Satyabhama Serial Today April 22nd: సత్యభామ సీరియల్: భర్తపై తండ్రికి చాడీలు చెప్పిన నందిని.. ఫుల్లుగా తాగి సత్యను ఇరికించేసిన క్రిష్!
Satyabhama Serial Today Episode క్రిష్ ఫుల్లుగా తాగి రావడంతో ఇంట్లో వాళ్లకు దొరికిపోకుండా సత్య ఇబ్బంది పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode నందిని తన తండ్రి దగ్గరకు వెళ్లి ఏడుస్తుంది. హర్ష తనతో సరిగా ఉండటం లేదని మొసలి కనీళ్లు కారుస్తుంది. తాను ఎంత సర్దుకుపోతున్నా.. సతాయిస్తూ తన సంతోషాన్ని దూరం చేస్తున్నాడని అంటుంది. మహదేవయ్య అల్లుడు ఎక్కడున్నాడు అని అడిగితే బెదిరించొద్దు అని తన భర్త ఎన్ని అన్నా దులుపుకొని పోతాడని తగిలిస్తుంది.
నందిని: సర్దుకుపోతా బాపు. చావు అయినా బతుకు అయినా ఆ ఇంట్లోనే అనుకుంటా. మీ అల్లుడికే కాదు బాపు, అత్తింట్లో కూడా నేను అంటే ఎవరికీ పడదు. నీ మనసు చాలా మంచిది బాపు. ఏం చేసినా నా మంచి కోసమే చేస్తావ్. అందుకే నాకు ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పావని ఈ పెళ్లి చేసుకొని నా జీవితం నీ చేతిలో పెట్టాను. నువ్వు ఏం చెప్తే అది చేస్తా.. నాకు తెలుసు బాపు నువ్వు నా మొగుడు లెక్క అంత రాక్షసుడివి కాదు. నా సంతోషం కోసం ఏదో ఒకటి చేస్తావ్. నన్ను ఈ కష్టం నుంచి బయట పడేస్తావ్.
మరోవైపు సత్య క్రిష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బయటకు వెళ్లిన మనిషి ఇంకా రాలేదని అనుకుంటుంది. బెడ్ మీద ఉన్న క్రిష్ జాకెట్ తీస్తుంది. అందులో తాను విసిరేసిన రింగ్ చూస్తుంది.
క్రిష్: దీన్ని ఇంకా జేబులో పెట్టుకొనే తిరుగుతున్నాడా.. ఈ వేషాలకు ఏం తక్కువ లేదు. అసలేమైపోయింటాడు. నన్ను కార్నర్ చేయడానికి వాళ్లింటికి వెళ్లిపోయుంటాడా. వెళ్లినా వెళ్లే ఉంటాడు. తక్కువోడేం కాదు. ఇంట్లో వాళ్లు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి. ఇంతలో విశాలాక్షి భోజనం రెడీ చేసి సత్యవాళ్లని పిలుస్తుంది. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకే వస్తారు. అందరూ క్రిష్ కోసం ఎదురు చూస్తుంటారు.
ఇక అందరూ క్రిష్‌ని పిలవమని అంటే సత్య క్రిష్ ఇంట్లో లేడని చెప్తుంది. ఇంతలో క్రిష్ ఫుల్లుగా తాగి గేటు దగ్గర కుస్తీలు పడుతుంటాడు. సత్య అని పిలుస్తాడు. దీంతో సత్య బయటకు వెళ్తుంది. ఫుల్లుగా తాగేశాను అని అంటాడు. ఇక సత్య క్రిష్‌ని ఇంట్లో వాళ్లతో మాట్లాడొద్దు అని క్రిష్ నోరు మూసుకొని తీసుకెళ్తుంది. ఇంతలో ఇంట్లో వాళ్లు ఏమైందని అడిగితే క్రిష్ ఫ్రెష్ అయి వస్తాడని లోపలికి తీసుకెళ్లిపోతుంది.
క్రిష్: ఏమైంది నీకు ఇట్లా చంద్రముఖిలా మారుతావా ఏంటి. బెడ్ లేపేస్తావా ఏంటి. మరి ఈ దౌర్జన్యం ఏంటి. గుంజుకురావడం ఏంటి.
సత్య: అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి. ఇక్కడున్న రెండు రోజులు ప్రశాంతంగా ఉందాం అనుకున్నాం కదా.
క్రిష్: ఉండొద్దని ఎవరు అన్నారు ఉండు.
సత్య: నువ్వు ఇలా ఉంటే నేను ప్రశాంతంగా ఎలా ఉండాలి. ఇక్కడున్న రెండు రోజులు చక్కగా ఉండు. మీ ఇంటికి వెళ్లాక నువ్వు తాగు తందనాలు ఆడు. ఒక్క రోజు కూడా తాగకుండా ఉండలేకపోయావ్..
క్రిష్: నా మనోభావాలు దెబ్బతిన్నాయి.
సత్య: నువ్వు మారి బుద్ధిమంతుడివి అయ్యావ్ అని మా వాళ్లకి అబద్ధం చెప్పాను. పిచ్చోళ్ల లా వాళ్లు నమ్మేశారు.
క్రిష్: ఏయ్ అబద్ధం ఏంటి నేను నిజంగానే బుద్ధిమంతుడిని.
సత్య: అవునా బుద్ధిమంతుడివే అయితే ఇలా అడ్డగాడిదలా తాగి ఇంటికి రావు. ఇప్పుడిలా తాగి చిందులేస్తే మా వాళ్లు ఏమనుకుంటారు.
క్రిష్: పద వెళ్దాం మామ వెయిట్ చేస్తున్నాడు.
సత్య: నువ్వు ఈ గది దాటి బయటకు రావడానికి వీల్లేదు. పీకల దాకా తాగున్నావ్. ఏం వాగుతావో నీకే తెలీదు. మన గొడవ గురించి చెప్పినా చెప్పేస్తావ్.
క్రిష్: అమ్మతోడు అస్సలు చెప్పను.
సత్య: నేను నమ్మను.
క్రిష్: కొంచెం తాగి వచ్చా.. దీనికే ఇంత గొడవ చేస్తావ్ ఏంటి. అవును తాగినా నా ఇష్టం తాగుతా.. తాగి వచ్చానని మీనాన్నకి కూడా చెప్తా..
సత్య: నువ్వు ఇప్పుడు తెగిస్తే నేను కూడా మీ ఇంటికి వచ్చాక నాకు నచ్చినట్లు చేస్తా.. మీ అమ్మ కాఫీ అడిగితే ముఖం మీద కొడతా.. మీ అన్నయ్య మంచినీళ్లు అడిగితే అందులో కారం కలిపి ఇచ్చేస్తా. ఇక్కడ నువ్వు నీకు నచ్చినట్లు చేస్తే నేను అక్కడ నాకు నచ్చినట్లు ప్రవర్తిస్తా. చేయమంటావా..
క్రిష్: మంచి స్ఫీడ్ మీద ఉంది అన్నంత పని చేసినా చేస్తుంది. సరే నాకు ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు.
సత్య: ఈ గది దాటి బయటకు రాకు.
క్రిష్: అత్తమ్మ అడుగుతుందో ఏమో.
సత్య: ఏం చెప్పాలో నాకు తెలుసు..
క్రిష్: అమ్మో ఈ బ్రహ్మరాక్షసి మెడలోనా నేను బ్రహ్మముడి వేసింది. చెప్తా నీ పని చెప్తా..
సత్య: అమ్మా అది ఆయన బయట తినేసి వచ్చారంట.
విశాలాక్షి: అత్తారింటికి వచ్చి బయట తిని రావడం ఏంటి.
విశ్వనాథం: మాతో పాటు కూర్చొని కొద్దిగైనా తినొచ్చు కదమ్మా.
సత్య: నేను అదే చెప్పానమ్మా..కానీ కుదురదు అనేశారు. ఏం చేయాలో చెప్పు.
క్రిష్: కుదుర్చుకుంటాను సంపంగి..నువ్వేమో ముద్దుగా బతిమాలావ్.. నేనేమో మొండిగా కాదు అన్నాను. నా మనసేమో గిలగిలా కొట్టేసుకుంది. నిద్ర పట్టలేదు. మనసు మార్చుకొని వచ్చా సంపంగి.
సత్య: మనసులో.. రావొద్దని చెప్పినా కావాలనే వస్తున్నాడు. గొడవ చేయాలని డిసైడ్ అయినట్లు ఉన్నాడు.
క్రిష్: అత్తారింట్లో భార్య పక్కన కూర్చొని మీ అందరితో ముచ్చట్లు చెప్పుకొని భోజనం చేయడం అంటే మామూలు అదృష్టం కాదు.. ఎట్లా వదులు కుంటా చెప్పు.
విశ్వనాథం: రా బాబు ఇలా కూర్చొ..
క్రిష్ వస్తూ తాగిన మైకంలో పడిపోబోతే సత్య పట్టుకుంటుంది. దానికి క్రిష్ చూశారా అత్తమ్మ మీ బిడ్డ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో అని అంటాడు. దానికి శాంతమ్మ మీ ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తుంది బాబు అంటుంది. క్రిష్‌ని సత్య కూర్చొపెడుతుంది.
విశ్వనాథం: అల్లుడు గారు రేపే ఉగాది.
క్రిష్: అందుకే కదా వచ్చాం.
విశ్వనాథం: మీతో ఒక మాట చెప్పాలి బాబు. రేపు సాయంత్రం సంధ్యకు పెళ్లి చూపులు.
క్రిష్: ఇంకోసారి ఆలోచించుకోండి. అందరూ షాక్ అవుతారు. అంటే చిన్న పిల్ల అప్పుడే పెళ్లి ఎందుకు అని..
విశ్వనాథం: ఓ అవునా మాకు కూడా చేయాలి అని లేదు బాబు. కానీ మంచి సంబంధం.
విశాలాక్షి: బాబు మీరే దగ్గరుండి ఈ పెళ్లి చూపుల్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలి.
క్రిష్: అదెంత పని అత్తమ్మ. కాకపోతే మొగుడిని ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలి అని వాళ్ల అక్క దగ్గర నేర్చుకోమని చెప్పండి.
సంధ్య: బావగారు భలే సరదాగా మాట్లాడుతారు.
క్రిష్ తినకుండా అలాగే కూర్చొంటాడు. దీంతో విశాలాక్షి తినకుండా ఆలోచిస్తున్నారేంటి అని అడుగుతుంది. దీంతో క్రిష్ పెళ్లి తర్వాత నాకు సంపంగి ఓ అలవాటు చేసిందని అంటాడు. ఏంటని శాంతమ్మ అడిగితే పెళ్లికి తర్వాత మొదటి ముద్ద తనే నాకు తినిపించేది. ఇక్కడికి వచ్చాక నన్ను పట్టించుకోవడం లేదని అంటాడు. అందరూ తినిపించమని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.