అన్వేషించండి

Satyabhama Serial Today January 31st: క్రిష్‌ కోసం రెస్టారెంట్‌కి వచ్చిన సత్య.. సత్య కోసం మాధవ్.. నిజం తెలిసిపోతుందనే టెన్షన్‌లో కాళీ!

Satyabhama Serial Today Episode క్రిష్‌కి వార్నింగ్ ఇవ్వాలని సత్య రెస్టారెంట్‌కి వస్తే సత్య కోసం మాధవ్ కూడా అదే రెస్టారెంట్‌కి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode: సత్య క్రిష్ ఇచ్చిన చీర కట్టుకొని క్రిష్‌ తాట తీస్తా అంటూ రెస్టారెంట్‌కి బయల్దేరుతుంది.  క్రిష్ వాళ్ల అమ్మానాన్నల మాటతో శైలజను అదే రెస్టారెంట్‌కు తీసుకొని వస్తాడు. శైలు క్రిష్‌తో ముచ్చట్లు పెడుతుంది. క్రిష్‌ ఇబ్బందిగా ఫీలవుతుంటాడు. 

శైలు: చిన్నా.. అంటీ నిన్ను అలా పిలుస్తుంటే ఎంత ముద్దుగా ఉందో..
క్రిష్‌:  మనసులో.. బయట వాళ్ల ముందు చిన్నా గిన్నా అని పిలవొద్దని లక్షసార్లు చెప్పా అమ్మకి వింటే కదా..
శైలు: నేను అలా పిలవొచ్చా.. అంటే అది చిన్నా అని..
క్రిష్‌: నా పేరు క్రిష్‌.. క్రిష్‌ అనే పిలు..
శైలు: నేను ఎదురుగా కూర్చొంటే నాతో మాట్లాడకుండా దిక్కులు చూస్తావేంటి.
క్రిష్‌: అదే ఏదో మాట్లాడాలి అని తీసుకొచ్చావ్ కదా ఏంటో చెప్పు.
శైలు: నువ్వు ముళ్ల మీద కూర్చొన్నట్లు ఉంటే నేను ఎలా మాట్లాడాలి.. నీకు ఇష్టం లేకుండా బలవంతంగా స్కూల్‌కి లాక్కొచ్చినట్లు ఉంది. 
క్రిష్‌: మనసులో.. అరే సంపంగి వచ్చేస్తుందేమో.. ఈ శివంగి మాత్రం పట్టుకొని వదలట్లేదు.. నీకోసం నా మనసు చంపుకొని నటిస్తున్నానే తల్లీ..
శైలు: నువ్వు కూడా ఎవర్ని అయినా లవ్ చేశావా.. ఎవర్ని..
క్రిష్‌: మనసులో.. ఇలా ఇరుక్కుపోయానేంటో.. హా.. నన్నే..
శైలు: నీ మైండ్ ఎక్కడో ఉంది. ఎటో చూస్తున్నావ్.. ఏదో ఆలోచిస్తున్నావ్... 
 
మరోవైపు క్రిష్ బాబీని సైగ చేసి పిలుస్తాడు.. ఇక బాబీ కూడా అన్న వదినను పిలిచి వేరే వాళ్లతో ముచ్చట్లు పెట్టాడేంటి అని అనుకుంటాడు. క్రిష్‌ అర్జెంట్‌గా ఫోన్ చేయాలి అని శైలు నుంచి తప్పించుకుంటాడు. మరోవైపు సత్య, మైత్రి, హర్ష రెస్టారెంట్‌కి వస్తుంటారు. సత్య, మైత్రి రౌడీ అంటూ క్రిష్‌ గురించి మాట్లాడుకుంటారు. హర్ష అడిగితే మాధవ్ గురించి అని చెప్తేస్తారు.

బాబీ: అన్నా ఓ వైపు వదినను రమ్మని మరోవైపు ఇంకో వదినతో ముచ్చట్లు పెట్టావు. 
క్రిష్‌: రేయ్ పోరా.. పేరుకే నేను కృష్ణుణ్ని.. లోపల రామున్ని.. ఒకే జీవితం.. ఒకే వదిన..
బాబీ: మరి లోపల ఆవిడ.
క్రిష్‌: హే.. అది మా బాపూ పెట్టిన ఫిటింగ్‌రా.. నేనేమో సంపంగి నా దేవత అని అనుకుంటే మా ఇంట్లో వాళ్లు లోపల కూర్చొన్న ఆ టిక్కులాడిని కోడలు అని ఫిక్స్ అయ్యారు. తప్పించుకొనే దారి లేక వెంట తీసుకొచ్చాను.
బాబీ: అన్నా వదిన కానీ నిన్న ఆమెతో చూసిందా నీ లెటర్ చిరిగిపోతుంది. 
క్రిష్‌: రేయ్ అది కాదురా నేను చెప్పేది విను. ఏ క్షణం అయినా మీ వదినా రావొచ్చు. మీ వదిన వస్తే నవ్వు బొకే ఇచ్చి మర్యాద చేసి లోపల కూర్చొపెట్టు.  
బాబీ: మరి నువ్వు అన్న..
క్రిష్‌: రేయ్ ఉంది కాదరా నాకు ఓ టక్కులాడి.  దాన్ని మ్యానేజ్ చేస్తూ ఉంటా.. మీ వదిన రావడం నాకు కనిపిస్తూనే ఉంటుంది. ఆ టక్కులాడిని మాయ చేసి మీ వదినను కలుస్తా.. 
కాళీ: అన్నా ఇలా అంటున్నాను అని ఏం అనుకోకు వదినా వస్తుందా అన్నా..
క్రిష్‌: రేయ్ ఎందుకు రాదురా.. నేను ఇచ్చిన అమ్మవారి బొట్టు పెట్టుకుంది.. నేను ఇష్టం అంటూ లెటర్ రాసింది కదరా.. నేను పంపిన గిఫ్ట్ కూడా తీసుకుంది. రేయ్ నేను పిలిస్తే రాదా.. వస్తుందిరా.. నేను పంపించిన చీర కట్టుకొని దేవత లెక్క నా ముందుకు వస్తుంది. మీరు చూస్తూ ఉండండిరా..
కాళీ: అన్నా అది కాదు అన్నా.. నువ్వు ఈడ ఉన్నావని వదినకు ఎలా తెలుస్తుంది. 
క్రిష్‌: అంత దిమాక్ లేదు అనుకున్నావ్ రా నాకు.. నేను పంపిన చీరలో లెటర్ రాసి పెట్టా.. 

మాధవ్: విశ్వనాథానికి ఫోన్ చేసి.. అంకుల్ అది సత్య..
విశ్వనాథం: నీ దగ్గరకే బయల్దేరింది  బాబు. అదే నువ్వు రెస్టారెంట్‌కి రమ్మని చెప్పావంట కదా. ఏం బాబు ఇంకా రాలేదా.. హర్ష, మైత్రి కూడా తోడుగా వచ్చారు బాబు. దారిలో ఉన్నారులే వచ్చేస్తారులే.
మాధవ్: కవర్ చేస్తూ.. అవును అంకుల్ నేనే రమ్మన్నాను. బయల్దేరారా లేదా అని కనుక్కుందామని ఫోన్ చేశాను. మనసులో.. నేను రమ్మన్నాన్న అని బయల్దేరడం ఏంటి సత్య ఎందుకు అలా చెప్పింది. తన ఫ్రెండ్స్‌ని కలవడానికి అలా చెప్పిందేమో.. నేను కూడా రెస్టారెంట్‌కి వెళ్లి తనకి సర్‌ప్రైజ్ గా ఈ గిఫ్ట్ ఇస్తాను. 

కాళీ: మనసులో.. వీడు నాకు చెప్పకుండా చీరలో లెటర్ పెట్టాడా.. అయినా ఆ సత్య వీడి మీద అగ్గిమీద గుగ్గిలంలా ఉంది. ఎందుకు వస్తుందిలే.. సత్య క్రిష్‌ ఇచ్చిన చీర కట్టుకొని రావడం చూసి.. అంత లొల్లి పెట్టి ఇంత కూల్‌గా వస్తుంది ఏంటిరా..
సత్య: మైత్రితో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే  అన్నయ్యను నా నుంచి దూరంగా విడిగా కూర్చొపెట్టు. నేను వెళ్లి ఆ రైడీ గాడి అంతు తేల్చుతా... అవసరం అయితే మిమల్ని పిలుస్తా.. మైత్రి హర్షని రొమాంటిక్‌గా మాట్లాడి పక్కకు తీసుకెళ్తుంది. 
కాళీ: ఇది ఏందిరా వచ్చింది.. ఏం చేద్దామని వచ్చింది. పేరుకు తగ్గట్టు సత్యభామనే. రేయ్ ఇప్పుడు ఆ క్రిష్ గాడు సత్యని చూశాడు అంటే నా ప్లాన్ మొత్తం  వేస్ట్ అవుతుంది. స్పాట్‌లో నా గొంతు పట్టుకొని చంపేస్తాడురా.. 

క్రిష్ సత్యను చూస్తాడు. తనే బొకే తీసుకొని వచ్చి ఇచ్చినట్లు ఊహించుకుంటాడు. బొకే ఇస్తాడు. సత్య తీసుకొని ఇద్దరూ కూర్చొని సరదాగా మాట్లాడుకున్నట్లు తన ప్రేమను చెప్పినట్లు ఊహించుకుంటాడు. సత్యకు నచ్చానా అని అడుతాడు. తన మనసులో మాటలు చెప్తాడు. అందుకు సత్య నవ్వుతో అంగీకారం చెప్పినట్లు ఊహించుకుంటాడు. క్రిష్‌ సత్యను ఊహించుకొని చేతిలో గులాబి పట్టుకొని ఐలవ్‌యూ అంటాడు. అయితే శైలు తనకే అనుకుంటుంది. నాకేనా అని అడుగుతుంది. దీంతో క్రిష్‌ తనకు పువ్వులు అంటే ఇష్టమని పువ్వులు కనిపిస్తే ఐలవ్‌యూ చెప్తాను అని కవర్ చేస్తాడు. మరోవైపు బాబీ సత్యను చూసి బొకే పట్టుకొని సత్య దగ్గరకు వెళ్తాడు. 

బాబీ: వదినా మీకోసమే చూస్తున్నా వదినా.. ఈ బొకే మీ కోసమే.. అన్న ఇమ్మన్నాడు.
సత్య: మనసులో.. ఎవడు పడితే వాడు వదినా అంటున్నాడు. కానీ అసలు వాడు బయటకు రావడం లేదు. నువ్వు నిన్ను ఎక్కడో చూసినట్లు ఉందే.. తనెక్కడ.. 
బాబీ: అనుకున్నా రాగానే అన్నని చూడాలి అని అనుకుంటావ్ అనుకున్నా.. 
సత్య: మాటలు తర్వాత వెంటనే మీ అన్నని చూడాలి.. వినపడుతుందా.. బాబీ సత్యను ఓ టెబుల్ దగ్గర కూర్చొపెడతాడు.

కాళీ: అయిపోయిందిరా.. ఇంక కొంచెం సేపటిలో బాంబు పేలుతుంది. ఆ క్రిష్‌గాడి పోయి సత్యను కలుస్తాడు. నా బండారం మొత్తం బయట పడుతుంది.  మరో వైపు మాధవ్ కూడా అక్కడి వస్తాడు. అది చూసిన కాళీ.. ఏందిరా సామి నాకు షాకుల మీద షాకులు తగులుతుంది. ఏదో ఒకటి చేసి ఆ క్రిష్‌ గాడిని సత్యభామకు కలవకుండా చేద్దాం అంటే ఈ పెళ్లి కొడుకు దిగబడ్డాడు ఏంట్రా.. సత్య క్రిష్ గాడికి కలుసుకోవడానికి వచ్చిందిని ఈ పెళ్లి కొడుకు తెలిసిపోయిందా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి వచ్చాడా ఏంటి. 

మాధవ్ మైత్రి వాళ్ల దగ్గరకు వస్తాడు. మైత్రి షాక్ అయిపోతుంది. మాధవ్ ఎందుకు వచ్చాడని రౌడీతో సత్య మాట్లాడటం చూస్తే రచ్చ రచ్చ అవుతుంది అని అనుకుంటుంది. ఇక మాధవ్ సత్య ఏది అని అడిగితే హర్ష అదేంటి నీతోనే ఉండాలి కదా అని అంటాడు. మాధవ్ కూడా షాక్ అవుతాడు. మైత్రి కవర్ చేస్తుంది. మాధవ్‌ని సత్య దగ్గరకు వెళ్లమని హర్ష చెప్తాడు. మాధవ్ వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

సీతే రాముడి కట్నం సీరియల్ జనవరి 31st: రామ్‌ సీతలకు విడాకులు ఇప్పించేందుకు మహా కుట్ర, సీత కనిపెడుతుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget