అన్వేషించండి

Satyabhama Serial Today July 5th Episode: సత్యభామ సీరియల్: విశాలాక్షిని అత్తమ్మా అని పిలిచిన నందిని, గాల్లో తేలిపోయిన అత్త.. రేణుకకి భైరవి గిఫ్ట్, క్రిష్‌ ఎమోషనల్! 

Satyabhama Serial Today Episode నందిని పుట్టింటిలో తన అత్తవారిని పొగిడి తనని బాగా చూసుకుంటున్నారు అని చెప్పి మొదటి సారి విశాలాక్షిని అత్తమ్మ అని పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode మహదేవయ్య ఇంట్లో అందరూ మీడియా సమావేశానికి హాజరవుతారు. అందరినీ మహదేవయ్య పరిచయం చేస్తాడు. ఇక సత్య మా మామయ్య గారు అందరిని పరిచయం చేశారు కానీ ఒకరిని పరిచయం చేయలేదు అని అంటుంది. త్వరలో తమ ఇంటికి వారసుడు రాబోతున్నారని అంటూ రేణుక ప్రెగ్నెంట్ అని చెప్తుంది. 

 మీడియా: మీకు ఇష్టం లేకుండా బలవంతంగా ఈ ఇంటికి కోడలు అయ్యారని, ఏదో ఒక రోజు మీ బంధం తెగిపోవచ్చని జనం అనుకుంటున్నారు. దీనికి మీ సమాధానం.  
క్రిష్‌: ఏదో ఒక రోజు విడిపోతాం అని మీకు ఎవరు చెప్పారు. ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలకు సమాధానం చెప్పం.
సత్య: ప్రెస్ వాళ్లు వెళ్లిపోతామంటే.. ప్రశ్న అడిగింది నన్ను సమాధానం చెప్పాల్సింది నేను ఆయన ఏదో అంటే వెళ్లిపోతారు ఏంటి. నేను కావాలనే కోరుకునే క్రిష్‌ని పెళ్లి చేసుకున్నాను. ఆస్తిలో తేడా ఉన్నా మామయ్య గారు పెద్ద మనసుతో నన్ను కోడలిని చేసుకున్నారు. అందుకు రుణ పడి ఉంటాడు. అలకలు కోపాలు గొడవలు లేని కాపురాలు ఉండవు. కానీ బంధం నిలుపుకోవాలి అని ఆలోచనే బంధాన్ని పదిలంగా ఉంచుతుంది. ఏ భార్య అయినా భర్త అయినా గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. అర్హత లేకపోయినా ఓ గొప్పింటికి కోడలిని అయ్యాను. అత్తింటి వాళ్ల సాకారంతో ఈ ఇంటి మనిషిలా మారిపోయాను. అత్తయ్య మామయ్య నన్ను కన్న బిడ్డలా చూసుకుంటున్నారు. కట్టుకున్న వాడు కంటికి రెప్పలా నన్ను కాపాడుతున్నాడు. ఏ ఆడపిల్లకి అయినా ఇంత కంటే ఇంకేం కావాలి చెప్పండి.
మీడియా: అంటే మీ జంట ఎప్పటికీ విడిపోదు అని నమ్మొచ్చా.
మహదేవయ్య: బాండ్ పేపర్ మీద సంతకం రాసి ఇస్తావాళ్లు విడిపోరు.
మీడియా: మీ మాట కూడా వినకపోతే.
మహదేవయ్య: ప్రాణ త్యాగం చేస్తా.
సత్య: మామయ్య ఎందుకు అంత పెద్ద మాట.
మహదేవయ్య: ఇది మాట కాదమ్మా  నీ మీద ఉన్న నమ్మకం.
మీడియా: నందినితో.. మేడం మీరు మీ వారిని ఇళ్లరికం తీసుకురావాలి అనుకుంటున్నారు అంట జనం మాట.
నందిని: నేను ఇళ్లరికం తీసుకురావడం కాదు. నా పెనిమిటి తనంతట తాను ఇళ్లరికం వస్తాను అన్నా నేను ఒప్పుకోను. బాపు ఈ మాట కూడా నువ్వు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ఇవ్వొచ్చు. కోడలు అన్నాక అత్తింటిలోనే ఉండాలి. అత్తిళ్లే తన ఇళ్లు. నేను పెద్దంటి నుంచి పేదింటికి పోయినా నాకు అక్కడ ఇరుకు అనిపించడం లేదు. ఎందుకు అంటే అక్కడ అందరివీ పెద్ద మనసులు..
మీడియా: సార్ మీ ఇళ్లు నిజంగానే వసుధైక కుంటుంబంలా ఉంది. మా అనుమానాలు అన్నీ పోయాయి వెళ్లొస్తాం.
నందిని: పద మనం కూడా పోదాం.
భైరవి: అదేంటి అమ్మ ఇక్కడే ఉండొచ్చు కదా.
నందిని: మా కోసం అత్తమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. పద హర్ష.
విశ్వనాథం: నెత్తి మీద కొండంత భారం మోస్తున్నట్లు ఉంది. ఇప్పుడు భారం అంతా పోయింది. ఇక నిశ్చింతగా ఉండొచ్చు. స్వేచ్ఛగా ఉండొచ్చు.
విశాలాక్షి: సత్యని చూస్తే చాలా సంతోషంగా ఉంది. 
నందిని: అత్తమ్మ ఆకలి వేస్తుంది. అన్నం పెట్టు. 
హర్ష: మీ ఇంట్లో తినమన్నా తినకుండా ఎందుకు వచ్చేశావ్.
నందిని: అలా అని ఇక్కడ అన్నం పెట్టరా. అవునా అత్తమ్మ. 
హర్ష: అలా అని కాదు మన కోసం వండిందో లేదో తెలుసుకోవాలి కదా. మనం రాము అని చెప్పాం కదా. 
నందిని: ఏం అత్తమ్మ నీ కూతురే వచ్చి ఆకలి వేస్తుంది అంటే ఏం చేస్తావ్ అత్తమ్మ. చెప్పకుండా భోజనానికి ఎందుకు వచ్చావ్ అంటావా.  అత్తమ్మా.. చూడు నీ కొడుకు నా మీద ఎలా అరుస్తున్నాడో నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా. 
విశాలాక్షి: నువ్వు మా మధ్యలోకి రాకురా. నా కోడలిని ఇంకొక్క మాట అంటే ఊరుకోను. నేను నీ కోసం వండలేదు నా కోడలి కోసం మాత్రమే వండాను. విన్నారా ఏయ్ ఓయ్ అని పిలిచే నా కోడలు మొదటి సారి నోరారా ఆప్యాయంగా అత్తమ్మ అని పిలిచింది. నేను ఇప్పుడు నేల మీద లేను గాల్లో తేలుతున్నాను. నువ్వు రామ్మా ముద్దలు కలిపి పెడతాను.  

కాళీ పీడ విరగడైపోయింది అని ఇంట్లో జరిగింది అంతా విశ్వనాథం హర్షకి చెప్తాడు. దీంతో ఇద్దరూ నవ్వుకుంటూ హగ్ చేసుకుంటారు. క్రిష్ గదిలోకి వస్తే సత్య మీడియా సమావేశం బాగా జరిగింది కదా.. నందినికి ఇంకా పుట్టింటి మీద అలక పోలేదు అని మాట్లాడుతుంది. క్రిష్‌ మాత్రం ఏమీ అనకుండా అలా ఉండిపోతాడు. ఏమైంది అని డల్‌గా ఉన్నావ్ అని సత్య అడిగితే క్రిష్ ఏ గుడికి వెళ్లావ్ అని అంటాడు. దాంతో క్రిష్ అబద్ధం అడితే అతికినట్లు ఉండాలి అని అంటాడు. ఎలా అని సత్య అడిగితే కొట్టకుండా తీసుకొచ్చిన కొబ్బరి కాయ చూపిస్తూ నువ్వు ఇక్కడ దొరికిపోయావ్ అంటాడు. ఇక సత్య తప్పు చేశాను అని తెలిస్తే ఎందుకు అందరి ముందు నిలదీయలేదు అని అడుగుతుంది. దానికి క్రిష్ ఇంకా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు సత్య. నువ్వు నేను ఒకటే అని నిన్ను ఇబ్బంది పెట్టడం తనకు రాదు అని క్రిష్ అంటాడు.  ఇక సత్య ఎక్కడికి వెళ్లానో కూడా అడగవా అంటే నీ అంతట నువ్వు చెప్పే వరకు నేను అడగను అని అంటాడు. నువ్వు నేను ఫ్రెండ్ అని నన్ను అనుకుంటున్నావ్ అని భార్య అని అనుకుని ఉంటే అడిగే వాడిని అని అంటాడు. మాట్లాడుతూ క్రిష్ ఎమోషనల్ అయిపోతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. నాకు తెలీకూడదు అని అనుకుంటున్నావ్  కాబట్టే చెప్పలేదు అని లేదంటే చెప్పే వెళ్లేదానివి అని అంటాడు. ఇక భైరవి రేణుక దగ్గరకు హారం తీసుకొని వెళ్తుంది. రేణుక చాలా సంతోషిస్తుంది. ప్రేమగా చూసుకుంటున్నారని మొదటి సారి బహుమతి ఇస్తున్నారు అని చాలా సంతోష పడుతుంది. రేణుక సంతోషంతో అత్తని ఆ నెక్లెస్ మెడలో వేయమంటే భైరవి రుద్రని వేయమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget