అన్వేషించండి

Satyabhama Serial Today August 21st: సత్యభామ సీరియల్: వాంతులు చేసుకున్న సత్య ఇది అదేనా.. మైత్రితో క్లోజ్‌గా హర్ష, ఫీలవుతున్న నందిని!

Satyabhama Today Episode సత్య వాంతులు చేసుకోవడం చూసిన పంకజం సత్య ప్రెగ్నెంట్ అనుకొని పరుగు ఇంట్లో వాళ్ల దగ్గరకు వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య, క్రిష్ ఇద్దరూ హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అనుకుంటూ కేక్ కట్ చేసుకుంటారు. ఇక క్రిష్ అన్నీ తన మనసులో మాటలు అన్నీ గులాబి పువ్వుకి చెప్తున్నావ్ అని బుంగమూతి పెట్టుకుంటుంది. దాంతో సత్య ఇప్పటి నుంచి నీకు చెప్తా అని అంటాడు. ఇద్దరూ సంతోషంగా ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుంటారు. ఇక క్రిష్ తాను మందు తాగానని తనకి చికెన్ కావాలని అడిగితే సత్య చేసి తీసుకొస్తా అని వెళ్తుంది. క్రిష్ మాత్రం మందు తాగి ఉండడు. సత్య వెళ్లిపోగానే యాక్టింగ్ కష్టం అనిపిస్తుంది సత్య అని బాధపడతాడు. 

నందిని: అత్త మాటలు తలచుకొని బాధ పడుతూ.. ఛా కోడలి ముందే ఆ మాట ఎలా అనగలిగింది. నేనంటే లెక్క లేదా తనంటే అంత ఎక్కువా.  ఒళ్లు మండుతుంది. పోయి అత్తమ్మని నిలదీయాలని ఉంది. ఓర్చుకుంటున్నా. తెగదెంపుల వరకు పోవద్దని ఆలోచిస్తున్నా. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో. ఇంతలో హర్ష వస్తాడు. హర్ష పొలమారితే నందిని హర్ష మైత్రిని అన్నట్లు ప్లీజ్ నా మాట విను నీరు తాగు అని అందిస్తుంది. హర్షకి మైత్రికి తాను అన్న మాటలు గుర్తొస్తాయి. నీ కోసమే చూస్తున్నాను. ఎందుకు అని అడగవే జరంత ప్రేమ చూపిస్తే పొంగిపోతా కదా. పిచ్చిది దానికి కూడా  మనసు ఉంటుంది. ఆకలి వేస్తుంది పోయి తిందామా.
హర్ష: నాకు తినాలి అనిపించడంలేదు. నువ్వు వెళ్లు నాకోసం వెయిట్ చేయకు. ఇంతలో మైత్రి కాల్ చేయడంతో హర్ష మాట్లాడుతాడు. మైత్రికి ధైర్యం చెప్తాడు. భోజనం చేశావా తిను అని జాగ్రత్తలు చెప్తాడు. నువ్వు తింటేనే నేను తింటానని అంటాడు. ఆ మాటలు విన్న నందిని చాలా ఫీలవుతుంది. బాధపడుతుంది. కోపంతో భోజనానికి వెళ్లకుండా కూర్చొంటుంది. 
నందిని: మీ ఫ్రెండ్ అదృష్టవంతురాలు అడిగి బుజ్జగించి తినిపించేవాళ్లు ఉన్నారు నాకు ఎవరున్నారు.
హర్ష: మైత్రి పరిస్థితి అర్థం చేసుకో పద భోజనం చేద్దాం. అని హర్ష  నందినిని తీసుకెళ్తాడు.

సత్య క్రిష్ కోసం చికెన్ తీసుకొస్తుంది. ఈలోపు క్రిష్ పడుకొని ఉంటాడు. దాంతో సత్య క్రిష్‌ని కప్పుతుంది. సత్య వెళ్లిపోతుంటే క్రిష్ చేయి పట్టుకుంటాడు. సత్య విడిపించుకొని వెళ్లిపోతుంది. ఇక ఉదయం సత్య అత్తయ్యకి వినిపించినట్లు జయమ్మతో అమ్మమ్మ నేను పూజ గదికి వెళ్తున్నా అని అంటుంది. భైరవి తనని రెచ్చగొట్టడానికే సత్య అలా అందని అనుకుంటుంది. అయినా భైరవి సత్యపై ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది. ఇక సత్య నమ్మకం, క్షమించే గుణం ఇలా ఉండాలని అంటుంది. భైరవి చిరాకుగా ముఖం పెట్టుకుంటుంది. తిరగబడమని నా కోడలిని అంటున్నావ్ అని భైరవి జయమ్మని అంటుంది. ఇక సత్య పూజ చేయడానికి వెళ్తుంది. పంకజం భైరవిని రెచ్చగొడుతుంది. 

క్రిష్ బయటకు వెళ్తుంటే సత్య క్రిష్ దగ్గరకు కాఫీ తీసుకొని వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ అని సత్య అడిగితే బయటకి వెళ్తున్నాన్ అని క్రిష్ అంటాడు. నాకు చెప్పకుండా వెళ్తున్నావ్ అని సత్య అంటే నువ్వు నా భార్యవి అయితే చెప్పేవాడిని ఫ్రెండ్‌వి కదా చెప్పను అంటాడు. సత్య బుంగమూతి పెట్టుకోవడంతో ఇప్పుడే అందంగా ఉన్నావని అంటాడు. ఇక కాఫీ తాగమని సత్య అంటే నువ్వు తాగేయ్ నువ్వు తాగితే నేను తాగినట్లే అని అంటాడు. ఇక క్రిష్ వెళ్లిపోగానే సత్య వాంతులు చేసుకుంటుంది. అది పంకజం చూస్తుంది. సత్య ప్రెగ్నెంట్ అని అనుకుంటుంది. పరుగున ఇంట్లో వాళ్ల దగ్గరకి వెళ్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: తవ్వకాల్లో నిధిని సొంతం చేసుకున్న నయని.. మిగతా అందరికీ షాక్‌ కొడుతుందేంటి?

టాప్ హెడ్ లైన్స్

Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Embed widget