Rashmi Gautam: రష్మీ గౌతమ్ అందుకు రెడీ అంటున్నా ఆపేస్తున్న 'జబర్దస్త్' టీమ్!
Jabardasth Latest Promo: 'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమోలో యాంకర్ రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన డ్రస్ సైజ్ గురించి ఆవిడ స్పందించారు. అసలు ఆవిడ ఏమంటున్నారో చూడండి.
Rashmi Dresses In Jabardasth: ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ రష్మీ గౌతమ్ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. 'ఎక్స్ట్రా జబర్దస్త్'ను రష్మీ కోసం చూసే ఆడియన్స్ వున్నారని చెబితే అతిశయోక్తి కాదు. రష్మీ కూడా వీలైనంత వరకు తన యాంకరింగ్, గ్లామర్ ద్వారా ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే... లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఆవిడ తన డ్రస్ సైజ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
రష్మీ డ్రస్ సైజ్ తగ్గించాలని డిమాండ్!
'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్'... ఇంతకు ముందు గురు, శుక్ర వారాల్లో రెండు రోజులు రెండు పేర్లతో షో టెలికాస్ట్ అయ్యేది. ఇప్పుడు 'ఎక్స్ట్రా' తీసేశారు. 'జబర్దస్త్' పేరుతో శుక్ర, శనివారాల్లో ప్రసారం చేస్తోంది ఈటీవీ. త్వరలో రాబోయే 'జబర్దస్త్'లో ఆటో రామ్ ప్రసాద్ ఒక స్కిట్ చేశాడు. 'ఎక్స్ట్రా' ఎందుకు తీసేశారు? మాకు 'ఎక్స్ట్రా జబర్దస్త్' మళ్లీ కావాలనేది ఆ స్కిట్ థీమ్. 'ఎక్స్ట్రా జబర్దస్త్' కోసం కొంత మంది ధర్నా చేస్తున్నట్టు చూపించారు.
స్టేజి మీద స్కిట్ (Auto Ram Prasad Skit)లో భాగంగా కొందరు ప్లకార్డ్స్ పట్టుకుని కనిపించరు. అందులో ఓ ప్లకార్డు మీద 'రష్మీ డ్రెస్ సైజ్ తగ్గించాలి' అని రాసి ఉంది. జడ్జి కృష్ణ భగవాన్ అది గమనించారు. 'ఆ బోర్డు ఏంటి? ఎక్స్ట్రా గురించి కాదు. రష్మీ డ్రెస్ తగ్గించాలంట' అని చెప్పారు. అప్పుడు రష్మీ గౌతమ్ ఏం చెప్పారో తెలుసా?
''నేను కూడా అదే (డ్రస్ సైజ్ తాగించాలని) చెబుతున్నాను. కానీ, వీళ్ళే ఆపుతున్నారు'' అని రష్మీ గౌతమ్ అమాయకంగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. వీళ్ళే అంటే ఎవరో మరి? జబర్దస్త్ షో ప్రొడ్యూసర్లు, ఈటీవీ యాజమాన్యం అందాల ప్రదర్శనకు, అంటే డ్రస్ సైజ్ తగ్గించడానికి నో చెప్పారని ఆవిడ చెప్పిన మాటలను బట్టి అనుకోవాలి. అయితే, రష్మీ గౌతమ్ ఆ మాటలు చెప్పిన తర్వాత 'సంప్రదాయని సుద్దపూసని' సాంగ్ నేపథ్యంలో వినిపించింది.
'జబర్దస్త్' పేరు మాత్రమే కాదు... షో ఫార్మటు కూడా మారిందని లేటెస్ట్ ప్రోమో బట్టి అర్థం అవుతోంది. ప్రజెంట్ ఆరు టీమ్స్ మాత్రమే ఉన్నాయి. కొన్ని టీమ్స్ తీసేసి కమెడియన్లను ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు షిఫ్ట్ చేశారు. స్కిట్స్ చేసే టీమ్స్ మధ్య కాంపిటీషన్ పెట్టారు. రెండు రోజులకు కలిపి శనివారం విజేతను అనౌన్స్ చేసే ఛాన్సులు కనపడుతున్నాయి. 'జబర్దస్త్'కు రష్మీ గౌతమ్ యాంకర్ కాగా... ఖుష్బూ, కృష్ణ భగవాన్ జడ్జీలు. 'జబర్దస్త్;కు జడ్జిగా చేసిన ఇంద్రజకు షార్ట్ గ్యాప్ ఇచ్చారు. సిరి హన్మంత్ సైతం యాంకర్ ప్లేస్ కోల్పోయింది.
Also Read: పవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా