా జరగాలి అని రాసి ఉంటే ఎవరు తప్పించగలరు చెప్పు అని క్రిష్ అంటాడు. సత్య రెండు చేతులు జోడించి ఏడిపించింది చాలు ఇప్పుడైనా నిజం చెప్పు మన మధ్య ఏం జరగలేదు కదా అని అంటుంది.
క్రిష్: జరిగింది అంటే నువ్వు ఒప్పుకోవు. జరగలేదు అంటే నా మనసు ఒప్పుకోదు. అబద్ధం చెప్పి నిన్ను మోసం చేయాలా. నిజం దాచి నా మనసుని మోసం చేసుకోవాలా. దేవుడా ఎందుకు నాకు ఇంత పరీక్ష పెట్టావ్.
సత్య: సచ్చినోడు నాతో ఆడుకుంటున్నాడు. నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పిస్తా..
మహదేవయ్య ఇంటికి నరసింహ వస్తాడు. ఆవేశంతో రుద్ర కత్తి పట్టుకొని మీదకు వెళ్తాడు. మహాదేవయ్య ఆపుతాడు. ఇక నర్శింహ మహదేవయ్య కాళ్ల మీద పడి క్షమాపణ కోరుతాడు. మహదేవయ్య కత్తి పట్టుకొని అందితే జుట్టు లేకపోతే కాలు అని అంటాడు. ఇక నర్శింహ ఎవరో ఒక వ్యక్తి తనకు కాల్ చేసి ప్లాన్ చేసి చెప్పాడని అంటాడు. రుద్ర నర్శింహ మీదకు వెళ్తే క్రిష్ వచ్చి ఆపుతాడు. క్రిష్ ఒక్క రోజులో 10 సార్లు దాడి చేశాడు అని అందుకే వచ్చి మీ కాళ్లమీద పడ్డాను అని అంటాడు. ఇక ఆ అజ్ఞాత వ్యక్తికి మీ బాపు మీద తాచుపాముకున్నంత పగ ఉందని అంటాడు.
నర్శింహ కారులో వెళ్తుండగా ఆ అజ్ఞాత వ్యక్తి మళ్లీ కాల్ చేస్తాడు. మహదేవయ్యని చంపమని చెప్పిన ఆ అజ్ఞాత వ్యక్తి మరెవరో కాదు మహదేవయ్య పెద్ద కొడుకు రుద్రనే. అసలు ఎవడ్రా నువ్వు అని నర్శింహ అడిగితే రుద్ర మహదేవయ్య పాలిట చావుని అని చెప్తాడు.
మరోవైపు కాళీ మాటలను గుర్తుచేసుకొని విశ్వనాథం టెన్షన్ పడుతుంటాడు. విశాలాక్షి వచ్చి డబ్బు ఇంకా దొరకలేదా అని అడుగుతుంది. డబ్బుకి బదులు ఆ రౌడీ ఫ్రెండ్ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు అని అంటాడు. దానికి విశాలాక్షి ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చి దాచిపెడదామని అంటుంది. ఇంతలో హర్ష, నందినిలు ఇంటికి వస్తారు. దిష్టి తీయాలి అని విశాలాక్షి వస్తే దిష్టి తీసేంత ఘనకార్యం అక్కడేం జరగలేదు అని నందిని విసురుగా మాట్లాడుతుంది. హడావుడి పడాల్సిన పని ఏం లేదు అని దిష్టి పళ్లెం తోసేస్తుంది. హర్ష కోప్పడితే విశాలాక్షి ఆపుతుంది. విశ్వనాథం భార్యను ఓదార్చుతాడు.
భైరవి బట్టలు ఉతకమని రేణుకకి చెప్తుంది. రేణుక ఒంట్లో బాలేదు కళ్లు తిరుగుతున్నాయని అంటుంది. దానికి భైరవి కడుపుతో ఉన్న వాళ్లకి అలా అవుతుంది కానీ పిల్లలు పుట్టకుండా రెండు పూటలా మందులు వేసుకునే నీకు ఎందుకు అలా అవుతుందని అడుగుతుంది. రేణుక తాను కూడా ప్రెగ్నెంట్ అని ఆ విషయం చెప్పలేకపోతున్నా అని అంటుంది. ఎలా అయినా పని చేయమని రేణుకకి భైరవి చెప్తుంది. ఇంతలో సత్య వచ్చి నేను బట్టలు ఉతుకుతా అని చెప్తే భైరవి వద్దు అని తిట్టి వంట చేయమని చెప్తుంది. ఇక సత్య రేణుకని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలా అని అడిగితే వద్దు అని రేణుక అంటుంది. రేణుక ఈసారి తన కడుపులో బిడ్డని ప్రాణంలా కాపాడుకుంటాను అని నిర్ణయించుకుంటుంది.
మరోవైపు విశ్వనాథం చాలా టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో విశాలాక్షి వచ్చి ఇద్దరితో వ్రతం చేయిద్దామని అప్పుడే వాళ్లు కుదిటి పడతారు అని అంటుంది. ఇంతలో విశ్వనాథం సత్య, క్రిష్‌లను కూడా పిలిపించి వాళ్లతో కూడా వ్రతం చేయిద్దామని అంటాడు. సరే అని విశాలాక్షి అంటుంది. ఇంతలో కాళీ విశ్వనాథానికి కాల్ చేసి మామయ్య గారు అని మాట్లాడి పెళ్లికి ముహూర్తాలు పెట్టమని అంటాడు. ఒప్పుకోను అని విశ్వనాథం అంటే కాళీ ఒప్పుకునేలా చేస్తా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.