Satyabhama Serial Today January 22nd: రుద్ర, రేణుకలపై విరుచుకుపడ్డ భైరవి.. రెండో పెళ్లి చేస్తానని వార్నింగ్!
Satyabhama Serial Today Episode రేణుక, రుద్రలకు ఆరు నెలల గడువు ఇచ్చి గుడ్ న్యూస్ చెప్పాలని భైరవి కండీషన్ పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode: సత్యభామ దగ్గరకు కాళీ వచ్చి తన అన్న కుంకుమ ఇస్తే నువ్వు పెట్టుకున్నావ్ వదినా అని అంటాడు. సత్య షాక్ అవుతుంది. కుంకుమ పెట్టుకోవడంతో తన అన్న సగం పెళ్లి అయిపోయిందని ఫిక్స్ అయిపోయాడని ఇక చచ్చినా నిన్ను వదిలిపెట్టడని కాళీ చెప్పడంతో సత్య షాక్ అయిపోతుంది. కోపంతో సత్య అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తుంది.
కాళీ: ఓ సత్యభామ నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు వెళ్లిపోతావ్ ఏంటి.. చేయి పట్టుకున్నానని అప్పుడు నా చెంప మీద కొట్టావు కదా.. మరి ఇప్పుడు ఏంటి. ఉరుక్కుంటూ వెళ్తున్నావ్.. భయం వేస్తుందా.. చటాక్ అంత ధైర్యం కూడా లేదా.. ఖలేజా లేదా.. నువ్వు ఆడపులివి ఏమో అనుకున్నా.. ఆడ పిల్లివి అనుకోలేదు..
సత్య: కాళీ చెంప పగలగొడుతుంది. ఏంట్రా అన్నావ్ చటాక్ అంత ధైర్యం కూడా లేదా టన్నుల కొద్ది ఉంది. ఎవడ్రా ఎవడ్రానీ అన్న నా ముందుకు రమ్మను. నేను భయపడి పారిపోవడం లేదురా.. నా కుటుంబం గురించి ఆలోచించి గొడవలు వద్దు అని వెనక్కి తగ్గిపోతున్నా. నా భయాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు. ఈ ఆడపులిని తక్కువ అంచనా వేయొద్దు. ముసుగు వేసుకొని యుద్ధం చేయడం కాదు. మీసం ఉంటే నా ముందుకు వచ్చి నిల్లోమని చెప్పు. తెర వెనుక నాటకాలు ఆడటం కాదు. నేను బామ్మను కాదు సత్యభామని.. నాకు భయపడటమే కాదు భయపెట్టడం కూడా తెలుసు. అవతల మా వాళ్లు వెయిట్ చేస్తున్నారు వస్తాను.
కాళీ: అసలు ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఇంత ధైర్యం ఇప్పటి వరకు పిల్లి లెక్క భయపడింది. ఇప్పుడు పులి లెక్క ఎదురు తిరిగింది. అమ్మో.. ఇది కలా నిజమా..
భైరవి: పంతులుతో.. పెళ్లయి ఐదేళ్లు అయింది. పిల్ల లేదు పీసు లేదు. దీని మనసుల బాధే లేదు. పది మందిలో పరువు తీస్తుంది. దీని జాతకంలో పిల్లలు పుట్టే యోగ్యత ఉందో లేదో చూస్తూ ఏం చేయాలి ఇంటికి వెళ్లాక నేను చూస్తా స్వామి.
రేణుక: మనసులో.. తప్పు నీ కొడుకులో పెట్టుకొని నన్ను అంటే ఏమొస్తుంది అత్త. ఎవరికి చెప్పుకోను నా బాధ. ఆ దేవుడు నాతో ఆడుకుంటున్నాడు.
పంతులు: అమ్మా మీకు ఓ మాట అడుగుతాను నిజం చెప్తారా. అమ్మా మీరు నన్ను పరీక్షించడానికి వచ్చారా నిజంగానే జాతకం చెప్పించుకోవడానికి వచ్చారా..
భైరవి: మీతో మాకు మజాక్ ఏంటి పంతులు గారు. నిజంగానే అడుగుతున్నా.
పంతులు: మీ కోడలు చేతిలో సంతాన రేఖ చాలా బలంగా ఉంది. ఈ పాటికే ఈ అమ్మాయికి బిడ్డలు పుట్టి ఉండాలి. ఇంత వరకు నేను చెప్పిన జాతకాల్లో ఏదీ లెక్క తప్పలేదు. ఇది కూడా తప్పదు. నేను చెప్పింది ముమ్మాటికీ నిజం. ఈవిడ జాతకం ప్రకారం ఈ పాటికే తల్లి అయి తీరాలి. ఆ విషయం మీకు ఎందుకు చెప్పడం లేదో నాకు అర్థం కావడం లేదు. కచ్చితంగా తను ఏదో నిజం మీ దగ్గర దాస్తుంది. సమస్య ఏంటో ఆమెను ఇంటికి తీసుకెళ్లి ప్రశాంతంగా మాట్లాడండి.
హర్ష: నాన్న సత్య తన మనసులో మాట ఓపెన్‌గా చెప్తుంది కానీ ఎదురు తిరిగే వ్యక్తిత్వం కాదు సర్దుకుపోతుంది.
విశ్వనాథం: మొదటి నుంచి ఈ ఇంట్లో జరుగుతున్నది అదే కదా.. ఆడపిల్లలకు స్వేచ్ఛ ఇవ్వకుండా కాళ్లకు సంకెళ్లు వేసి పెంచుతున్నాను. సగటు తండ్రిగా నా భయాలు నావి. నా బలహీనతలు నావి. ఇవి చాలవు అన్నట్లు మీ నాన్నమ్మ కట్టుబాట్లు, బెదిరింపులు. కేవలం నా మీద ప్రేమతో తన ఆశలకు, తన మనసుకు కళ్లెం వేసుకొని బతుకుతుందిరా సత్య. అది తెలిసి కూడా తెలీనట్లే ఉంటాను ఎందుకు అంటే కాళీ లాంటి రౌడీ వెదవల వల్ల సత్య ఇబ్బంది పడకూడదు అని. కానీ సత్య మనం ఇబ్బంది పడకూడదు అని పరిస్థితులకు తలవంచుతుంది. తెలీకుండానే నా మనసులో బాధ బయటకు వచ్చేసిందిరా..
మైత్రి: హాయ్ అంకుల్.. హాయ్ హర్ష.. ఏంటి ఇళ్లంతా సైలెంట్ గా ఉంది.
విశ్వనాథం: అమ్మా అందరూ గుడికి వెళ్లారు. అన్నట్లు నీకు విషయం చెప్పలేదు కదా.. సత్యకు మంచి సంబంధం వచ్చిందమ్మా. అబ్బాయి అమెరికాలో ఉంటాడు.
భైరవి: ఏయ్ ఆగే.. లోపలికి పారిపోతే ఈ పిచ్చిది ఏం అడగదు. అన్నీ మర్చిపోద్ది అనుకున్నావా.. ఆ పంతులు ముందే నీ జుట్టు పట్టుకొని నిలదీయాలి అనుకున్నా.. ఇంటి పరువు కోసం ఆలోచించి ఆగిపోయా.. నాకు తెల్వకుండా ఈ మొగుడు పెళ్లాలు తెర వెనుక నాటకాలు ఆడుతున్నారు.
రుద్ర: మనసులో.. దీని కడుపు గురించి ఇది అమ్మకు చెప్పినట్లు ఉంది.
భైరవి: ఏం జరుగుతుందిరా..
రుద్ర: నీ అనుమానం ఏంటో నాకు అర్థం కావడం లేదు అమ్మా..
భైరవి: ఎందుకు అవుతుంది రా కూడబలుకుకున్నారు కదా.. నీ పెళ్లం మాట్లాడదు. నువ్వేమో మాట దాటేస్తున్నావ్. గుడిలో పంతులు దీన్ని చూసి ఏం అన్నారో తెలుసా అత్తమ్మ... ఇప్పటికే దీని కడుపుల పిల్లలు పుట్టి ఉండాలి అంట. ఆ విషయాన్ని చాలా గట్టిగా చెప్పాడు.
రుద్ర: అట్లా ఎట్లా చెప్తాడే.. అయినా నువ్వు ఎలా నమ్మావే అమ్మా.
భైరవి: నాకు ఆయన మీద నమ్మకం ఉందిరా.. మీ మీదే నమ్మకం లేదు. ఇది ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు.
రేణుక: ఈ ఇంట్లో నాకే విలువ లేదు నా మాటకు కూడానా.. నాకూ మనసు ఉందని ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు నేను మాట్లేడితే ఏముంటుంది. అందుకే నేను ఎవరు ఏమైనా అనుకోని అని మౌనంగా ఉంటున్నాను. ఎవరు ఏమైనా అనుకోని అని భరిస్తున్నాను. ఏమి అడగాలి అనుకున్నా ఆయన్నే అడగండి చెప్తాడు.
భైరవి: రేయ్ పెద్దొడా నీ పెళ్లం చేతులు ఎత్తేసింది. నువ్వు అయినా జరిగింది ఏంటో.. జరగబోయేది ఏంటో చెప్పు. పిల్లలు పుట్టకుండా ప్లాన్ చేసుకుంటున్నారా..
రుద్ర: అలాంటి పిచ్చి పనులు మేమెందుకు చేస్తాం అమ్మా.. పిల్లల కోసం నువ్వు ఎంత ఆరాట పడుతున్నావో నాకు తెలీదా.. అన్నీ తెలిసి అలాంటి ప్లానింగ్ మేమెందుకు చేస్తాం అమ్మా. మొన్నే కదా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాం.
భైరవి: ఏన్నేళ్లు ఆగుదాం... కేవలం ఆరు నెలలు ఆగుదాం.. తర్వాత అది నెల తప్పక పోతే.. నీకు ఇంకో పెళ్లి చేస్తా.. ఇందులో ఎవరి మాట వినేది లేదు ఇది ఫైనల్.
మైత్రి: ఎందుకు ఇంత ముభావంగా ఉన్నావే..
సత్య: ఈ మగాళ్లు అంటేనే చిరాకుగా ఉందే.. ఎందుకు ఆడవాళ్లని ఇలా వెంటాడి వేధిస్తారు.
మైత్రి: రేపోమాపో పెళ్లి పెట్టుకుని ఇలా అంటున్నావ్ ఏంటే.. పొరపాటున నీ కామెంట్స్ నీ కాబోయే భర్తకి వినపడితే ఇంకేమైనా ఉందా దెబ్బకు రిటన్ ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోతాడు. మళ్లీ ఏం జరిగిందే.. ఎవడో కాళీ అన్నావ్ వాడితోనేనా ప్రాబ్లమ్..
సత్య: వాడి ఒక్కడితోనే కాదు ఎవడో వాడి అన్నతో కూడా.. రోజు రోజుకు మరింత ముదురుతున్నాడు. గుడిలో ఏం జరిగిందో తెలుసా.. అంటూ మొత్తం చెప్తుంది.
మైత్రి: ఆ బొట్టుకు చాలా ఫవర్ ఉందే.. నీ జీవితంలోకి వచ్చే మొగుడు ఆ రౌడీ ఏమో అని భయంగా ఉందే..
సత్య: నోర్ముయ్‌వే.. కచ్చితంగా ఇది చిన్న విషయం కాదు. వాడు నిజంగా అక్కడి వరకు వస్తే వాడిని అక్కడే చంపేస్తా..
మైత్రి: నాకు తెలిసి ఆ రౌడీ నిన్ను అంత ఈజీగా వదలడే.. రేపు వచ్చే సంబంధం ఓకే చెప్పేయ్‌వే.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: నాగపంచమి జనవరి 22nd: పంచమి, ఫణేంద్రల నుంచి శక్తులు లాక్కొని శాపం పెట్టిన నాగదేవత.. మేఘన మీద అనుమానం!