అరటిపండును రాత్రుళ్లు తినాలా వద్దా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఇది తినడం మంచిదా? కాదా?

అరటిపండులోని సిరోటోనిన్, న్యూరోట్రాన్స్​మిట్టర్ నిద్రను మెరుగుపరుస్తుంది.

బనానాలోని పొటాషియం, మినరల్స్ కండరాలకు విశ్రాంతిని అందిస్తుంది. నొప్పులను దూరం చేస్తుంది.

దీనిలోని ప్రోబయోటిక్ ఫైబర్స్ హెల్తీ గట్​ని ప్రమోట్ చేయడంతో పాటు.. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

అరటిపండు రాత్రి తింటే ఎన్ని లాభాలున్నాయో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయి.

అరటిపండును రాత్రులు తింటే కొందరిలో జీర్ణ సమస్యలు పెరుగుతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం పెరగవచ్చు.

బనానాలోని సహజమైన చక్కెరలు.. రక్తంలోని షుగర్ లెవెల్స్​ని పెంచే అవకాశముంది.

రాత్రుళ్లు అరటిపండు తింటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మీరు రాత్రి సమయంలో బనానా తినాలనుకుంటే.. ఒకటి లేదా రెండు తినొచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.