అన్వేషించండి

Sai Pallavi: సాయి పల్లవి సినిమా ఫ్లాపే... అంగీకరించిన హీరో

Junaid Khan on Ek Din Flop: సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ 'ఏక్ దిన్' ఫ్లాప్ అని హీరో జునైద్ ఖాన్ అంగీకరించారు. అంతే కాదు... రిజల్ట్ తర్వాత ఆమిర్ ఖాన్ ఎంతో బాధ పడ్డారని పేర్కొన్నారు.

'ఏక్ దిన్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి సాయి పల్లవి (Sai Pallavi) ఇంట్రడ్యూస్ అయ్యారు. అయితే... బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిందీ ప్రేమ కథ. విడుదలకు ముందు బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ చేసిన ప్రచారం కారణంగా హైప్ వచ్చింది. కానీ, కలెక్షన్స్ రాలేదు. డిజాస్టర్ అనిపించుకుంది. ఇప్పుడీ ఫ్లాప్ మీద హీరో జునైద్ ఖాన్ స్పందించారు. 

సినిమా ఫ్లాపే... అంగీకరించిన హీరో!
'ఏక్ దిన్'లో సాయి పల్లవి హీరోయిన్ అయితే ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరో. బాక్స్ ఆఫీస్ బరిలో సినిమా ఘోరంగా ఫెయిల్ కావడంతో తన తండ్రి ఆమిర్ తీవ్రంగా ఆవేదన చెందినట్లు జునైద్ తెలిపారు.

''ఏక్ దిన్' ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆమిర్ ఖాన్ మానసికంగా చాలా కుంగిపోయారరు. ఏ సినిమా అయినా సరే, ముఖ్యంగా తనకు నచ్చిన సినిమా పరాజయం పాలైతే మా నాన్నగారు వ్యక్తిగతంగా తీసుకుంటారు. నా సినిమా ఫెయిల్యూర్ ఇప్పటికీ ఆయన్ను చాలా బాధ పెడుతోంది'' అని జునైద్ వివరించారు.

Also ReadTrisha Krishnan - రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు మరో సినిమా... భారీ తమిళ మల్టీస్టారర్‌లో త్రిష?

చిత్రసీమలో ఇన్నేళ్ల అనుభవం ఉన్నప్పటికీ... ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇప్పటికీ ఆమిర్ ఖాన్ కలత చెందుతారని, ఆ బాధ నుంచి బయట పడటం కోసం తనను తాను పనిలో నిమగ్నం అయ్యేలా చేస్తారని తెలిపారు. ఇక 'ఏక్ దిన్' ఫ్లాప్ గురించి జునైద్ ఖాన్ మాట్లాడుతూ... ''మా చిత్ర బృందం సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ఫలితం ఆశించినట్లు రాలేదు. వ్యక్తిగతంగా నాకు ఈ సినిమా చాలా ఇష్టం. ప్రేక్షకులలో కొందరికి నచ్చినప్పటికీ... మెజారిటీ జనాలను ఆకట్టుకోలేదు'' అని అంగీకరించారు.

Also ReadBollywood - విడాకుల దిశగా బాలీవుడ్ భామ... 'విశ్వంభర' ఐటమ్ సాంగ్ బ్యూటీ ఇచ్చిన హింట్ గమనించారా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aamir Khan Productions (@aamirkhanproductions)

'ఏక్ దిన్' చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించగా... ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. సినిమా ప్రీమియర్ షోలో ఆమిర్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అయ్యింది. థాయ్ సినిమా 'వన్ డే' (2016)కి ఇది రీమేక్. మే 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కేవలం కోటి రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో 5.44 కోట్ల రూపాయలు వసూలు చేసి, బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీనికి ముందు ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే'ను హిందీలో 'లవ్ యాపా'గా రీమేక్ చేశారు జునైద్. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

Also Read: OTT Malayalam Movie - ఓటీటీలోకి మలయాళ 'హనీమూన్'... ఈ నెలలోనే - స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్‌ డీటెయిల్స్ ఇవిగో

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget