Karthika Deepam 2 Serial Today April 22nd: కార్తీకదీపం 2 సీరియల్: ఆ రౌడీతో బంటుని చూసేసిన దీప, కాలర్ పట్టుకున్న కార్తీక్.. దీప భర్త కోసం సుమిత్ర ఎంక్వైరీ!
Karthika Deepam 2 Serial Today Episode సుమిత్రను హత్య చేయడానికి ప్రయత్నించిన రౌడీతో బంటు మాట్లాడటం దీప చూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode అనసూయను ఇంటి దగ్గర పెద్ద మనుషులు పంచాయితీ పెడతారు. అప్పులు తీర్చలేదని ఇళ్లు వేలం వేసి అందరి బాకీలు క్లియర్ చేస్తామంటారు. దీంతో అనసూయ పెద్ద మనుషుల్ని వేడుకుంటుంది. ఇంటిని వేలం వేయొద్దని కొడుకును దీప తీసుకొస్తుంది. తాను కూడా వెళ్లి వాళ్లని తీసుకొస్తాను అంటుంది. దానికి మల్లేశ్ అడ్డుకొని నువ్వు కూడా నీ కొడుకు కోడలిలా ఊరు దాటేసి మరి అప్పు తీర్చవని వాదిస్తాడు. దానికి అనసూయ వారం రోజులు గడువు అడుగుతుంది.
మల్లేశ్: ప్రెసిడెంట్ గారు వారం రోజుల్లో అనసూయ తిరిగిరాకపోతే అప్పుల వాళ్లమంతా ఇంటిని వేలం వేసుకుంటాం. దీనికి సరే అంటేనే వెళ్లమనండి.. లేదంటే అప్పు తీర్చమనండి.
అనసూయ: అలాగే అండి. వారం దాటాక ఇంటిని జప్తు చేసుకోండి.
మల్లేశ్: అలా అని ఈ కాగితాల మీద వేలిముద్ర వేయు. అని అనసూయతో వేలిముద్రలు తీసుకుంటాడు మల్లేశ్. వారంలో కొడుకు, కోడల్ని తీసుకురా అని అంటాడు. మనసులో.. వేలిముద్రలు వేసుకున్నావ్ కదా ఇక నువ్వు నెత్తిమీద చేయి వేసుకోవడమే అని మల్లేశ్ అనుకుంటాడు.
మరోవైపు జ్యోత్స్న, దీపలను తీసుకొని సుమిత్ర గుడికి వస్తుంది. ఇక జ్యోత్స్న పేరున అర్చన చేసిన పంతులు తర్వాత దీపకు గోత్రం అడుగుతాడు. దీప తెలీదు అంటే తల్లి దండ్రుల పేర్లు చెప్పమంటారు.
దీప: నాన్న పేరు కుభేర్, అమ్మ పేరు అంభుజవల్లి.
పారిజాతం: అబ్బో నువ్వు కుభేరుడి కూతురివా.. పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదే.. కొన్ని అంతేలేమ్మా గోడకు అతికించిన కాగితాలలా పేర్లు కూడా అతికించినట్లు ఉంటాయి.
దీప: పారిజాతం గారు. మా నాన్న ధనానికి పేద వాడు కావొచ్చు. నా మీద ప్రేమ పంచడంలో ఎప్పుడూ కుభేరుడే. నన్ను అనండి పడతాను. కానీ మా నాన్న విషయంలో తప్పుగా మాట్లాడితే ఎవర్ని సహించను.
సుమిత్ర: కొన్నింటికి హద్దులుంటాయి అత్తయ్య. దాటితే ఇలాగే ఉంటుంది. మనసులో.. దీప పైకి ప్రశాంతంగా కనిపించే అగ్నిపర్వతం అని అర్థమవుతుంది. ఇది పడుతున్న బాధలకు కారణం ఏంటో తెలుసుకొని సాయం చేయాలి.
మరోవైపు గుడిలో ఉండగానే బంటుకు ఫోన్ వస్తుంది. బంటుని దీప కోపంగా చూస్తుంది. ఇక సుమిత్ర దీప, జ్యోత్స్నలను నాగదేవత చుట్టూ ప్రదక్షిణలు చేయమని అంటుంది. దీంతో జ్యోత్స్న నా వల్ల కాదు అనేస్తుంది. ఇక దీప వెళ్తుంది. దీప నాగదేవతకు ప్రదక్షిణలు చేస్తూ బంటు సుమిత్రను కొట్టిన రౌడీతో మాట్లాడటం చూస్తుంది. పరుగున కార్తీక్ వాళ్ల దగ్గరకు వెళ్తుంది.
దీప: అమ్మా.. ఆ రోజు గుడిలో మిమల్ని చంపాలి అనుకున్న వాడిని నేను ఇప్పుడే చూశాను.
సుమిత్ర: ఎక్కడ చూశావ్..
దీప: మన బంటుతో మాట్లాడుతుంటే చూశాను.
కార్తీక్: వాడు ఎక్కడున్నాడు.
దీప: బయట మాట్లాడుతుంటే చూశాను.
జ్యోత్స్న: బావ వాడిని వదలొద్దు..
పారిజాతం: మనసులో.. ఒరేయ్ బంటుగా అంతా నాశనం చేశావు కదరా.. ఇప్పుడు వాడి పేరు చెప్పకుండా ఆపాలి.
కార్తీక్: కార్తీక్ వచ్చేసరికి ఆ రౌడీ వెళ్లిపోతాడు. కార్తీక్‌ను చూసి బంటు ఫోన్ మాట్లాడి వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. బంటు వాడు ఎక్కడ.
బంటు: మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు బాబు.
దీప: ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ ఒక మనిషితో మాట్లాడావు కదా. ఆ రోజు గుడిలో అమ్మగారిని కొట్టబోయిన మనిషి వాడే..
బంటు: వాడు వెళ్లిపోయాడుగా.
కార్తీక్: వెళ్లిపోయాడు అంటే వాడు నీతో మాట్లాడినట్లే కదా. చెప్పరా ఎవడు వాడు. వాడి గురించి మనం వెతుకుంటే వాడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడటం ఏంటి. వాడికి నీకు ఏంటి సంబంధం చెప్పు.
పారిజాతం: మనసులో.. ఇక లాభం లేదు మనం రంగంలోకి దిగాల్సిందే.. కార్తీక్ వాడు అలా అడిగితే చెప్పడురా.. అని కొడుతుంది. వాడికి నీకు ఏంటి సంబంధం చెప్పురా..
బంటు: అమ్మగారు నా మీద ఒట్టు అమ్మ వాడు ఎవడో నాకు తెలీదు. ఇంటి దగ్గర నుంచి మా ఆవిడ ఫోన్ చేస్తే మాట్లాడటానికి వచ్చానమ్మ. ఎవరో దారిన పోతూ హాస్పిటల్ ఎక్కడ అని అడిగాడు. అంతకు మంచినాకు ఏం తెలీదు. నమ్మండి.
సుమిత్ర: నువ్వేం అనుకుంటున్నావ్ కార్తీక్.
కార్తీక్: వీడు చెప్పేది నిజం అయితే వాడు మనల్ని ఫాలో చేస్తున్నాడు. మన శత్రువులు ఎక్కడో లేరు అత్త మన చుట్టూనే ఉన్నారు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం రండి.
బంటు: ఈ దీప ఉంటే నాకు ఎప్పటికైనా ప్రమాదమే.
మరోవైపు ఇంటికి వచ్చిన తర్వాత పారిజాతం బంటుకి క్లాస్ ఇస్తుంది. ఆ రౌడీ గుడికి ఎందుకు వచ్చాడని అడుగుతాడు. దానికి బంటు డబ్బులు కోసం వచ్చాడని అంటాడు. దీంతో పారిజాతం మొత్తం ఇచ్చేశాను కదరా అంటే మీరు నాకు ఖర్చులకు ఇవ్వడం లేదని సగం నేను వాడుకున్నానని అంటాడు. దీంతో పారిజాతం బంటుని తిడుతుంది. డబ్బులు ఇస్తాను వాడికి ఇచ్చి రెండు నెలలు వాడిని కనిపించకుండా వెళ్లమని చెప్తుంది.
మరోవైపు దీప వంటలు చేస్తుంటుంది. అక్కడికి సుమిత్ర వస్తుంది. ఇక దీప భర్త గురించి ఎలా అయినా తెలుసుకోవాలి అని అనుకుంటుంది. పని మనిషి భాస్వరాన్ని పంపించేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: అక్క మీద సుమన కసి, శిరసు లేని దేవత పూజ ఫలితం నయనికి దక్కకుండా చేస్తానని శపథం..!