అన్వేషించండి

Karthika Deepam Serial Today November 11th:  ‘కార్తీకదీపం2’ సీరియల్:     రిసెప్షన్‌ కు వచ్చిన జ్యోత్స్న, పారిజాతం – కార్తీక్‌ ను అవమానించిన జ్యోత్స్న

Karthika Deepam Today Episode:  కార్తీక్‌, దీప రిసెప్షన్‌ లో కార్తీక్‌, జోత్స్న ఎంగేజ్‌మెంట్ వీడియో ప్లే కావడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Karthika Deepam Serial Today Episode:   దీప, కార్తీక్‌, శౌర్య, స్వప్న అందరూ రిసెప్షన్‌ దగ్గరకు వస్తారు. అక్కడ తాతయ్యను చూసిన శౌర్య ఊరెళ్లారని చెప్తారు. కదా..? ఎప్పుడొచ్చారు. అని డౌటుగా అడుగుతుంది. దీంతో కార్తీక్ నీకు అవన్నీ తర్వాత చెప్తానని డయాస్‌ మీదకు వెళ్తారు. ఏర్పాట్లు బాగా చేసినట్టు ఉన్నారని కార్తీక్ అడగ్గానే నీకు ఇంకా సర్‌ప్రైజ్ కూడా ఉందని స్వప్న చెప్తుంది. దీంతో సర్‌ప్రైజా అంటూ కార్తీక్‌ అంటుండగానే అక్కడకు జ్యోత్న్స, పారిజాతం వస్తారు. వాళ్లను చూసిన దాసు ఆశ్చర్యపోతాడు. వెంటనే డల్లుగా మారపోతాడు.

పారిజాతం: అదేంట్రా చూడగానే నీ ముఖం స్విచ్చాన్‌ చేసిన లైట్‌ లా వెలిగిపోయింది. మళ్లీ బల్బు పేలినట్టు అలా పెట్టావు

దాసు: మిమ్మల్ని చూడగానే ఆనందం అనిపించింది. ఇంతలో నే మిమ్మల్ని ఎవరు పిలిచారా.? అని ఆశ్చర్యం. కానీ మీరు వస్తే ఏం గొడవ జరగుతుందోనని భయం

పారిజాతం: అరేయ్‌ పారిజాతం అంటే ఏమనుకుంటున్నావురా..? నువ్వు ఎక్కడైనా ఫంక్షన్‌ జరగుతుంటే వచ్చి ఫ్రీగా పుడ్డు తినిపోయే రకం అనుకుంటున్నావా..? నువ్వు.

 అంటూ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లిపోతారు. రిసెప్షన్‌లో దీప, కార్తీక్‌ మరోసారి దండలు మార్చుకోవాలిన స్వప్న చెప్తుంది.  కార్తీక్‌, దీప మెడలో దండ వేస్తాడు. దీప మాత్రం ఆలోచిస్తుంది. నాకు కష్టంగా ఉన్నా నేను ఈ పెళ్లి ఒప్పుకోవాల్సిందేనని మనసులో అనుకుని కార్తీక్‌ మెడలో దండ వేస్తుంది. దీప చిన్నగా నవ్వుతుంది. దీంతో కార్తీక్‌ కూడా ఊపిరి పీల్చుకుంటాడు. దీప మనసులో భయం పోయినట్టు ఉంది అనుకుంటాడు. దీప దండ వేయడం చూసిన జ్యోత్స్న షాక్‌ అవుతుంది.

జ్యోత్స్న: నవ్వుతూ మరి వేసింది గ్రానీ. ( అనుకుని కార్తీక్‌ దగ్గరకు వెళ్తుంది.) హాయ్‌ బావ

కార్తీక్‌: మిమ్మల్ని ఎవరు పిలిచారు.

జ్యోత్న్స: పిలిస్తే వచ్చే వారు బంధువులు పిలవకుండా వచ్చేవారు ఆత్మీయులు.

కార్తీక్‌: ఆంత ఆత్మీయత మాకు అవసరం లేదులే.

జ్యోత్న్స: బావ నేను గొడవ చేయడానికి రాలేదు బావ. కంగ్రాట్స్‌  

పారిజాతం: నేను నా మనవడు కాశీ పిలిస్తే వచ్చాను లేకపోతే రాకపోయేదాన్ని.

కాశీ: నేను నిన్నేమి పిలవలేదు మేం ఏం చేస్తున్నామో నీకు తెలియాలని ఇన్విటేషన్ పంపించాను.

కాంచన: కాశీ వచ్చిన వాళ్లతో ఇలాగేనా మాట్లాడేది.

కాశీ: సారీ అత్తా..

కాంచన: సారీ కాదురా. ముందు మీ మామయ్య గారిని కూడా పైకి రమ్మను.

కాశీ: అలాగే అత్తా..

అని వెళ్లి కాశీ మామయ్యను పిలుస్తాడు. మామయ్య రానంటాడు. దీంతో కాశీ అత్తను కూడా పిలుస్తాడు. మీరు మామయ్య గారిని తీసుకుని రమ్మని చెప్పి వెళ్లిపోతాడు. అందరూ వచ్చి దీప, కార్తీక్‌ లకు కంగ్రాట్స్‌ చెప్పి వెళ్లిపోతుంటారు. ఇంతలో మహిళా మండలి  అధ్యక్షురాలు సరోజిని వచ్చి కార్తీక్ ను మెచ్చుకుంటుంది.   

సరోజిని: మీలాంటి ఆదర్శ పురుషుడిని సన్మానించి సమాజానికి పరిచయం చేయాలి.

కార్తీక్‌: మీరు సన్మానం చేసేంత గొప్ప పని నేనేం చేయలేదండి.

సరోజిని: పెళ్లాన్ని అనుమానించే మగాళ్లు ఉన్న ఈ రోజుల్లో దీప లాంటి మనిషికి మీరు జీవితాన్ని ఇచ్చారట. మీరు ఎంత మందికి ఆదర్శమో ఆలోచించండి.

కార్తీక్‌ : చూద్దాం లేండి.

అని కార్తీక్‌ చెప్పగానే ఆమె విషెష్‌ చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో స్వప్న వచ్చి  కార్తీక్‌ సంబంధించిన ఏవీ రెడీ చేశామని అది ఇప్పుడు ప్లే అవుతుందని చెప్తుంది. అందులో కార్తీక్‌, జ్యోత్స్న ఎంగేజ్‌మెంట్‌ వీడియో ప్లే అవుతుంది. అది చూసి అందరూ షాక్‌ అవుతారు. పార్టీకి వచ్చిన వాళ్లందరూ కార్తీక్‌ను తిడుతుంటారు. జ్యోత్స్న, పారిజాతం అదే అదనుగా కార్తీక్‌ను ఏకిపారేస్తారు. దీంతో కార్తీక్‌, జోత్స్న, పారిజాతాలను తిడతాడు. జ్యోత్స్న కార్తీక్ చేతిని శౌర్య మీద పెట్టి నేను అడిగే దానికి నీ కూతురి మీద ఒట్టేసి నిజం చెప్పమని అంటుంది. దీప కల్పించుకోబోతే నువ్వు మాట్లాడకని జ్యోత్స్న సీరియస్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

 

 

 

 

 

 

 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Basara IIIT: బాసర ట్రిపుల్ల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
బాసర ట్రిపుల్ల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
SEO Poisoning: గూగుల్ సెర్చ్‌లో కూడా స్కామ్ - మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సైబర్ కేటుగాళ్లు!
గూగుల్ సెర్చ్‌లో కూడా స్కామ్ - మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సైబర్ కేటుగాళ్లు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆసీస్ తో టెస్టుకు రోహిత్ దూరం! కెప్టెన్ గా బుమ్రా?ట్రోలర్స్‌కి ఇచ్చి పడేసిన రౌడీ, ఒక్క వీడియోతో గప్‌చుప్బెల్టు తీస్తానన్నారు? రోజా సంచలన ట్వీట్గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Basara IIIT: బాసర ట్రిపుల్ల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
బాసర ట్రిపుల్ల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
SEO Poisoning: గూగుల్ సెర్చ్‌లో కూడా స్కామ్ - మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సైబర్ కేటుగాళ్లు!
గూగుల్ సెర్చ్‌లో కూడా స్కామ్ - మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సైబర్ కేటుగాళ్లు!
Minister Atchennaidu: 'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
SSMB29 Budget: మహేష్ - రాజమౌళి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ @ 2000 కోట్లు - తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
మహేష్ - రాజమౌళి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ @ 2000 కోట్లు - తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
CJI Justice Sanjiv Khanna: సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం
సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం
YS Sharmila: 'అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది' - మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
'అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది' - మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
Embed widget