అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial February 1st - 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్ : కొడుకుని తప్పుపడుతున్న అమర్ తల్లిదండ్రులు.. పంతుల్ని డబ్బుతో కొనేసిన మనోహరి!

Nindu Noorella Saavasam Serial Today Episode: తనకోసం పెళ్లి సంబంధం చూస్తున్న పంతులుని మనోహరి డబ్బుతో కొనేయడంతో కధ లో కీలక మలుపులు ఏర్పడతాయి.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో అయ్యగారు మీకు సంబంధం చూస్తుంటే ఆనందపడతారేంటి అంటుంది నీల.

మనోహరి: అమర్ ఇలా చేస్తాడని నేను ముందే ఊహించాను. అందుకే నా ప్లాన్ లో నేను ఉన్నాను పంతులుగారు వచ్చాక ప్లాన్ ఏంటో నీకే తెలుస్తుంది అంటుంది.

మరోవైపు పిల్లలు రామ్మూర్తిని చూడటానికి హాస్పిటల్ కి వస్తారు. రిసెప్షనిస్ట్ మీరు ఎవరు అని అడిగితే మేము ఆయన మనవలం అని చెప్తుంది అమ్ము.

అంజు: అలా ఎందుకు చెప్పావు అని తర్వాత అడుగుతుంది.

అమ్ము : అలా చెప్పకపోతే సవాలక్ష ప్రశ్నలు వేస్తారు అందుకే చెప్పాను అంటుంది.

తర్వాత రామ్మూర్తి రూమ్ దగ్గరికి వస్తున్న పిల్లల్ని చూసి షాక్ అవుతాడు ఖాళీ. అదే విషయం మంగళ తో చెప్తాడు.

మంగళ: వాళ్లు, భాగి కలిస్తే మీ బావ ఉద్యోగం చేశాడని విషయం తెలిసిపోతుంది. అందుకే వాళ్ళు కలవకూడదు అని చెప్తుంది.

రామ్మూర్తి రూమ్ దగ్గరికి వచ్చిన పిల్లల్ని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు వెళ్లిపోండి లేదంటే మీ నాన్నకి ఫోన్ చేస్తాను అని బెదిరిస్తాడు కాళీ.

పిల్లలు: మా నాన్నకు ఫోన్ చేయకండి మేము ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చాము. మేము తాతయ్యని చూసి వెళ్ళిపోతాము అని రిక్వెస్ట్ చేస్తారు. అయినా ఖాళీ వాళ్ళు ఒప్పుకోకపోతే వెయిటింగ్ రూమ్ దగ్గరికి వచ్చేస్తారు.

రామ్మూర్తిని చూడలేనందుకు బాధపడుతుంది అమ్ము. మనం తాతయ్యని చూసే వెళ్దాం ఎప్పుడు వాళ్ళు రూమ్ దగ్గరే ఉండరు కదా వాళ్ళు అటు వెళ్లిన తర్వాత మనం చూద్దాం అని చెప్పి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు.

మరోవైపు మిస్సమ్మ గురించి బాధపడుతూ ఉంటారు అమర్ తల్లిదండ్రులు. ఇంతలో రాథోడ్ పంతులు గారిని తీసుకొని వస్తాడు.

అమర్: మనోహర్ని చూపిస్తూ ఈ అమ్మాయి పెళ్లి బాధ్యత నాది మంచి సంబంధాలు చూడండి అని చెప్తాడు.

పంతులు లాప్టాప్ తీసి ఫోటోలు చూపిస్తూ ఉంటాడు.

అమర్: నీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకో అని మనోహర్ తో చెప్తాడు.

మనోహర్ : మనసులో నాకు నువ్వే నచ్చావు అమర్ అని అనుకోని బయటికి మాత్రం నేను ఎక్కడ హ్యాపీగా ఉంటే బాగుంటాను నీకు తెలుసు కదా అమర్ నువ్వే సెలెక్ట్ చెయ్యు అంటుంది.

దాంతో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ఈ అబ్బాయి తో మాట్లాడి పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి అంటాడు అమర్.

అమర్ తల్లిదండ్రులు: తప్పు చేస్తున్నావు అమర్ కష్టంలో ఉన్న మీసం ని అలా వదిలేయడం భావ్యం కాదు అంటాడు. 

 అమర్: నాన్న ఆ విషయం వదిలేయండి కావాలంటే మీరు వెళ్లి చూసి రండి అంటాడు.

ఆ తర్వాత బయటకు వచ్చిన పంతులుకి డబ్బులు ఇచ్చి పెళ్లి సంబంధం కుదరకుండా చూడమంటుంది.

పంతులు: సంబంధం కుర్చచడం అంటే కష్టపడాలి కానీ చెడగొట్టడానికి ఏమాత్రం కష్టపడక్కర్లేదు అంటూ ఆనందంగా ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు.

ఇదంతా చూస్తున్న నీల మీ ప్లాన్ ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది అని మనోహరితో చెప్తుంది.

మరోవైపు దొంగ చాటుగా రామ్మూర్తి రూమ్ లో దూరతారు పిల్లలు. రామ్మూర్తి ని ఆ అపోజిషన్ లో చూసి బాధపడతారు.

పిల్లలు: మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాం తాతయ్య, త్వరగా కోలుకోండి. మా అమ్మలాగే మీరు కూడా మమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకండి. మీకోసం మేము ఆ దేవుని ప్రార్థిస్తాము త్వరగా కోలుకోండి అంటారు.

రామ్మూర్తి పిల్లల అభిమానానికి కళ్ళల్లో నీరు పెట్టుకుంటాడు. తన పక్కనే ఉన్న అంజు చెయ్యి మీద తను చెయ్యి వేస్తాడు.

అంజు : తాతయ్య మన కోసం తిరిగి వస్తానని మాట ఇచ్చారు. తప్పకుండా మన కోసం తిరిగి వస్తారు అంటుంది.

అమ్ము : తాతయ్య రెస్ట్ తీసుకుంటారు ఇంక మనం వెళ్దాం అంటుంది.

ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న అరుంధతి బాగా ఎమోషనల్ అవుతుంది.

బయటికి వస్తున్న పిల్లల్ని కాళీ చూస్తాడు. అతను పట్టుకునే లోపే పరిగెట్టి పారిపోతారు పిల్లలు అంతలో వాళ్ళకి మిస్సమ్మ ఎదురవుతుంది.

మిస్సమ్మ : మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతుంది.

పిల్లలు, మిస్సమ్మ ఎదురుపడటాన్ని చూసి కంగారు పడిపోతుంది మంగళ.

పిల్లలు: తాతయ్యని చూసేసాం కదా ఇంక మేము వెళదాము అంటారు.

మిస్సమ్మ : తనమీద అభిమానంతో పిల్లలు తన తండ్రిని చూడటానికి వచ్చారు అనుకుంటుంది.

మిస్సమ్మ పిల్లలు ఇంకా ఏదో మాట్లాడేసుకుంటారని భయపడిన మంగళ పిల్లల్ని అక్కడి నుంచి తరిమేస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Veera Dheera Sooran: గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Veera Dheera Sooran: గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
RBI New Governor: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
Rains Update: అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
Asha Worker Protest: సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
MLC By Poll: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
Embed widget