Satyabhama Serial Today November 12th: సత్యభామ సీరియల్: కథ ఇప్పుడు నా చేతిలో ఉందని మామకి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన సత్య.. మైత్రి కోసం టెన్షన్ పడుతున్న హర్ష!
Satyabhama Today Episode క్రిష్ కన్న తండ్రి ఎవరో తెలుసుకుంటానని సత్య మహదేవయ్యతో ఛాలెంజ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode మహదేవయ్య, చక్రవర్తి మాట్లాడుతుంటే సత్య అక్కడికి వెళ్తుంది. చక్రవర్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎప్పుడూ లేనిది మనిషిని కాపాలా పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఎందుకు అంత సాయం చేసిన మామయ్యతో అంత కోపంగా మాట్లాడుతున్నారు. ఎందుకు చిన్న మామయ్య అంత చిరాకుగా వెళ్తున్నారని సత్య అడుగుతుంది.
మహదేవయ్య: క్రిష్ ఎప్పటికీ నా వైపే ఉంటాడు. ఇంట్లో జరిగిన లొల్లి చూస్తే నీకు ఇంకా అర్థం కాలేదా కోడలు కాని కోడలా. ఇంకా ఎందుకు ఈ వెంపర్లాట
సత్య: ఇది వెంపర్లాట కాదు మామయ్య కాని మామయ్య మన కథకి క్లైమాక్స్. క్రిష్ అసలు తండ్రి ఎవరో తెలుసుకోబోతున్నా.
మహదేవయ్య: చిలక జోస్యం అడుగుతావా ఈ ఊరిలో ఏ చిలక అయినా ఈ మహదేవయ్య ఏం చెప్తే అదే చెప్తుంది. నీకు కావాల్సిన నిజాన్ని నేను పాతికడుగులు లోతులో తవ్వేశా అది ఎప్పుడో కనుమరుగైపోయింది.
సత్య: మీరు ఎక్కడ ఆ నిజాన్ని పాతి పెట్టారో నేను అక్కడ నుంచే కథ మొదలు పెడతా. తెగించాను ఎంత దూరం అయినా వెళ్తాను.
మహదేవయ్య: నువ్వు దూరం వెళ్లే కొద్దీ నీ మొగుడు నీకు దూరం అవుతాడు ఎందుకంటే వాడి చేయి నా చేతిలో ఉంటుంది.
సత్య: ఎవరి జాగ్రత్త వాళ్లు తీసుకుంటారు. ఇప్పుడు కథ నడిపేది నేను.
మైత్రి వెళ్లిపోగానే ఇళ్లంతా బోసిపోయిందని శాంతమ్మ ఇంట్లో వాళ్లతో అంటుంది. దానికి సంధ్య వెనక్కి రమ్మంటావా అని అంటే దానికి శాంతమ్మ వద్దమ్మ మీ వదిన నన్ను చంపేస్తుందని అంటుంది. ఎక్కడున్నా మైత్రి సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఇంతలో హర్ష, నందిని వస్తారు. మైత్రిని ఎవరో కిడ్నాప్ చేశారని హర్ష జరిగింది చెప్తాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్తే హర్ష ఇవ్వడం లేదని నందిని ఫైర్ అవుతుంది. అప్పులు చేసి టికెట్ కొనడం ఇవన్నీ వేస్టేనా ముందు కంప్లైంట్ ఇవ్వు మైత్రి దొరికితే ఫారిన్ పంపాలని అంటుంది. కావాలి అంటే క్రిష్‌కి చెప్తా అంటుంది. దాంతో హర్ష వద్దని కిడ్నాపర్లు ఫోన్ చేస్తారని అంటాడు. మైత్రి మైత్రి అని అన్నావ్ ఇప్పుడు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అని అంటుంది. కిడ్నాపర్లు ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదని చెప్పు అని అంటుంది. హర్ష మైత్రి కనిపించడం లేదని తల పట్టుకొని కూలబడిపోతాడు.
మరోవైపు మైత్రి తన ఫ్రెండ్‌తో కలిసి మాట్లాడుతుంది. కిడ్నాపర్లకి తాను చెప్పే వరకు పని లేదు అని చెప్పి బిర్యాని తినుకోమని అంటుంది. ఫ్లైట్ టేకాప్ అయిన వరకు ఫోన్ చేయించనని అంటుంది. మరోవైపు చక్రవర్తి ఇంటికి వెళ్తానని చెప్తే జయమ్మ ఏడుస్తుంది.
జయమ్మ: నువ్వు కావాలి అనుకున్నప్పుడు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ అమ్మ ఊపిరితో ఉంటుందో లేదో ఉన్నప్పుడు అయినా మాట్లాడరా.
చక్రి: అలా అనకు అమ్మ.
జయమ్మ: ఏం చేయనురా ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నావ్ చుట్టంలా చూస్తున్నావ్ నేను నీకు అమ్మనిరా. నా మనసుకి నీ అవసరం ఉందిరా మీరు ప్రేమగా మాట్లాడే మాటలు కోసం ముఖం వాచి ఉన్నానురా అంత కంటే ఈ ముసలి తల్లి ఏం ఆశించడం లేదురా.
చక్రి: కొడుకు ఎంత పెద్ద వాడు అయినా అమ్మ అమ్మే అమ్మ. నీతో మాట్లాడకూడదు అని కాదు అమ్మ నీతో మాట్లాడితే నా కన్నీళ్లు చెప్పుకోకుండా ఉండలేను. చెప్పి నీకు బాధ పెట్టాలి అని లేదమ్మా నీ చుట్టూ ఇంత మంది ఉన్నారు కానీ నేను ఒంటరి వాడినమ్మా నా జీవితం ఒంటరిది అయిపోయింది. అందుకే అలా అంటీ అంటనట్లు ఉండిపోతున్నా. మీ అందరినీ చూడటం నాకు ఇష్టం కానీ ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది. అందుకు దూరంగా ఉంటున్నాను అమ్మ. నా కష్టాలను నా భుజం మీద మోయాల్సిందే అమ్మ తప్పదు.
క్రిష్: బామ్మ బాబాయ్‌ని బతిమాలుతున్నావ్ ఏంటి కట్టి పడేయాలా చెప్పు.
జయమ్మ: అందరినీ బెదిరించడమేనా.
ఇక క్రిష్ సత్య రావడంతో చక్రవర్తి పుట్టినరోజు అని చెప్తాడు. దాంతో సత్య అన్నీ క్రిష్‌కి చూసుకోమని అంటుంది. మరోవైపు రాత్రి అయినా ఇంకా కిడ్నాపర్లు నుంచి ఫోన్ రాలేదని అందరూ కంగారు పడతారు. ఇక మైత్రి ఫ్రెండ్ ఇప్పటికే లేటు అయింది ఫోన్ చేయించు అని అంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అందరూ హర్షతో చెప్తారు. ఇంతలో మైత్రి రౌడీలతో హర్షకి ఫోన్ చేయిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: ‘కార్తీకదీపం2’ సీరియల్: రిసెప్షన్ కు వచ్చిన జ్యోత్స్న, పారిజాతం – కార్తీక్ ను అవమానించిన జ్యోత్స్న