Satyabhama Serial Today February 1st: రేపే మాధవ్, సత్యల నిశ్చితార్థం.. రెస్టారెంట్‌లో క్రిష్ రివాల్వర్ పేల్చిన కాళీ!
Satyabhama Serial Today Episode సత్యభామను కలవడానికి క్రిష్ వెళ్తుండగా కాళీ క్రిష్ గన్‌ను షూట్ చేయడంతో అందరూ కంగారుగా రెస్టారెంట్ నుంచి పరుగులు తీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode: శైలు తనకు క్రిష్ అంటే ఎంత ఇష్టమో చెప్పాలి అనుకుంటుంది. ఇబ్బందిగా క్రిష్ శైలుని పొగుడుతాడు. క్రిష్ వాష్‌రూం అంటూ శైలు దగ్గర నుంచి తప్పించుకుంటాడు. మరోవైపు సత్య క్రిష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. క్రిష్ బాబీ దగ్గరకు వచ్చి శైలుని గమనిస్తూ ఉండమని చెప్తాడు. సత్య దగ్గరకు వెళ్లడానికి క్రిష్ సిద్ధమవుతాడు. కాళీ టెన్షన్ పడుతుంటాడు.. కాళీ క్రిష్‌కి ఏవేవో చెప్పి రివాల్వర్ తీసుకుంటాడు. మరోవైపు మాధవ్ కూడా సత్యను వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. ఇంతలో మైత్రి సత్యకు కాల్ చేస్తుంది. సిగ్నల్ లేక మైత్రి చెప్పేది సత్యకు వినిపించదు. ఇంతలో అక్కడికి మాధవ్ వచ్చేస్తాడు. సత్య షాక్ అయిపోతుంది. ఇక కాళీ క్రిష్ దగ్గర తీసుకున్న రివాల్వర్‌తో షూట్ చేస్తాడు. ఆ సౌండ్‌కి అందరూ అక్కడి నుంచి పారిపోతారు. సత్యను మాధవ్ తీసుకొని వెళ్లిపోతాడు. సత్య వాళ్లు ఇంటికి బయల్దేరిపోతారు.
క్రిష్: కాళీ కాలర్ పట్టుకొని రేయ్ ఎందుకురా.. ఎందుకురా ఫైర్ చేశావ్.. ఎందుకు షూట్ చేశావ్..
కాళీ: అన్న కావాలి అని చేయలేదే గన్ చెక్ చేస్తుంటే బై మిస్టేక్‌లో అలా జరిగిపోయిందే..
క్రిష్: అరేయ్ నోర్ముయ్.. నాకు దక్కాల్సిన సంతోషం నాకు దక్కకుండా చేశావ్ పాగల్.. అని క్రిష్ గన్ తన దగ్గర దాచుకుంటుంటే మాధవ్ వచ్చి చేయి పట్టుకుంటాడు. వదిలేయ్.. మర్యాదగా చెప్తున్నా విను.
మాధవ్: రేయ్ రెండు సార్లు నువ్వు నా చేతిలో తప్పించుకున్నావ్ ఈసారి తప్పించుకోలేవ్.. పబ్లిక్‌లో గన్ ఫైర్ చేసి చాలా పెద్ద తప్పు చేశావ్.. ఇప్పుడు నువ్వు తప్పించుకొనే ఛాన్స్ లేదు పోలీసులు అరెస్ట్ చేయాల్సిందే.. నువ్వు ఊచలు లెక్కపెట్టాల్సిందే..
క్రిష్: రేయ్.. నన్ను అరెస్ట్ చేసే మగాడు ఇంకా పుట్టలేదురా.. నువ్వు ఇంత వరకు నా ఒరిజినల్ పవర్ చూడలేదురా.. చూడాలి అనుకోకు తట్టుకోలేవ్..
మాధవ్: ఏం చేస్తావ్ రా..
క్రిష్: ఏం చేస్తానా ఈ గన్‌లో ఉన్న బులెట్లు అన్నీ నీ దిమాక్లో దించేస్తా..
మాధవ్: అంత పెద్ద మగాడివా షూట్ చేయ్‌రా.. మాటలు ఆపి షూట్ చేయ్. నీకు చేత కాకపోతే గన్‌నాకు ఇవ్వు నేను షూట్ చేస్తా..
శైలు: క్రిష్ ఇలా పబ్లిక్‌లో గొడవ ఏంటి నువ్వు ఇలా చేస్తే అంకుల్ ఎమ్మెల్యే ఎలా అవుతారు. రా క్రిష్ వెళ్దాం. చెప్పింది అర్థం చేసుకో.. అంకుల్ కోసమైనా విను.
మాధవ్: అంతేనా అంతేనా నీ దమ్ము. ఈ సారి నీ గర్ల్ ఫ్రెండ్ కాపాడొచ్చు. నెక్ట్స్ టైం ఆ దేవుడు కూడా కాపాడలేడు.
హర్ష: ఊరిలో రౌడీలు ఎక్కువ అయిపోయారు. గొడవలు కూడా ఎక్కువ అయిపోయాయి. ఆ రెస్టారెంట్‌లో ఏం గొడవ జరిగిందో ఏంటో ఎవడో రివాల్వర్ పేల్చాడు. ఆ కంగారుకు ఎవరికి వారు తలా ఓ వైపు పారిపోయారు. బావగారు వచ్చారు కానీ సత్యతో మాట్లాడటానికి కుదరలేదు.
శాంతమ్మ: అయినా ఇదెక్కడి గోలరా.. దీని జాతకంలో రౌడీల గండం ఏమైనా ఉందా అర్థమవడం లేదు.. పెళ్లి అయిన వరకు షికార్లు వద్దు అన్నాను విన్నావా.. ఓరేయ్ నా మాట వినరా పంతులుగారితో మాట్లాడి సత్యకు ఏదైనా శాంతి పూజ చేయిద్దాం.
శేఖర్: విశ్వనాథానికి ఫోన్ చేసి.. మా పంతులు గారితో ఇప్పుడే మాట్లాడానురా.. నిశ్చితార్థానికి రేపే మంచి ముహూర్తం ఉంది అంట. అది దాటితే దగ్గర్లే ఏం లేవు అంటరా.. పోని వెయిట్ చేద్దాం అంటే మాధవ్‌కి ఏమో వీసా ప్రాబ్లమ్. వెళ్లే రావడం కష్టం. ఒక్కగాని ఒక్క కొడుకు అందుకే నిశ్చితార్థం మా ఇంట్లో చేద్దామనుకుంటున్నాం. నువ్వు కోడల్ని మాఇంటికి తీసుకొస్తే చాలు.
విశ్వనాథం: మరేం చేద్దాం తప్పనప్పుడు రేపే కానిచ్చేద్దాం. రేపు దాటితే నిశితార్థం ముహూర్తం లేదు అంట. అందుకే కానిచ్చేద్దాం అన్నాను.
విశాలాక్షి: అమ్మో రేపేనా అలా ఎలా చాలా పనులు ఉంటాయి.
హర్ష: ఏం పర్లేదు అమ్మ నేను చూసుకుంటాను.
మైత్రి: సడెన్‌గా అబద్ధం నిజంగా మారితే చాలా కష్టం అది ఈరోజే తెలిసొచ్చిందే..
సత్య: అనుకున్న పని జరగకపోతే నాకు చిరాకుగా ఉంటుంది.
మైత్రి: చిరాకు అంటే అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్‌కి నీ అజ్ఞాత శత్రువు రాకపోవడమా..
సత్య: అవును. ఆ రౌడీ గాడు వస్తే తాడో పేడో తేల్చేద్దాం అనుకున్నా..
మైత్రి: అదే టైంకి మాధవ్ కూడా అక్కడికి వచ్చాడే అది మర్చిపోతున్నావ్..
సత్య: వస్తే ఏంటి అంట.. ఏదోలా మ్యానేజ్ చేసేదాన్ని.. వాడి పెడుతున్న చిరాకు మామూలుగా లేదే.. ఏ పనీ చేసుకోలేకపోతున్నాను. ఏ నిమిషంలో ఏంజరుగుతుందో పెద్ద వాళ్లకి ఏం ఇబ్బంది కలుగుతుందో అని గుండె గుప్పెట్లో పెట్టుకొని తిరుగుతున్నాను. ఈరోజుతో వాడి పీడ విరగడవుతుంది అనుకున్నాను. కానీ అది జరగలేదు.
మైత్రి: కానీ సత్య ప్రేమిస్తున్నా అని వెంట పడుతున్న వాడు రేపు నీ ఎంగేజ్ మెంట్ అని తెలిస్తే రాకుండా ఉంటాడా.. వాడు అసలే రాక్షసి లాంటి వాడు అని ఆ కాళీ చెప్పాడు అని అన్నావ్.. నీ నిశ్చితార్థం అని వాడికి తెలిస్తే వాడు ఏకంగా నీ మెడలో తాళే కట్టేస్తాడేమోనే..
మరోవైపు సత్య వాళ్లు నిశ్చితార్థం కోసం మాధవ్ వాళ్ల ఇంటికి వస్తారు. మాధవ్ తల్లి సత్యను కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెప్తుంది. ముహూర్తానికి టైం అవుతుంది అని పంతులు చెప్తారు. ఇక అత్తారింటి నుంచి మొదటి చీర అంటూ మాధవ్ తల్లి సత్యకు ఇస్తుంది. ఇద్దర్ని నిశ్చితర్థానికి రెడీ అవ్వమని చెప్తారు. మరోవైపు క్రిష్ ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తానని రెడీ అవుతాడు. ఇక మాధవ్ తొందరగా రెడీ అయి సత్య కోసం బయట వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో సంధ్య వచ్చి బావని ఆటపట్టిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.