అన్వేషించండి

Satyabhama Serial Today November 13th: సత్యభామ సీరియల్: క్రిష్ కోసం హాస్పిటల్‌కి పరుగులు తీసిన సత్య.. కిడ్నాపర్ల డిమాండ్‌కి షాక్‌లో హర్ష!

Satyabhama Today Episode క్రిష్ పుట్టక తెలుసుకోవడానికి సత్య క్రిష్ పుట్టిన హాస్పిటల్‌కి ఎంక్వైరీకి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode హర్షకి కిడ్నాపర్ల నుంచి ఫోన్ వస్తుంది. మైత్రి క్షేమంగా ఇంటికి రావాలి అంటే డబ్బు కావాలి అంటాడు. నందిని సైడ్ నుంచి పదివేలో ఇరవై వేలో ఇస్తామని చెప్పమంటుంది. ఇక అటువైపు మైత్రి హర్ష దగ్గర డబ్బు లేదు పేరుకే ఒక 50 వేలు అడగండి అని అంటుంది. కిడ్నాపర్లు, మైత్రి ఫ్రెండ్ మైత్రికి నీ ప్రేమ ఇక్కడ చూపించకు అని చెప్పి హర్షకి 10 లక్షలు అడుగుతారు. అంత డబ్బు అనగానే హర్షతో పాటు ఫ్యామిలీ మొత్తం నోరెళ్లబెడతారు.

సత్య: తనలో తాను.. ఎంత రెచ్చగొట్టినా మామయ్య దగ్గర నుంచి క్రిష్ తండ్రి గురించి తెలుసుకోలేకపోతున్నా మామయ్య తెలివిగా మాట్లాడుతున్నారు. బిడ్డను మార్చడం అంటే అది పురిటిలోనే జరిగుండాలి. అంటే హాస్పిటల్‌లోనే సాధ్యమవుతుంది. అంటే నా ఎంక్వైరీ క్రిష్‌ పుట్టిన హాస్పిటల్ నుంచే మొదలు పెట్టాలి. 
క్రిష్: ఇక్కడున్నావా ఓయ్ ఏం ఆలోస్తున్నావ్... ఓయ్ మేడం ఏంటి ఆలోచిస్తున్నారు. అని ముద్దు పెడతాడు. ఈ లోకం లోకి వచ్చావా. మొగుడు పక్కన ఉండగా ఏదో ఆలోచిస్తావ్ ఏంటి. ఎవరి గురించి.
సత్య: నీ గురించే. రేపు నేను బయటకు వెళ్లాలి. నువ్వు నాతో రావొద్దు.
క్రిష్: నేను వస్తే అడ్డమా.
సత్య: అడ్డమే మనసులో నేను వెళ్లేది నీ కోసమే క్రిష్ నీ కన్న వాళ్లు ఎవరో తెలుసుకోవడానికే.
క్రిష్: అంత కచ్చితంగా చెప్పావు అంటే నేను కచ్చితంగా వస్తాను. ఏంటి నాకు మస్కా కొట్టి ఎలా పారిపోవాలి అనుకుంటున్నావా. నేను అంత తప్పు ఏం చేశాను. నన్ను దూరం పెడుతున్నావ్.
సత్య: తప్పు జరిగింది అది తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. 
క్రిష్: నువ్వు రేపు ఒక్కదానివే బయటకు వెళ్లాలి నేను రావొద్దు అంటే కదా సరే రానులే. 

క్రిష్ లంచంగా సత్యని ముద్దు ఇమ్మంటాడు. సత్య ఇస్తుంది. ఇక క్రిష్‌ సత్యని దగ్గర తీసుకుంటాడు. ఇద్దరూ హగ్ చేసుకుంటాడు. మరోవైపు నందిని హర్షతో అంత డబ్బు ఇవ్వలేం మైత్రి గురించి మర్చిపో అని అంటుంది. మైత్రి నెత్తి మీద రూపాయి పెట్టిన చెల్లదు అలాంటి దానికి పది లక్షలు ఎలా ఇస్తావని అంటాడు. అంత డబ్బు నువ్వు ఎలా ఇవ్వగలవు తన గురించి వదిలేయమని అంటుంది. నందిని ఫుల్ ఫైర్ అయిపోతుంది. అంత డబ్బు మన వల్ల కాదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్తుంది. ఇక సీన్ కట్ చేస్తే సత్య హడావుడిగా వంట చేస్తుంటుంది. పంకజం అది చూసి భైరవికి చెప్తుంది. 

పంకజం: ఎక్కడికో బయటకు వెళ్లే ప్రోగ్రాం పెట్టారమ్మా అందుకే ఇంత దూకుడుగా ఉన్నారు. 
భైరవి: నాకు అదే అనుమానంగా ఉందే.
పంకజం: మరి ఇంకేం వెళ్లి కాళ్లకి అడ్డం పడండి వెళ్లనివొద్దు. కంట్రోల్‌లో పెట్టుకోండి.
భైరవి: దాని సంగతి చూస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావే. 
సత్య: కొంచెం పని ఉంది బయటకు వెళ్తున్నా అత్తయ్య.
భైరవి: ఏంటి ఆ దాపరికం చెప్పవే. నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు నేను పర్మిషన్ ఇచ్చినప్పుడే పోవాలి. పో లోపలికి పో.  
సత్య: మనసులో ఇలా అడ్డు పడుతుందేంటి.

జయమ్మ వచ్చి మీ అత్త అలాగే అంటుంది నువ్వు వెళ్లమ్మా అని చెప్తుంది. నా కోడలు నా మాట వినాలి అని భైరవి అంటే నా కోడలు నా మాట వినాలి అని జయమ్మ అంటుంది. ఇంతలో మహదేవయ్య వచ్చి అన్ని అందరికీ చెప్పాలి అంటే కుదరదు కదా పోనివ్వే అని అంటాడు. అయినా భైరవి ఒప్పుకోదు. ఇంతలో క్రిష్‌ వచ్చి బాపు బయటకు వెళ్లాలి అని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో సత్య కూడా క్రిష్ వెనకాలే వెళ్లి అందరూ చూసేలా క్రిష్ నన్ను బయటకు తీసుకెళ్తా అని చెప్పావు ఇప్పుడు వదిలేసి వెళ్తున్నావ్ అని రివర్స్‌లో వెళ్లి క్రిష్‌ని అడ్డుపెట్టుకొని భైరవి చూస్తుండగా క్రిష్ కారు ఎక్కేస్తుంది.  మరోవైపు హర్ష, విశ్వనాథం డల్‌గా కూర్చొంటారు. నందిని కాఫీ ఇస్తుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోమని అంటుంది. విశాలాక్షి వచ్చి మైత్రిని వదిలేస్తే తప్పు చేసిన వాళ్లం అవుతాం.. అలా అని సాయం చేస్తే తలకు మించిన భారం అవుతుందని అంటుంది. ఇంతలో కిడ్నాపర్ల నుంచి మరోసారి కాల్ వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: కథ ఇప్పుడు నా చేతిలో ఉందని మామకి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన సత్య.. మైత్రి కోసం టెన్షన్ పడుతున్న హర్ష!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget