Satyabhama Serial Today March 8th: సత్యభామ సీరియల్: ఒక్కటైపోయిన ఫ్యామిలీ.. అభిమానుల క్రిత్యకి శుభం కార్డు!
Satyabhama Today Episode సంజయ్ మహదేవయ్యని చంపాలి అనుకోవడం క్రిష్ కాపాడటం అందరూ సంతోషంగా కలిసిపోవడం ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today March 1st Episode క్రిష్ కన్న తల్లిని మహదేవయ్య చంపాడని తెలిసి క్రిష్ ఆవేశంగా బాపు దగ్గరకు వెళ్తాడు. ఎంత కోపం వచ్చినా నిన్ను చంపే అంత కోపం రావడం లేదు. నేను పుట్టిన తర్వాత నా ప్రేమ నువ్వు నా నమ్మకం నువ్వు నాకు చచ్చిపోవాలి అనిపిస్తుంది నన్ను చంపేయ్ బాపు అని అంటాడు. దాంతో మహదేవయ్య ఏడుస్తూ పోరా అని క్రిష్ని అంటాడు.
క్రిష్: నన్ను నమ్ము బాపు నువ్వు నన్ను ఎంత ద్రోహం చేసినా ఎప్పటికీ నా మనసులో బాపు స్థానం నీదే. ఎందుకు అని అడగకు కారణం చెప్పలేను. కానీ ఒక్కటి బాపు నీకు నన్ను చంపాలి అనిపించినప్పుడు ఒక్క ఫోన్ కొట్ట వచ్చి సంతోషంగా నీ ముందు నిల్చొని నా ప్రాణం ఇస్తా. అని ఏడుస్తూ వెళ్లిపోతాడు. నా బ్రేస్‌లేట్ ఏమైపోయింది నా చేతికే ఉండాలి కదా. (మహదేవయ్య తనకు పెట్టి తనలా భద్రంగా చూసుకోమని అంటాడు. అది నీ చేతికి ఉంటే నేను నీతో ఉన్నట్లే అది లేకపోతే నేను నీకు దూరం అయినట్లే అని అంటాడు) క్రిష్ బ్రేస్లెట్ కోసం తిరిగి ఇంటికి వెళ్తాడు.
మహదేవయ్య: అరే సంజయ్ చూడరా వాడు ఏమంటున్నాడో నన్ను చంపే అంత కోపం లేదంట నా చేతిలో చచ్చే అంత ప్రేమ ఉందంట. కన్నతల్లిని చంపినోడికి ప్రాణ భిక్ష పెట్టాడు. ఎందుకురా నేను అంటే వాడికి అంత పిచ్చి. నువ్వు నా కన్న కొడుకువే అయినా వాడు నా చిన్నా గాడు కన్నకొడుకు కంటే గొప్పగా అనిపిస్తున్నాడు. తప్పు చేశానురా. వాడిని ఇంట్లో నుంచి తరిమేసి తప్పు చేశాను. ఓడిపోయానురా వాడి ప్రేమ ముందు నేను నా మొండితనం నా రాక్షసత్వం ఓడిపోయింది. నాకు వాడు కావాలి నా చిన్నా నాకు కావాలి. నీకు కూడా వాడి మీద కోపం ఉంటే తీసేయ్‌రా వాడు మంచోడు. పోయి వాడిని తీసుకురా. వాడి కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతా.
సంజయ్: నువ్వు అనేది ఏంటి డాడ్ నీ కొడుకు కాని కొడుకు కోసం నా స్థానాన్ని త్యాగం చేయమంటావ్ అంతే కదా సరే తప్పకుండా చేస్తా హ్యాపీగా ఒప్పుకుంటా కాకపోతే ఒక్క కండీషన్.
మహదేవయ్య: చెప్పరా చిన్నాగాడి కోసం ఏమైనా చేస్తా.
సంజయ్: నా కోసం ఒక్క త్యాగం చేయ్. నీ ప్రాణత్యాగం అని కత్తి తీస్తాడు. అవును నాకు నీ ప్రాణం కావాలి. అసలు రుద్రని జైలుకి పంపింది ఎవరో తెలుసా నేనే. కాళ్లకి అడ్డం అని ఆ చిన్నా గాడిని తరిమేశా. నిన్ను అయినా వదులుకుంటాను కానీ నాఈ కోటని వదులుకోను. అందుకే ప్లీజ్ డాడ్ చచ్చిపో. నా స్వార్థం కోసం చచ్చిపో అని చంపడానికి మీద పడతాడు.
మహదేవయ్య ఎంత బతిమాలినా వినడు. ఇక భైరవి వాళ్లు ఇంటికి వస్తుంటారు. మహదేవయ్య ఎంత చెప్పినా వినకుండా పొడవడానికి రెడీ అవుతాడు. ఇంతలో క్రిష్ వచ్చి మహదేవయ్యకు అడ్డు నిలబడతాడు. సంజయ్ చేయి పడతాడు. నీకు నా చేతిలో చావు రాసి ఉందిరా బాపు వరకు పోవాలి అంటే నన్ను చంపాలి అంటాడు. ఇక క్రిష్ సంజయ్‌ని కొడతాడు. ఇక మహదేవయ్య దగ్గరకు వెళ్లి నీ కొడుకుని కొట్టినందుకు క్షమాపణ అడుగుతాడు. మళ్లీ సంజయ్ పొడవడానికి వస్తే మహదేవయ్య సంజయ్‌ని తంటాడు. క్రిష్‌ని ఏం చేయాలో తెలుసు కదా చేయ్ అంటే క్రిష్ సంజయ్‌ని కొడతాడు. ఇక సత్య, సంధ్యలు అక్కడికి వస్తారు. భైరవి వాళ్లు కూడా వస్తారు. భైరవి వచ్చి సంపేయ్‌రా అని అంటుంది. బుద్ధి లేకుండా వాడి మాట విని తప్పు చేశానని నిన్ను చంపబోయాను వాడిని పోలీసులకు అప్పగిద్దామని భైరవి అంటుంది.
క్రిష్ వద్దనింటే బామ్మ, సంధ్యలు అత్తయ్యకి అడ్డు పడొద్దని అంటుంది. భైరవి కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తాడు. సంజయ్ ఆపి సత్య చెప్పిన నీతి చెప్తాడు. చంపుకుంటూ పోతే మనకు ఎవరూ ఉండరు అని చెప్తాడు. మహదేవయ్య కూడా తన తప్పుని ఒప్పుకుంటాడు. సత్య బతిమాలినా వినలేదని సత్యని అవమానించానని అంటాడు. నా తమ్ముడి కొడుకు కదా మర్చిపోయా నా తమ్ముడి కొడుకు అని ఏడుస్తాడు. మీ నాన్న అదృష్టవంతుడురా అని వచ్చే జన్మలో వీడు మన కొడుకులా పుట్టాలని పూజలు చేద్దామని ఏడుస్తాడు. నన్ను మీ తమ్ముడిని ఇచ్చేస్తావా అని క్రిష్ ఏడుస్తాడు. ఇద్దరూ నువ్వు రాలేదు అంటే నువ్వు రాలేదు అని ఏడుస్తారు. ఇద్దరి మాటలకు అందరూ నవ్వుకుంటారు. నువ్వు లేకపోతే నేను బతకలేను అని ఇద్దరూ అనుకొని హగ్ చేసుకొని ఏడుస్తారు.
సత్య కాళ్లకి దండం పెడతానని మహదేవయ్య అంటే భైరవి కూడా సత్యని పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. మొత్తానికి అందరూ సంతోషంగా కలిసిపోతారు. సత్య కూడా క్షమాపణ చెప్పుకుంటుంది. అందరూ సరదాగా నవ్వుకుంటారు. ఎవరూ సంజయ్‌ని పట్టించుకోరు. నా సంగతి తేల్చండి అని అంటాడు. క్రిష్ ఆస్తి మొత్తం సంజయ్‌కి ఇచ్చేయ్‌మని అమ్మానాన్నలు నాకు వదిలేయ్ అంటాడు. దానికి సంజయ్ నాకు ఆస్తి వద్దు అమ్మానాన్నలు కావాలి అని అంటాడు. సత్యకి క్షమాపణ చెప్తాడు. సంధ్యని మంచిగా చూసుకుంటా అంటాడు. సీరియల్‌కి శుభం కార్డు పడిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

