Sandigdham Movie: 'సందిగ్ధం'లో ఎంత మంది ఆర్టిస్టులున్నారో చూశారా? జబర్దస్త్ నుంచి ఎవరెవరున్నారంటే?
Sandigdham Release Date: ఒక్కోసారి చిన్న సినిమాల్లో ప్యాడింగ్, క్యారెక్టర్ ఆరిస్టుల లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిన పరిస్థితి. ఈ నెలలో విడుదలైన 'సందిగ్ధం'లోనూ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు.

కొన్ని సినిమాలు లిమిటెడ్ పాత్రలతో తెరకెక్కిస్తుంటారు. ఒక పాత్ర, రెండు పాత్రలు, మూడు పాత్రలతో సినిమాలెన్నో వచ్చాయి. పదుల సంఖ్యలో ఆర్టిస్టుల్ని పెట్టి కామెడీ చిత్రాలెన్నో తీసిన లెజెండరీ దర్శకులున్నారు. ఇక 'సందిగ్ధం' అంటూ మే నెలలో రాబోతోన్న ఈ మూవీలో చాలా మంది ఆర్టిస్టులు నటించారు. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి, జీవా కొచెర్ల, నవీన్ రాజ్ సంకరపు, చిట్టి బాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగిరెడ్డి, శ్రీదేవీ, దుర్గ, లక్ష్మీ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
జబర్దస్త్ షో నుంచి అప్పారావు, రైజింగ్ రాజు వంటి వారు ఈ సినిమాలో నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'సందిగ్ధం' మే 29న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఇక ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా టీం కంప్లీట్ చేసింది. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టిన చిత్రయూనిట్ త్వరలోనే సెన్సార్ వద్దకు వెళ్లనుంది.
Also Read: Trisha Krishnan - రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు మరో సినిమా... భారీ తమిళ మల్టీస్టారర్‌లో త్రిష?
ప్రస్తుతం 'సందిగ్ధం' సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. మే 29న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు టీం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇక మున్ముందు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేయనున్నారు. ఈ మూవీకి గౌతమ్ రవి రామ్ సంగీతాన్ని అందించారు. నందన్ కృష్ణ కెమెరామెన్‌గా, విశ్వన్ రాజ్. డిఎస్ ఎడిటర్‌గా పని చేశారు. అసలే సమ్మర్ సీజన్ అంతా కూడా డల్‌గా నడుస్తోంది. మరి సమ్మర్ సీజన్ ఎండింగ్‌లో వస్తోన్న ఈ సినిమా ఎలాంటి సౌండ్ చేస్తుందో చూడాలి.
Also Read: Sai Pallavi - సాయి పల్లవి సినిమా ఫ్లాపే... అంగీకరించిన హీరో
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు






















