అన్వేషించండి
Advertisement
Satyabhama Serial Today August 22: సత్య ప్రెగ్నెంట్ అని ఇంట్లోవాళ్లు సంబరాలు చేసుకుంటుంటే ఆమె మాత్రం కంగారు ఎందుకు పడింది?
Satyabhama Serial Today August 22: సత్యకు వాంతులు కావడంతో ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందని ఇంట్లోవాళ్లంతా సంబరాలు చేసుకుంటుంటే...సత్య క్రిష్‌ను చొక్కాపట్టుకుని నిలదీయడంతో ఈరోజు ఏపిసోడ్ ఆసక్తిగా మారింది.
Satyabhama Today Episode: సత్య వాంతులు చేసుకోవడం చూసి పరుగున వచ్చిన పనిమనిషి పంకజం...మహదేవయ్య, భైరవికి మన ఇంట్లో ఇంకో ఉయ్యాల కావాలని చెబుతుంది. ఇంట్లోకి రెండో వారసుడు రాబోతున్నాడని చెబుతుంది. సత్య వాంతులు చేసుకుంటోందని...త్వరలోనే బుల్లివారసుడు రాబోతున్నాడని చెప్పడంతో భైరవి(Bhiravi) ఉలిక్కిపడుతుంది. మహదేవయ్య మాత్రం చాలా సంతోషపడతాడు. ఇదంతా ఎలా జరిగిందని ఆలోచిస్తున్న సత్య(Satya)కు...హనీమూన్‌కు వెళ్లినప్పుడు క్రిష్(Krish) అన్న మాటలు గుర్తుకు వస్తాయి.
ఇంతలో రుద్ర భార్య వెళ్లి సత్యను ఇంట్లోకి తీసుకొస్తుంది. సత్య వాంతులు చేసుకోవడంపై బామ్మ ఎంతో సంతోషపడుతుంది.
మహదేవయ్య: పంకజం ఇప్పుడే శుభవార్త చెప్పింది..నిజమే కదా..? ఇద్దరు కోడళ్లు ఒకేసారి కడుపుతో ఉన్నారంటే అత్తకు నొప్పులు వచ్చినట్లే..
రుద్ర: అదేంటి బాపు..కోడళ్లకు కడుపైతే అత్తకు నొప్పులు ఎందుకు..?
మహదేవయ్య: కోడళ్లు కడుపుతో ఉంటే అత్తే కదరా పనులన్నీ చేయాల్సింది...అప్పుడు నొప్పులు అత్తకే కదా వచ్చేది. నేను ఎమ్మెల్యే అయ్యేసరికి చెరో దిక్కున వారసులను ఎత్తుకుని ఫొటో దిగాలి...ఏమంటావ్ భైరవి...
సత్య: ఏంటో నాకు అంతా అయోమయంగా ఉంది..ఏం జరుగుతుంతో తెలియడం లేదు.
బామ్మ: సత్య ఈ శుభవార్త మొగుడుకు చెప్పాలని ఆరాటపడుతోందనుకుంటా..
మహదేవయ్య: అదెంత ముచ్చట...ఇప్పుడు ఫోన్ చేసి ఇస్తా చెప్పు.
సత్య: వద్దు మామయ్య
మహదేవయ్య: ఎందుకట్లా..?
బామ్మ: స్వయంగా చెప్పాలనుకుంటుందనుకుంటా..
మహదేవయ్య: సరే అలాగే కానివ్వు....ఇదిగో భైరవీ దగ్గర ఉండి స్వీట్లు తయారు చేయించు...ఊరంతా పంచాలి.
మహదేవయ్యతోపాటు బామ్మ, పంకజం, రుద్రతో సహా అందరూ ఇంటిబయటకు వచ్చి సంబరాలు చేసుకుంటుంటారు. ఇంతలో అక్కడి వచ్చిన క్రిష్ కూడా వారితో జతకలిసి డ్యాన్స్ వేస్తాడు...ఈరోజు ఏం పండుగ బాపు ఇంత ఆనందంగా ఉన్నావ్ అని అంటాడు
భైరవి: మీ నాన్నని చూస్తుంటే తెలుస్తలేదరా..అసలు పట్టుకోలేకపోతున్నాం.
క్రిష్: ఎందుకట్లా..?
మహేదేవయ్య: ఇంటికి ఒక వారసుడు వస్తుండంటేనే ఖుషీ అయ్యా...మరి రెండో వారసుడు కూడా వస్తుండంటే డబుల్ ఖుషీ కాదా..ఆ కిక్కే వేరు
క్రిష్: రెండో వారసుడు ఎవరు...వదిన కడుపులో కవలలు ఉన్నారా..?
మహదేవయ్య: వదిన కడుపులో కాదురా...నీ పెళ్లాం కడపులో ఉన్నాడు
ఆ మాటలకు షాక్ తిన్న క్రిష్(Krish)...ఒక్కసారిగా నిర్ఘంతపోతాడు. సత్య కడుపులో వారసుడు ఉండుడు ఏంది..? అనుకుంటాడు. గదిలో ఉన్న సత్య దగ్గరకు వస్తాడు
సత్య: ఇప్పుడు సంతోషంగా ఉందా..? నువ్వు అనుకున్నది, కోరుకున్నది జరిగింది కదా...డ్యాన్స్ చేయకుండా వచ్చావే.. ఇప్పుడు నాదగ్గరకు వచ్చింది కూడా నేను గెలిచానని చెప్పడానికే కదా అని చొక్కాపట్టుకుని నిలదీస్తుంది
క్రిష్: సత్యా...నా మాట ఒక్క నిమిషం విను
సత్య : చెప్పాల్సింది అంతా మొత్తం చెప్పావు కదా...ఏం జరిగిందో? ఎలా జరిగిందో అంతా యాక్ట్ చేసి చూపించి మరీ చెప్పావ్ కదా..ఇంకేం మిగిలింది చెప్పడానికి నేను ఏడ్వడం తప్ప
క్రిష్: నువ్వు ఏడ్వాల్సినంత తప్పు ఏం జరగలేదు సత్య
సత్య: బాధ ఏంటో నాకు తెలుసు..నీకు కాదు.అమాయకంగా మాట్లాడకు. నీ మంచితనం గురించి, నీ నిజాయితీ గురించి ఎంతో గొప్పగా ఊహించాను. నీతో కలిసి మెలసి సరదాగా ఉంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి. నా జీవితంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లోకి నెట్టేశావ్..నీకు కావాల్సింది కూడా ఇదే కదా. నీను నీ ముందు నిస్సాయంగా నిల్చోవడం. తలవొంచుకుని ఏడ్వడం నీకు కావాల్సింది ఇదే కదా..? చచ్చినా అలా జరగుదు. నేనేమీ అంత పిరికిదాన్ని కాదు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. మా ఇంటికి వెళ్లిపోతున్నాను. మీ వాళ్లకు ఏం చెప్పుకుంటావో చెప్పుకో
క్రిష్; ఒక్క క్షణం నేను చెప్పేది విను.. ఆ తర్వాత నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం.
సత్య: ఏం చెబుతావో చెప్పు
క్రిష్: నువ్వు ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు
సత్య: వాంతులు అయ్యాయి. కళ్లు తిరిగాయి...ఇంట్లోవాళ్లు ప్రెగ్నెంట్ వచ్చిందని డిసైడ్ చేశారు.
క్రిష్: నువ్వెలా నమ్మావ్..?
సత్య: నమ్మకుండా ఎలా ఉంటాను..? మన హనీమూన్ లో చెప్పావు కదా..? రెండు నెలల్లో నిజం తెలుస్తుందని బెదిరించావ్ కదా..? నమ్మకుండా ఎలా ఉంటాను
క్రిష్: దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను...హనీమూన్‌లో మనిద్దరి మధ్య ఏం జరగలేదు
సత్య: ఎందుకు మాట మారుస్తున్నావ్..?
క్రిష్: మాట మార్చుడు కాదు..నీకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెబుతున్నాను. నిన్ను సరదాగా ఆటపట్టించడానికే ఆ రోజు అబద్దం చెప్పినా..
కొన్ని దినాలు తర్వాత నిజం చెబుదాం అనుకున్నా
సత్య: మరి ఎందుకు చెప్పలేదు
క్రిష్: మీ నాయన జైలుకు పోవుడు...కోర్టు గొడవల్లో పడి యాదికి రాలేదు
సత్య: ఏం జరగకుండా వాంతులు ఎందుకు వచ్చాయి
క్రిష్: వాంతులు అయితే ఇక అదేనా..? తిన్నది ఏమైనా పడలేదేమో
సత్య: అదే నిజమైతే..హనీమూన్ రోజు నా బట్టలు ఏందుకు మారాయి
క్రిష్: తాగి వాంతులు చేసుకున్నావ్...ఏం చేయాలో తెలియక నందినిని పిలిచా..తనే వచ్చి బట్టలు మార్చింది. కావాలంటే ఫోన్ చేసి అడుగు...నువ్వు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు సత్య...ఇంట్లో వాళ్లు ఏదో అన్నారని టెన్షన్‌లో ఏదో బ్రమలో ఉన్నావ్...ముందు దాని నుంచి బయటపడు...నన్ను నమ్ము సత్య.
సత్య: సారీ...అపార్థం చేసుకున్నాను
క్రిష్: తప్పు నాది
సత్య: చాలా రిలీఫ్‌గా ఉంది
క్రిష్: నాకు కూడా
సత్య: రా వెళ్దాం....నిజం అత్తయ్య వాళ్లకు చెప్పాలి కదా..నేను ప్రెగ్నెంట్ కాదని వాళ్లకు తెలియాలి కదా...
క్రిష్: ఇప్పటికిప్పుడు తెలియకపోతే ఏమైంది
సత్య: దాచుకోవడం ఎందుకు
క్రిష్: మన మంచి కోసం
సత్య: దీని వల్ల మనకు జరిగే మంచి ఏముంది
క్రిష్: మనం కలిసి కాపురం చేయడం లేదని వాళ్లకు తెలియకుండా ఉంటుంది
సత్య: ఎన్నాళ్లు దాస్తాం క్రిష్....ఓపెన్ అయిపోదాం
వాళ్ల నాన్న వాళ్లు సంబరాలతో డ్యాన్స్‌లు వేయడాన్ని చూపిస్తూ...వాళ్ల సంతోషాన్ని పాడుచేద్దామా అంటాడు క్రిష్..నిజం తెలిసి దాచడం మోసం అవుతుందని..ఇది తర్వాత ఎన్నో అనార్థాలకు దారితీస్తుందని సత్య చెబుతుంది. కిడ్నాప్ విషయంలో నిజం చెప్పకుండా ఇంతకు ముందు ఇలాగే దెబ్బతిన్నానంటుంది. మళ్లీ ఇలాంటి సమస్యలో ఇరుక్కోను అంటుంది. నువ్వు రాకపోతే నేనే వెళ్లి చెబుతా అంటుంది. ఇప్పుడు ఈ విషయం చెప్పి ఇంకో సమస్యలో ఇరుక్కోవద్దని క్రిష్ హెచ్చరిస్తాడు. పర్వాలేదు ఏమైనా గానీ నేను ఎదుర్కొంటానంటుంది. క్రిష్ ఆమెను వారిస్తాడు.మన చేతికి మట్టి అంటకుండా ఈ సమస్యను నేను పరిష్కరిస్తానంటాడు.వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్ష చేయిస్తాను. అందులో ఎలాగూ నెగిటివ్ వస్తుంది కాబట్టి పొరపాటుపడ్డామని వాళ్లే సర్దుకుంటారని చెబుతాడు
ఈ మాటలు పంకజం విని...ఇంత నాటకం అడుతున్నారు..వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని అనుకుంటుంది. వెంటనే ఈ విషయం అమ్మగారి చెప్పాలని వెళ్లిపోతుంది. డాక్టర్ వద్దకు వెళ్లేందుకు సత్య ఒప్పుకుంటుంది. వాళ్లిద్దరూ డాక్టర్ వద్దకు బయలుదేరతార
పంకజం పరుగున భైరవి వద్దకు వచ్చి శుభవార్త తీసుకొచ్చానని చెబుతుంది. మీ చిన్న కోడలకు కడుపు లేదని..ఇప్పుడే ఈ విషయం క్రిష్‌తో చెబుతుంటే విన్నా.. ఇప్పటి వరకు నీ కొడకు, కోడలికి శోభనమే జరగలేదంటా అని చెబుతుంది. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే విన్నానంటుంది.అయితే వీళ్లిద్దరూ కలిసి ఉన్నట్లు నాటకాలు ఆడుతున్నారన్నమాట అని భైరవి మండిపడుతుంది. ఈ విషయం అయ్యగారికి చెబుదామంటే...ఇప్పుడే వద్దు సత్యకు నరకం చూపించి అప్పుడు చెబుతానంటుంది. అందరి ముందు తలవంచుకుని ఈ ఇంట్లో నుంచి పారిపోయేలా చేస్తానంటుంది. ఇప్పుడే వాళ్లిద్దరూ డాక్టర్ వద్దకు పోయారని పంకజం చెబుతుంది.
సత్య, క్రిష్ డాక్టర్ వద్దకు వెళ్లి టెస్టులు చేయించుకుంటారు. ఈ రిపోర్ట్ తీసుకెళ్లి ఇంట్లో చూపిస్తే వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందని చర్చించుకుంటారు. అందరి సంగతి పక్కనపెడితే మాబాపు మాత్రం చాలా డల్ అవుతాడు అని క్రిష్ అంటే...డల్ అవ్వడం ఎందుకు మీ అన్న వారసుడిని ఇస్తున్నాడు కదా అంటాడు. కానీ నేనిచ్చే వారసుడి విలువ వేరే ఉంటుంది అంటాడు. మా బాపుకు నేనంటే ఇష్టం అంటాడు.ఈలోగా డాక్టర్ రిపోర్ట్ తీసుకుని వస్తుంది. ఆమె చేతిలో ఫైల్ తీసుకుని థ్యాంక్స్ చెబుతుంది
డాక్టర్: అదేంటి నేను రిపోర్ట్ గురించి చెప్పకుండానే థ్యాంక్స్ చెబుతున్నావ్...రిజల్ట్ ముందే తెలుసా
సత్య: అవును..ఇక్కడికి రాకముందే తెలుసు..జస్ట్ ఫార్మాలిటీ కోసం టెస్ట్ చేయించుకున్నాను.
డాక్టర్: ఎనీవే కంగ్రాట్స్..
సత్య; ఎందుకు డాక్టర్ కంగ్రాట్స్ చెబుతున్నారు..
క్రిష్: అలవాటులో పొరపాటు అయ్యి ఉంటుంది
డాక్టర్: అదేంటి సార్...పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. మీరు తండ్రి కాబోతున్నారు.
డాక్టర్ మాటలు విని సత్య హతాశురాలవ్వడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion