Satyabhama Serial Today February 8th: సత్యభామ సీరియల్: మహాదేవయ్య మాస్టర్ ప్లాన్.. కశ్మీర్‌కి హనీమూన్.. ప్రాణాలు తోడేస్తున్నారని సత్య వెక్కి వెక్కి ఏడుపు!
Satyabhama Today Episode సత్య చిన్నమామకి కాల్ చేసి సంజయ్ పెళ్లి గురించి చెప్పి వెంటనే ఇంటికి రమ్మని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సంధ్య పెళ్లి తల్లిదండ్రుల మీద సంధ్య పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం అన్నీ గుర్తు చేసుకొని హర్ష బాధ పడుతుంటాడు. నందిని వచ్చి హర్ష దగ్గర కూర్చొంటే హర్ష థ్యాంక్స్ చెప్తాడు. తన చెల్లి తల్లిదండ్రులను ఇబ్బంది పడుతుంటే నువ్వు కొతురిలా మారినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. ఇప్పటి వరకు నా కోపం చూశావ్ ఇక నా ప్రేమ కూడా చూస్తావ్ మన హ్యాపీ లైఫ్‌లోకి ఇంకెవరూ రారు. నువ్వు నేను అంతే అని హర్ష నందినిని దగ్గరకు తీసుకుంటాడు.
ఇంతలో మైత్రి హర్ష ఫొటో చూస్తూ నేనున్నా కదా హర్ష నీ లైఫ్లోకి రావడానికి ఎప్పటికీ నేనే భార్య నువ్వు నా భర్త అని అంటాడు. మైత్రి ఫ్రెండ్ మైత్రితో నిన్ను వదిలేసి వాడు నెల అయింది ఫోన్ కూడా చేయొద్దు అనేశాడు. ఎవరూ ఇంటికి కూడా రావొద్దని అనేశారు. సంధ్య వాళ్లని కాదని పెళ్లి చేసుకుంది కాబట్టి ఇదే ఆ ఇంటికి వెళ్లడానికి మంచి ఛాన్స్ అని అంటుంది. ఇ సారి హర్షని తన గుప్పెట్లో పెట్టుకుంటానని అంటుంది. మరోవైపు సంజయ్, సంధ్య ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయిందని మాట్లాడుకుంటారు.
సంజయ్: ఈ పాటికి పూల పాన్పు మీద ముచ్చట్లు చెప్పుకునే వాళ్లం. కానీ ఇలా ఆకలితో ఉండాల్సి వస్తుంది. మా గ్రానీకి మనసే లేదు. చూసి చూడనట్లు వదిలేయొచ్చు కదా.
సంధ్య: అడ్డం పడింది బామ్మ కాదు మా చండీరాణి మా అక్క. నీకు ఇంకా అనుమానం రాలేదా. నాకు తెలిసిపోయింది.
సంజయ్: ఆపించింది మీ అక్క అన్నమాట.
సంధ్య: బామ్మ ఆపుంటే బంతి ఆట దగ్గర ఆపేది మరి గదిలోకి వెళ్లినప్పుడు ఆపింది. ఈ లోపు ఏదో ఒక శక్తి మనల్ని ఆపాలని ప్రయత్నిస్తుందని ఆలోచిస్తుంది.
మహదేవయ్య: శోభనం ఆగిపోయిందని బాధ పడకండి బామ్మ మంచి ముహూర్తం పెడుతుంది. నా నుంచి మీకు ఓ సర్‌ఫ్రైజ్ కాశ్మీర్‌కి ఫస్ట్‌నైట్ టికెట్స్ ఇస్తున్నా. మూడు రోజుల్లో ప్రయాణం వారం రోజులు ఎంజాయ్ చేసుకోండి.
సంజయ్: థ్యాంక్యూ బిగ్ డాడ్. ఈ విషయం పెద్దమ్మకి చెప్తా.
మహదేవయ్య: ఏంటి కోడలు కాని కోడలా నా ప్లాన్స్ అన్నీ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయ్. నువ్వే చూసుకో చెల్లి కావాలా. ఎలక్షన్స్ కావాలా.
సత్య: సమస్య మీద సమస్య వస్తుంది ఏం చేయాలి. సంధ్య అసలు నా మాట వినడం లేదు. ఏం చేయాలి. చక్రవర్తికి కాల్ చేసి.. అసలేమైపోయారు చిన్నమామయ్య. సన్యాసంలో కలిసిపోయారా.
చక్రి: ఏమైందమ్మా ఎందుకు ఆవేశపడుతున్నావ్.
సత్య: పొడుకుతింటున్నారు మామయ్య అందరూ తలో వైపు నరకం చూపిస్తున్నారు. సంజయ్ పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలుసా. మీరు అసలు సంజయ్‌తో టచ్‌లో ఉండరా. కన్న కొడుకుని వదిలేశారు. పెంచిన కొడుకుని పట్టించుకోరా. ఆ దరిద్రుడు సంజయ్ నా చెల్లిని నా మీద కోపంతో ట్రాప్ చేశాడు. సంధ్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. సంధ్యని నరకం చూపిస్తామని నాతో సంజయ్ ఛాలెంజ్ చేశాడు. మూడు రోజుల్లో ఎలక్షన్ విత్ డ్రా చేసుకోకపోతే చంపేస్తారు.
చక్రి: ఓ మై గాడ్ అయినా సంజయ్ ఫారెన్లో ఉన్నప్పుడు రూప అనే అమ్మాయిని ప్రేమించా పెళ్లి చేసుకుంటా అని నాతో చెప్పాడు. ఇప్పుడు ఈ పెళ్లి ఏంటి.
సత్య: నన్ను నరకం చూపించడమే ఆ తండ్రీ కొడుకుల టార్గెట్. చిన్న మామయ్య మీరు వెంటనే ఇక్కడికి వచ్చేయండి. విషయం తేల్చేద్దాం.
చక్రి: భయపడకమ్మా రేపు వచ్చేస్తా.
క్రిష్: బాబాయ్‌కి ఎందుకు కాల్ చేశావు. ఇప్పుడు సంధ్యకి ఏం ప్రాబ్లమ్ ఉంది. ఎందుకు కావాలనే ఇష్యూ చేస్తున్నావ్.
సత్య: ఇష్యూ ఉందో లేదో నాకు మాత్రమే తెలుసు.
సంధ్య: సంధ్య చెప్పిందే నిజం నువ్వు ఆమె మీద ద్వేషం పెంచుకున్నావ్.
సత్య: అవును ద్వేషం పెంచుకున్నా. మీకు పైకి కనిపిస్తుందే తెలుసు మనసు ఏం తెలుసు. సంధ్య అంటే నాకు ప్రాణం. నిజంగా సంధ్య అంటే నాకు ద్వేషం ఉంటే దాన్ని వదిలేసుండేదాన్ని. సంజయ్ మైకంలో పడి అది నన్ను అపార్థం చేసుకుంటుంది. నువ్వు కూడా నన్ను నమ్మడం లేదు అని ఏడుస్తుంది.
క్రిష్: సారీ సంపంగి ఆవేశంలో అనేశా.
సత్య పూజ చేస్తుంటే సంధ్య పళ్లెం తీసుకొని పూజకు వస్తుంది. సంధ్య కోపంగా సత్యని చూస్తుంది. సంధ్య పూజ చేయడానికి వెళ్తుంటే సత్య సంధ్యతో రోజు పూజ చేసేది నేను అని అంటుంది. దాంతో సంధ్య ఇక ముందు నేను చేస్తానని అంటుంది. పెద్ద దాన్ని నేను అంటే దేవుడి ముందు అందరూ సమానమే అంటుంది. భైరవి, జయమ్మ అక్కాచెల్లెళ్ల పంచాయితీ చూస్తారు. సత్య అడ్డుకుంటుంటే సంధ్య అత్తయ్యని పిలుస్తుంది. నేను ఈ ఇంటి కోడలినే కదా అంటే భైరవి ఎవరైనా కాదు అన్నారా అంటే దేవుడి పూజ చేయకూడదా అని అంటే హ్యాపీగా చేసుకో అంటుంది. బామ్మ సత్య దగ్గర నేర్చుకో అంటే నాకు అవసరం లేదు నేను చేస్తా అంటుంది. సంధ్య పూజ చేస్తుంటే సత్య చూస్తూ ఉండిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: ఫస్ట్ నైట్ ఆటల్లో సత్యకి అవమానం.. చివరి నిమిషంలో మెలిక.. సంజయ్ ఆశలు అడియాసలేనా!





















