అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today June 5th: కార్తీకదీపం 2 సీరియల్: కత్తిపీట ఎత్తి విశ్వరూపం చూపించిన దీప.. నర్శింహ, శోభ, అనసూయలకు దిమ్మతిరిగే వార్నింగ్!

Karthika Deepam 2 Serial Today Episode : దీప నర్శింహ ఇంటికి వెళ్లి కత్తిపీట నర్శింహ మెడ మీద పెట్టి ముగ్గురికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : జ్యోత్స్న బాధ పడితే పారిజాతం తన దగ్గరకు వెళ్లి నువ్వు ఎవరి మాటలు వినొద్దు అని మనసు మాట విను అని అంటుంది. దానికి జ్యోత్స్న మనసు లేదు అని ఎప్పుడో విరిగిపోయిందని అంటుంది. మనకు కావాల్సిన వారికి ఇంకెవరో అవసరం అయితే మనసు ముక్కలైపోతుందని తట్టుకోలేమని చెప్పి బాధ పడుతుంది. కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

సుమిత్ర: అత్తయ్య నా కూతురి జీవితాన్ని ఏం చేయాలి అనుకుంటున్నారు. ఎందుకు లేని పోనివి చెప్పి దాని మనసు పాడు చేయాలి అని చూస్తున్నారు.

పారిజాతం: దాని మనసు పాడు చేస్తున్నది నేను కాదు ఆ దీప. ఆ దీపని నెత్తిన పెట్టుకుంది నేను కాదు నువ్వు. నువ్వు అలా చూస్తూ ఉండూ ఏదో ఒక రోజు దాని వల్లే నీ కూతురు జీవితంలో సంతోషం పోతుంది.

సుమిత్ర: అత్తయ్య నా కూతురు జీవితంలో ఎలా సంతోషం పోకుండా చూడాలో నాకు తెలుసు దయచేసి మీరు దానికి దూరంగా ఉండండి. ఇది రిక్వెస్ట్ కాదు వార్నింగ్.

పారిజాతం: ఓహో కథ.. వార్నింగ్ ఇచ్చేదాకా వెళ్లిందా. దీప కార్తీక్‌ల మధ్య పైకి కనిపించేది కాక మరేదో సంబంధం ఉంది.

నర్శింహ, శోభ, అనసూయ దీప గురించి మాట్లాడుకుంటారు. దీప ఇక తమ జోలికి రాదు అని శోభ అంటే తన పేరు పలకడానికే భయపడుతుందని నర్శింహ అంటాడు. ఇంతలో దీప నర్శింహ ఇంటి గేటుని గట్టిగా తన్ని లోపలికి వస్తుంది. అందరూ దీపని చూసి షాక్ అవుతారు. శోభ వెళ్లి దీపని ఎందుకు వచ్చావ్ అని తిడుతుంది. దీంతో దీప శోభని చెంప మీద కొడుతుంది. శోభ రెండు దెబ్బలకు దీప అంటే గజగజ వణికిపోతుంది.

నర్శింహ: ఏంటే తెగ రెచ్చిపోతున్నావ్. ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా..

దీప: సరోపోలేదురా.. అని నర్శింహను నెట్టేస్తుంది. పక్కనే  ఉన్న కూరగాయలు తన్నేసి కత్తిపీట పట్టుకొని వచ్చి నరసింహ మెడ మీద పెడుతుంది. ఇప్పుడు మాట్లాడురా..

అనసూయ: ఏయ్ దీప నా కొడుకు మెడ మీద కత్తిపీట పెడతావా.

దీప: అడ్డు వస్తే నీ గొంతు మీద కూడా పెడతాను అత్తయ్య. నేను మాట్లాడుతాను. నువ్వు అలా విను అంతే. నేను మీలా మాట తప్పే మనిషిని కాదు అత్తయ్య మాట మీద నిలబడతాను.

నర్శింహ: కత్తి గొంతు మీద పెట్టావ్ ఏంటే తెగిపోతుంది.  

దీప: నువ్వు మాట్లాడే తేడా మాటలకు తెగడానికే పెట్టా. నన్నే బెదిరిస్తావా. ఇంక నా కూతురు ఇంటికి రాదా. నువ్వు అలా అనగానే నేను పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను నా కూతురిని వదిలేయ్ అని నీ కాళ్లమీద పడతాను అనుకుంటున్నావా.. నేను నిన్ను కూతుర్ని చదివించాలి అని డబ్బులు అడిగానా.. లేదా ఓ దారి చూపించు అడిగానా.. లేదే.. నా బతుకు నేను బతుకుతుంటే బతకనివ్వను. అంతు చూస్తాను.. కూతురిని దూరం చేస్తాను అంటే సమాధానం ఫోన్‌లో కాదు గేటులు తన్నుకుంటూ వస్తుంది. తిట్టినా భరిస్తుంది.. కొట్టినా భరిస్తుంది. కదా అని నా కూతురు జోలికి వస్తే పీక కోస్తా.  మీ ముగ్గురికి చెప్తున్నా నా బిడ్డ జోలికి ఎవరైనా వస్తే వాళ్లు ప్రాణాలతో మిగలరు. 

ఇక దీప కోపంతో అనసూయ దగ్గరకు వెళ్లి తన తండ్రి పొరపాటు చేశాడని ఎందుకు అన్నావ్ అని అడుగుతుంది. దీప కుభేర్ కూతురు కాదు అన్న నిజం దీపతో చెప్పదు అనసూయ. మామూలుగా ఉన్నాను అని అంటుంది. ఇక దీప ముగ్గురికి మరోసారి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ముగ్గురి ఫ్యూజులు అవుట్ అయిపోతాయి.

మరోవైపు కాంచన ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీధర్ అక్కడికి వస్తాడు. కాంచన కార్తీక్ గురించి అడుగుతుంది. కార్తీక్‌కు కాల్ చేస్తుంది. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి శౌర్య ఒక్కర్తే ఉందని దీప వచ్చాక వస్తాను అంటాడు. కార్తీక్ అలా ఉండటానికి బయటి మనిషిలో ఆలోచించమని శ్రీధర్ చెప్తాడు. కాంచన దీపకు విడాకులు ఇప్పించమని అంటుంది. కాంచన భార్యని మోసం చేసిన ఏ భర్తను క్షమించను అని అంటుంది. దానికి శ్రీధర్ ఏంట్రా ఈ ఖర్మ అనుకుంటాడు. కార్తీక్ శౌర్యని తీసుకొని బయటకు వెళ్లి తర్వాత ఇంటికి వస్తాడు. ఇంతలో దీప వచ్చేస్తుంది. ఇక దీప రావడం రావడమే శౌర్యని అలాగే వదిలేశారు అని కనీసం ఏమైనా తినిపించాలి అని కూడా లేదా అని కార్తీక్ మీద సీరియస్ అవుతుంది. ఇక శౌర్య తాను తినేశా అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఓరి దేవుడా ఇదేం ట్విస్ట్‌రా.. ముకుంద దగ్గర మురారి, పరిస్థితి మరీ ఇంత దారుణమా!

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH VS CSK Result Update: చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
చేపాక్ కోట బద్దలు.. చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
Andhra Pradesh: ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP DesamVirat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP DesamRCB vs RR Match Highlights IPL 2025 | పట్టు బిగించి చివర్లో మ్యాచ్ ను లాగేసుకున్న ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH VS CSK Result Update: చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
చేపాక్ కోట బద్దలు.. చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
Andhra Pradesh: ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Pak nationals in Hyderabad: హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
War Condoms:  కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
Chaurya Paatam Review - 'చౌర్య పాఠం' రివ్యూ: కొత్త హీరోతో ఇద్దరు పెద్ద డైరెక్టర్లు తీసిన క్రైమ్ కామెడీ డ్రామా... సినిమా హిట్టా? ఫట్టా?
'చౌర్య పాఠం' రివ్యూ: కొత్త హీరోతో ఇద్దరు పెద్ద డైరెక్టర్లు తీసిన క్రైమ్ కామెడీ డ్రామా... సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget