Krishna Mukunda Murari Serial Today April 22nd: కృష్ణ ముకుంద మురారి సీరియల్: బ్యాడ్‌న్యూస్, కృష్ణ పరిస్థితి తెలిసి కుప్పకూలిపోయిన మురారి.. ఎగిరి గంతేసిన ముకుంద!
Krishna Mukunda Murari Serial Today Episode కృష్ణ గర్భసంచి పోయిందని వారం రోజుల్లో ఆపరేషన్ చేసి తొలగించాలని డాక్టర్ మురారితో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode కృష్ణ తనకు బాగా కడుపులో నొప్పి ఉందని.. ఫుడ్ పాయిజిన్ కాదని తనకు వెంటనే స్కానింగ్ చేయమని చెప్తుంది. కృష్ణ అలా అనడంతో తనకు చాలా భయం వేస్తుంది ఏమైందని మురారి డాక్టర్ పరిమళను అడుగుతాడు. ఇంతలో రేవతి ఫోన్ చేయడంతో మధు మాట్లాడి వస్తా అని అంటాడు.
ముకుంద: (మనసులో.. పాపం నీ బాధ చూస్తుంటే జాలేస్తుంది మురారి. కానీ ఆ బాధ కృష్ణ కోసం కాబట్టి అస్సుల పట్టించుకోను.) ఏంటి మురారి గారు చిన్న కడుపు నొప్పికి అంత టెన్షన్ పడుతున్నారు. ఏం కాదు అని డాక్టర్ చెప్పారు కదా. పైగా కృష్ణ కూడా డాక్టరే కదా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే తను చూసుకోగలుగుతుంది. ( ఏదో తింటేనో తాగితేనో వచ్చిన నొప్పి కాదు అని తెలుసుకున్న కృష్ణ.. ట్యాబ్లెట్ వేసుకోవడం వల్లే వచ్చిందని తెలుసుకోకుండా ఉంటుందా.. టెస్ట్‌లు అవి ఇవి చూసి ట్యాబ్లెట్ వల్లే ఇలా అయింది అని తెలిస్తే నేను దొరికిపోతాను. ఏం చేయాలి..) మరోవైపు ముకుంద టెన్షన్ పడటం మురారి గమనిస్తాడు. దానికి ముకుంద.. టెన్షన్ మురారి గారు మీకు టెన్షన్ వద్దు అని చెప్పి నేను ఎంత టెన్షన్ పడుతున్నానో చూడండి. కానీ కృష్ణకు ఏం కాదు మీరు ధైర్యంగా ఉండండి. ముకుంద ఏం కాదు కూల్‌గా ఉండు..
మరోవైపు రేవతి మధుతో మాట్లాడుతుంది. స్కానింగ్ చేస్తున్నారు.. రిపోర్ట్స్ వస్తే తెలుస్తాయి అంటాడు. రేవతి కంగారు పడుతుంది. ఇంతలో ఆదర్శ్ అక్కడికి వచ్చి మీరాతో తన పెళ్లి గురించి అడుగుతాడు. దీంతో రేవతి షాక్ అయిపోతుంది. ఓ వైపు కృష్ణ పరిస్థితికి భయంగా ఉంటే నీ పెళ్లి ముచ్చట్లు మాట్లాడమని ఎలా చెప్పగలుగుతున్నావని ప్రశ్నిస్తుంది. దానికి ఆదర్శ్ చిన్న కడుపు నొప్పే కదా అని అంటాడు. ఆ మాటకు రేవతి ఇంకా బాధ పడుతుంది.
రేవతి: చిన్న బాధ అని ఎంత తేలికగా అన్నావురా.. అవునులే నా కోడలికి ఎదైనా జరిగితే నాకు బాధగా ఉంటుంది కానీ నీకు ఎందుకు ఉంటుంది. అయినా వదిలేయ్ మన బాధ పట్టనివాళ్ల దగ్గర మనం బాధ పడితే లాభం ఉండదు. నీకు కావల్సింది పెళ్లే కదా. మీ అమ్మతో మాట్లాడా.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అని చెప్పింది.
ఆదర్శ్: ముకుంద చావుకి ఆ కృష్ణ కారణం అని అందరికీ తెలుసు. అయినా ఇప్పుడు కృష్ణకు కడుపు నొప్పి రాగానే నేను విలవిల్లాడిపోవాలంట.. నోవే..
మరోవైపు మురారి కృష్ణ గురించి పరిమళకు అడుగుతాడు. దానికి డాక్టర్ నీరసంగా ఉంది సెలైన్ ఎక్కిస్తున్నాం తర్వాత ఇంటికి తీసుకెళ్లొచ్చు అని బయటకు వెళ్లిబోతుంటే.. మురారి ఆమెతో పాటు వెళ్తాడు. కృష్ణ కండీషన్ అడుగుతాడు. దానికి పరిమళ విషయం చెప్పకుండా ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడుతుంది. దీంతో మురారి కృష్ణకు ఏమైందో చెప్పమని రిపోర్ట్స్‌లో ఏముందో చెప్పమని అడుగుతాడు.
మురారి: పరిమళ నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేం చెప్పవేంటి ఆ రిపోర్ట్స్‌లో ఏముందో చెప్పు.. ఏమైనా ప్రాబ్లమా..
పరిమళ: గొడవ చేయకురా.. మధు ఎక్కడ..
ముకుంద: అసలు విషయం చెప్పకుండా ఏదేదో సాగదీస్తుంది ఏంటి.
మురారి: పరిమళ నేను రిపోర్ట్స్ గురించి అడిగితే నువ్వు వాళ్లు వీళ్ల గురించి అడుగుతావేంటి నాకు అర్థం కావడం లేదు. ఏమైంది. ఏదైనా చెప్పకూడని విషయమా.. పరిమళ నాకు టెన్షన్‌గా ఉంది.. రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయో అది చెప్పు.
పరిమళ: నీ దురదృష్టమో.. కృష్ణ దురదృష్టమో కానీ.. కృష్ణకు గర్భసంచి తీసేయాలి.
మురారి: ఏంటీ..
ముకుంద: ఎస్.. ప్లాన్ సక్సెస్. ఈ మాట వినగానే చెవిలో అమృతం పోసినట్లు ఉంది.
మురారి: ఏం మాట్లాడుతున్నావ్ పరిమళ. ఏదో మామూలు కడుపునొప్పి అన్నావ్ కదా.
పరిమళ: అనుకున్నాం కానీ గర్భసంచిలో ప్రాబ్లమ్ వచ్చి నొప్పి వచ్చింది. వారం రోజుల్లో ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేయాలి. సారీరా.. ఈ జన్మకు ఇక కృష్ణకు పిల్లలు పుట్టే యోగం లేదు.
మురారి: అలా జరగడానికి వీల్లేదు. కృష్ణ పిల్లల్ని కనాలి. అదే తన జీవిత ఆశయం. డాక్టర్‌వే కదా నువ్వు ఏం చేయలేను అంటావ్ ఏంటి.. మళ్లీ రిపోర్ట్స్ చెక్ చేయ్..
పరిమళ: మురారి కూల్ డౌన్. నాకు డౌట్ వచ్చి మళ్లీ స్కాన్ చేశా.. కృష్ణకు గర్భసంచి తీసేయాల్సిందే. ఇదే నిజం..
మురారి: నాకు ఏం చేయాలో తెలీయడం లేదు. ఇంట్లో అందరూ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుసా..
పరిమళ: మురారి ఏం జరిగినా మనం ఎదుర్కొవాలి. ఇప్పుడు పిల్లల్ని కనడం కంటే కృష్ణ క్షేమంగా ఉండటం మనకు ముఖ్యం అది ఆలోచించు.
మురారి: నాకు ఏం అర్థం కావడం లేదు. పిచ్చేక్కుతోంది. తను పిల్లల్ని కనలేదు అని కృష్ణకు ఎలా చెప్పాలి.
పరిమళ: చెప్పొద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజం తెలిస్తే తట్టుకోలేదు.
మురారి: తెలుసు కానీ ఇక్కడ తను డాక్టర్ అందరూ తెలుసు చెప్పకుండా ఎలా ఉంటారు.
పరిమళ: ఎవ్వరూ చెప్పరు. చెప్పకుండా నేను చూసుకుంటాను. తను పూర్తిగా కోలుకొని ఆపరేషన్ చేసిన తర్వాత చెప్దాం. ముందు నువ్వు ధైర్యంగా ఉండు మురారి. నువ్వు ఏడిస్తే తనకి అనుమానం వచ్చేస్తుంది.
మరోవైపు కృష్ణకు బాలేదు అని సంగీత బాధ పడుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో రజిని చిన్న కడుపు నొప్పికి ఏమవుతుంది. పోతాదా ఏంటి అని అంటుంది. దీంతో భవాని రజినిని తిడుతుంది. కృష్ణ తన ఇంటి కోడలు అని తన వంశాన్ని పెంచేదని తనని ఎవరు ఏమైనా అంటే ఊరునని భవాని రజినీకి వార్నింగ్ ఇస్తుంది. ఇంకోసారి కృష్ణ గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు గడప దాటాల్సిందని హెచ్చరిస్తుంది. మరోవైపు ఆ మాటలు విన్న ఆదర్శ్ ముకుంద చావుకి కారణమైన కృష్ణని తన తల్లి దేవతలా చూస్తుందని అనుకుంటాడు.
మరోవైపు కృష్ణ ఇంటికి వస్తుంది. డాక్టర్ మాటలు తలచుకొని మురారి ఏడుస్తాడు. కృష్ణకు నిజం తెలిస్తే ఎలా తట్టుకుంటుందని బాధ పడతాడు. ఇంతలో భవాని వచ్చి చిన్న కడుపు నొప్పికే మీరు ఇద్దరూ ఎందుకు అంత బాధ పడుతున్నారని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.