Naga Panchami Serial Today January 22nd: పంచమి, ఫణేంద్రల నుంచి శక్తులు లాక్కొని శాపం పెట్టిన నాగదేవత.. మేఘన మీద అనుమానం!
Naga Panchami Serial Today Episode: పంచమి రహస్యంగా నాగలోకం వెళ్లిందని నమ్మి నాగదేవత పంచమి, ఫణేంద్రల దగ్గర నుంచి నాగశక్తులు తీసుకొని శాపం పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode: మేఘన నాగ చంద్రకాంత మొక్క పసరును మోక్షకు పడుతుంది. దీంతో మోక్ష ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటాడు. అందరూ ఎంతగానో సంతోషిస్తారు. డాక్టర్ చెక్ చేసి ఇదో అద్భుతం అని తానే నమ్మలేకపోతున్నాను అని ఇక మోక్షకి ఏం కాదు అని డాక్టర్ చెప్తాడు.
మేఘన: హమ్మయ్య నేను తీసుకొచ్చిన మూలికల వల్ల మోక్షాబాబు బతికాడు. భగవంతుడా నాకు ఇది చాలు..ఈ పసరు పని చేస్తుంది అని నాకు కూడా తెలీదు. అంతా భగవంతుడి దయ.
శబరి: మోక్ష మమల్ని గుర్తుపట్టావా ఇలా చూడు నాన్న నేను నీ శబరిని. ఇలా చూడు. ఇక పంచమి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అది చూసిన ఫణేంద్ర పంచమి దగ్గరకు వెళ్తాడు.
పంచమి: స్వామి నా మొర ఆలకించావా స్వామి.. నాకు తెలుసు స్వామి నువ్వే నా భర్తను కాపాడావు అని. చాలు స్వామి ఇక నేను ఏమైపోయినా పర్లేదు. మోక్షాబాబు బతికారు. నాగగండం తప్పిపోయింది. మోక్షాబాబు ఇప్పుడు పూర్ణాయుష్కుడు. ఒక్కసారిగా నా భారం అంతా దిగిపోయింది స్వామి. ఎన్ని జన్మలు ఎత్తినా నీ రుణం తీర్చుకోలేను స్వామి.
ఫణేంద్ర: యువరాణి. ఇష్టరూప నాగు విషానికి భూలోకంలో ఔషధం దొరకడం అసాధ్యం. నాగచంద్రకాంత మొక్క తప్ప మరేరకమైన ఔషధం ఈ విశ్వంలో మోక్షని బతికించే అవకాశమే లేదు. ఆ మొక్క నాగలోకంలో తప్ప మరెక్కడా దొరకదు. అలాంటిది మేఘన ఏదో ఆకు పసరు తెచ్చి మోక్షని బతికించడం నేను నమ్మలేకపోతున్నా యువరాణి.
పంచమి: నేను ఇప్పుడు ఏం ఆలోచించే పరిస్థితిలో లేను ఫణేంద్ర. మోక్షాబాబు బతికారు నా కోరిక తీరింది. నా బాధ్యత పూర్తి అయింది.
ఫణేంద్ర: నేను నిన్ను మోసం చేసినట్లు మంత్రం చెప్పకుండా అబద్ధం ఆడానని నన్ను నిందించావ్. నీ ముందు నా నీతి నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు ఉంది. నేను ఏం తప్పు చేయకుండా నీ ముందు దోషిగా నిలబడటం నాకు అవమానంగా ఉంది.
పంచమి: ఇప్పుడు అవన్నీ వదిలేద్దాం ఫణేంద్ర. కారణం ఎవరైనా పర్లేదు. మోక్షాబాబు బతికారు. నాకు ఇప్పుడు ఎవరి మీద కోపం ద్వేషం లేదు.
ఫణేంద్ర: సరే యువరాణి నీ కోరిక మేరకు మోక్షా బతికారు. ఇక నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నాతో నాగలోకం వచ్చి శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలి. నిన్ను నమ్మి ఎలాగైనా నిన్ను తీసుకొస్తానని లేదంటే ఆత్మార్ఫణ చేసుకుంటానని నేను నాగదేవతకు వాగ్దానం ఇచ్చాను. ఇప్పుడు నువ్వు రాకపోతే నాకు మరణమే శరణ్యం.
పంచమి: నేను మాట తప్పను యువరాజా. మోక్షాబాబు ప్రాణాల కోసం నేను మీతో వస్తాను అని మాట ఇచ్చాను. నా మాట నిలబెట్టుకుంటాను యువరాజా. నాకు కొంచెం సమయం ఇవ్వు మోక్షాబాబుని ఒప్పించి నీతో వచ్చేస్తాను.
ఫణేంద్ర: అది జరగదు యువరాణి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మోక్ష ఒప్పుకోడు. ఆలస్యం అయితే నాగదేవత నన్ను క్షమించదు. మాట కోసమైనా నేను చనిపోతాను. నా మరణం నీకు సమ్మతం అయితే చెప్పు నిన్ను రమ్మని బలవంత పెట్టను. వెళ్లి నాగదేవత ముందే ఆత్మార్పణ చేసుకుంటాను.
పంచమి: వద్దు యువరాజా. ఇక నా కోసం ఎవరూ బలిదానాలు చేయొద్దు. నేను నీతో రావడానికి సిద్ధమే.
ఫణేంద్ర: సంతోషం యువరాణి అయితే కళ్లు మూసుకొని నాగదేవతని స్మరించు. ఆ మాత అనుమతి తీసుకొని బయల్దేరుదాం. మాతా యువరాణిని తీసుకొని నాగలోకం రావడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీరు అనుమతి ఇస్తే బయల్దేరుతాం.
నాగదేవత: ఆపండి మీ కపట నాటకం. మోసపూరిత వేషాలు.. మోక్షని బతికించడానికి నువ్వు యువరాణిని నాగలోకం పంపించి దొంగతనంగా నాగచంద్రకాంత మొక్క భూలోకం తెప్పించి చాలా పెద్ద తప్పు చేశావ్ యువరాజా. యువరాణిని ఒక నాగకన్య గుర్తుపట్టి నాకు చెప్పింది. మీరిద్దరూ నాగలోకం రావడానికి అనర్హులు.
ఫణేంద్ర: క్షమించండి మాతా మీకు అందిన సమాచారం అబద్ధం. యువరాణి నా కళ్లముందే ఉంది. నాగలోకం రాలేదు.
నాగదేవత: ఇక మీరు ఏం చెప్పినా నేను వినను. ఒక్క అబద్ధం చెప్తే అది వంద అబద్దాలు చెప్పేలా చేస్తుంది.
పంచమి: అమ్మా యువరాజు చెప్పేది నిజం. నేను నాగలోకానికి రాలేదు.
నాగదేవత: నేను అన్నీ నిర్దారణ చేసుకొనే వచ్చాను. యువరాణి నాగలోకం రావడం నిజం. నాగ చంద్రకాంత మొక్కను దొంగతనంగా భూలోకానికి తీసుకురావడం నిజం. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. మీరు చేసిన మోసానికి మీ ఇద్దరికీ మరణ శిక్ష విధించాలి. కానీ యువరాణి, యువరాజు అయిన కారణంగా శిక్ష తగ్గిస్తున్నాను.
పంచమి: నిజం మాతా నేను నాగలోకం రాలేదు..
నాగదేవత: ఇక మీ మాటలు నేను నమ్మను. మీ శక్తులను వెనక్కి తీసుకుంటున్నాను. ఇష్టరూప శక్తులు మీకు ఉపయోగపడవు.
పంచమి: అమ్మా వద్దు.. మేం ఎలాంటి తప్పు చేయలేదు.
నాగదేవత: మీరు ఇక నాగలోకం రాలేరు.
పంచమి: అయ్యో మాత మీకు దండం పెడతాను. దయచేసి అర్థం చేసుకోండి.
నాగదేవత: అలాగే ప్రతి పౌర్ణమికి ఇద్దరూ పాముల్లా మారుతారు. ఇక్కడ మానవుల చేతుల్లోనే మీరిద్దరూ మరణిస్తారు.
ఫణేంద్ర: మాతా వద్దు మేం చెప్పేది వినండి. మేం ఎలాంటి తప్పు చేయలదు మాతా.. నాగదేవత ఇద్దరి దగ్గర నుంచి శక్తులు తీసుకుంటుంది. యువరాణి ఏదో మోసం జరిగిపోయింది. నాగ దేవత అబద్ధం చెప్పదు. ఎవరో నీ రూపంలో నాగలోకం వెళ్లారు. మంత్రం విషయంలోనూ అలాగే జరిగింది. నువ్వు నన్ను అనుమానించావ్ కానీ నేను మంత్రం చెప్పింది నిజం.
పంచమి: అర్థమైంది ఫణేంద్ర ఎవరో మనల్ని మోసం చేశారు.
ఫణేంద్ర: మేఘన ఆకు పసరుతో మోక్షని బతికించడం కూడా నాకు అనుమానంగానే ఉంది యువరాణి. మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్లి మేఘనని తీసుకొస్తాను. నా అనుమానాలు అన్నీ తన చుట్టే తిరుగుతున్నాయి. ఇప్పుడే తేల్చేస్తా..
మేఘన: నన్ను ఎందుకు పిలిచారు.
ఫణేంద్ర: నువ్వు నాగలోకం వెళ్లి నాగచంద్రకాంత మొక్క తెచ్చినందుకు మేఘన. మోక్షని బతికించి చాలా గొప్ప పని చేశావ్ మేఘన. నాగచంద్రకాంత మొక్క కోసం నువ్వు యువరాణిలా నాగలోకం వెళ్లడం నిజంగా అభినందించాల్సిన విషయం.
మేఘన: మీరేం మాట్లాడుతున్నారు ఫణేంద్ర. నేనేంటి నాగలోకం వెళ్లడం ఏంటి.. యువరాణి రూపం ఏంటి.
ఫణేంద్ర: నటించడం ఆపు మేఘన. అబద్ధాలతో మమల్న మోసం చేయాలి అని చూడకు.
మేఘన: ఏడుస్తూ.. మీ మాటలు వింటుంటే నాకు పిచ్చి పడుతుంది.
ఫణేంద్ర: నీ దొంగ కన్నీళ్లు ఆపి నిజం ఒప్పుకో లేదంటే ఇక్కడే చంపేస్తా. నువ్వు తెచ్చింది నాగ చంద్రకాంత మొక్క ఆకు పసరే.. నిన్ను నేను నమ్మను.
మేఘన: తెలుసు ఫణేంద్ర కానీ ఇప్పుడు నాకు ఇష్టరూప శక్తులు లేవు. అలాంటప్పుడు నేను ఎలా రూపం మార్చుకొని నాగలోకం వెళ్లగలనో చెప్పండి.
ఫణేంద్ర: నీకు చాలా రకాల మంత్ర శక్తులు తెలుసు. నేను నా కళ్లతో చూశాను.
మేఘన: మీరు అంత పెద్ద అభాడం నా మీద వేస్తే మీ ముందే నా తల పగలగొట్టుకొని చచ్చిపోతాను. నా మీద ఒట్టు వేసుకొని చెప్తున్నా నేను ఎలాంటి మోసం చేయలేదు. మోక్షాబాబుని బతికించడమే నా తప్పు అయిపోయింది.
పంచమి: మేఘన అలా మాట్లాడకు. నిజంగా నువ్వు నాకు చాలా సాయం చేశావు. మోక్షాబాబుని బతికించినందుకు నీకు నా జీవితం అర్పించినా తప్పు లేదు.
ఫణేంద్ర: యువరాణి మీరు పొరపడుతున్నారు.
మేఘన: మనసులో.. నీకు ఛాలెంజ్ చేశాను పంచమి నీకు మోక్షని దూరం చేస్తా అని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.