Satyabhama Serial Today February 21st: సత్యభామ సీరియల్: క్రిష్‌ని చీదరించుకొని దారుణంగా అవమానించిన తల్లి.. మైత్రి నిజస్వరూపం తెలుసుకున్న హర్ష!
Satyabhama Today Episode నర్శింహని చంపింది రుద్ర అని తెలుసుకున్న క్రిష్ అన్నతో గొడవ పడటం భైరవి క్రిష్‌ని దారుణంగా అవమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode క్రిష్ తనని పాత క్రిష్‌లా వదిలేయ్ మారడానికి ప్రయత్నిస్తుంటే అందరూ చేతకాని వాడిలా చూస్తున్నారని తల్లి మాటలకు ఏడుస్తాడు. సత్య క్రిష్‌తో ఈ ఇంట్లో ఎవరూ మారరు. నువ్వు మారుతున్నావ్ నీ మార్పు నాకు అవసరం క్రిష్ అని అంటుంది. అన్నీ వదిలేయ్ అంటుంది. మీ అమ్మ ఈసారి నువ్వు నా కొడుకు కాదు అంటే అవును కాదు అనేయ్ ఇంకెప్పుడూ బాధ పెట్టరు అని సత్య చెప్తుంది. సత్య క్రిష్‌ని నవ్వించడానికి క్రిష్ చేయి పట్టుకొని ముద్దు పెట్టి హగ్ చేసుకుంటుంది. క్రిష్‌ని నవ్వించేస్తుంది. దాంతో క్రిష్ సత్యని ముద్దు పెట్టి దగ్గరకు తీసుకుంటాడు.
మరోవైపు హర్ష ఉదయం లేచేసరికి మైత్రి పక్కన పడుకుంటాడు. లేచి చూసి ఇక్కడ ఉన్నానేంటి అనుకొని షర్ట్ వేసుకుంటాడు. మైత్రి లేచి హర్షతో మన ఫస్ట్‌నైట్ అయిపోయిందని అంటుంది. అలా జరగడానికి వీల్లేదని హర్ష అంటాడు. జరిగింది అని మైత్రి అంటుంది. కావాలనే అంతా చేసినట్లు చెప్తుంది. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి, కవ్వించి తొలిరేయి జరుపుకున్నామని అంటే హర్ష ఫ్యూజులు ఎగిరిపోతాయి.
హర్ష: ఫారెన్‌కి వెళ్తావు కదా నాతో ఇలా ఏంటి.
మైత్రి: ఎవరు ఫారెన్‌కి వెళ్తారు. నిన్ను విడిచి నేను ఎక్కడికీ వెళ్లను. నువ్వు నన్ను అద్భుతంగా ప్రేమించేసి నా మనసు మొత్తం నీ ప్రేమతో నింపేసి ఆ తర్వాత నువ్వు నీ అవసరానికి వేరే వాళ్లని పెళ్లి చేసుకుంటే నీ సుఖమే నేను కోరుకుంటా అనుకున్నావా. ఇన్ని రోజులు నీ మనసు మారుతుందని ఎదురు చూశా కానీ ఆ నందిని రానివ్వదు అని అర్థం అయింది. అందుకే ఇలా మోసం చేసి అయినా దక్కించుకోవాలి అనుకుంటున్నా.
హర్ష: నువ్వు మంచిదానివి అనుకున్నా. నాకు పెళ్లి అయింది భార్య ఉంది.
మైత్రి: దానికి వదిలేసి వచ్చేయ్.
హర్ష: ఎప్పటికీ నందినినే నా భార్య
మైత్రి: నందినికి మన ఫస్ట్‌నైట్ విషయం చెప్తే.. ఇక అంతే. మనం పెళ్లి చేసుకొని సంతోషంగా కాపురం చేద్దాం. చూడు హర్ష నీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయ్. నందినికి నేను నిజం చెప్తే తానే నీకు విడాకులు ఇస్తుంది. లేదంటే నువ్వు తను ఇష్టం లేదని చెప్పి దానికి విడాకులు ఇవ్వు.
హర్ష: నీ మాటలకు లొంగిపోను ఏం చేసుకుంటావో చేసుకో. నీ లాంటి దానికి నువ్వు ఎప్పుడూ దక్కను.
మైత్రి: నీ అంతట నువ్వే తిరిగి పరుగెత్తుకుంటూ వచ్చేలా చేస్తాను.
సంజయ్ క్రిష్‌ని దెబ్బ తీయడం కోసం తన ఫ్రెండ్‌కి కాల్ చేసి క్రిష్ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి నర్శింహని చంపింది రుద్రప్రతాప్‌నే అని చెప్పమని సాక్ష్యాలతో సహా చెప్పిస్తాడు. దాంతో క్రిష్ ఫ్రెండ్ క్రిష్‌కి ఫోన్ చేసి నర్శింహని చంపింది మీ అన్నే అన్న నిన్ను ఇరికించాడని చెప్తాడు దాంతో క్రిష్ ఆవేశంతో రుద్ర దగ్గరకు వెళ్లి నన్నే ఇరికిస్తావా నన్నే మోసం చేస్తావా. అని అన్నని కొడుతాడు. అన్నాదమ్ముళ్లు ఇద్దరూ కొట్టుకుంటారు. అందరూ ఆపడానికి ప్రయత్నించినా క్రిష్ అరుస్తాడు. నేనేం తప్పు చేశానని అంటే నర్శింహని అన్న చంపి నన్ను ఇరికించాడని చెప్తాడు.
రుద్ర: అవునురా నేనే చంపా. అయితే ఏంటి.
క్రిష్: ఎందుకు చంపావురా.
రుద్ర: నువ్వు చేయని పని నేను చేశాను.
క్రిష్: ఆ హత్య నేను చేశానని సత్య నన్ను నిలదీసింది. ఇంటి నుంచి వెళ్లిపోవాలి అనుకుంది. కానీ అప్పుడు ఎందుకు చెప్పలేదు. సత్య వెళ్లిపోయింటే నా కాపురం పోయేది కదా. నష్టం నాకే కదా.
రుద్ర: నీకేం జరిగితే నాకు ఏంట్రా.
క్రిష్: ఎంత స్వార్థంరా నీకు అని క్రిష్ అన్నని కొడతాడు.
సంజయ్: అమ్మా వెళ్లి ఆపు.
భైరవి: నేను పోనురా..
సంజయ్: వెళ్లు..
భైరవి: చిన్నా ఆగరా అని కొడతుంది.
క్రిష్: నన్ను కొట్టావా.
భైరవి: అవునురా పెద్దా చిన్నా అని తేడా అన్న మీదకు ఎగబడుతున్నావేంట్రా. నేను కాబట్టి కొట్టాను మీ బాపు అయితే మెడ పట్టి గెంటేసేవాడు.
క్రిష్: తప్పు చేసింది వాడమ్మా.
భైరవి: వాడు తప్పు చేయలేదురా. నువ్వు చేసిన తప్పు సరిదిద్దాడు. వాడిని చంపలేక వచ్చావ్. ఇక నువ్వు బయటకు పోకురా మా లెక్క గాజులు వేసుకొని ఇంట్లోనే కూర్చొ. బాపు మీద ఎవడో చేయి వేస్తే చంపకుండా వదిలేస్తాడా. దెబ్బకి దెబ్బ కొట్టకపోతే నా పెనిమిటి ఇజ్జత్ పోయినట్లే కదా.
రుద్ర: ఇలా చేస్తాడు అని అనుమానం వచ్చే బాపు నన్నుపంపాడు.
భైరవి: నర్శింహని చంపి నా పెద్ద కొడుకు పరువు నిలబెట్టాడు. నీ ప్రతాపం ఇంట్లో వాళ్ల మీదనా ఛీ.
సత్య: అత్తయ్య గారు అలా చీదరించుకొని మాట్లాడటం పద్ధతి కాదు. కాసేపు మీ పెద్ద కొడుకు చేసింది మంచిదే అనుకుందాం. మని ధైర్యంగా క్రిష్‌ముందే చంపొచ్చు కదా. తిరిగి వచ్చాక అయినా చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు. ఎందుకు అంటే పొరపాటున అటు ఇటు అయితే క్రిష్‌ని ఇరికిద్దామని ఆలోచన అంతే కదా బావగారు.
భైరవి: నీ భర్తని కాపాడుకోవడానికి రుద్ర మీద నిందలు వేస్తున్నావా. ఈ ఇంట్లో నా పెనిమిటితో సహా అందరికీ చిన్నా గాడి మీద నమ్మకం పోయింది. తీసుకోపో వాడిని గదిలోకి తీసుకెళ్లి గ్లాసుడు పాలు తాగించి పడుకో పెట్టు ఛీ..
తల్లి మాటలకు క్రిష్ కుప్పకూలిపోతాడు. సత్య పట్టుకుంటుంది. హర్ష ఇంటికి వస్తాడు. ఇంట్లో అడుగుపెట్టకుండా ఆగిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!





















