By: ABP Desam | Updated at : 06 Apr 2023 10:12 AM (IST)
Edited By: anjibabuchittimalla
జీవిత, రాజశేఖర్ (Photo Credit: etvteluguindia/YouTube)
డాక్టర్ రాజశేఖర్, జీవిత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. హీరో, హీరోయిన్లుగా కెరీర్ మొదలు పెట్టి, ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ మొదలై, పెళ్లి వరకు వెళ్లింది. అయితే, తమ ప్రేమ ప్రయాణంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయట. తాజాగా వెన్నెల కిషోర్ హోస్టుగా చేస్తున్న ‘అలా మొదలయ్యింది’ షోలో డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులు పాల్గొన్నారు. తమ సినిమా కెరీర్ తో పాటు, ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మీ ప్రేమ ప్రయాణం ఎలా మొదలయ్యింది? అనే వెన్నెల కిషోర్ ప్రశ్నకు, రాజశేఖర్ ఆసక్తికర విషయం చెప్పారు. 25 ఏళ్ల క్రితం అడగాల్సిన ప్రశ్నను ఇప్పుడు అడుగుతున్నావని రాజశేఖర్ చెప్పడంతో షోలో నవ్వులు వెల్లివిరస్తాయి. వాస్తవానికి రెండో సినిమానో, మూడో సినిమానో జీవితతో కలిసి చేయాల్సి ఉండేదని చెప్పారు. కానీ, కొన్ని కారణాలతో చేయలేకపోయానని జీవిత చెప్పింది. కొన్ని రీజన్స్ ఏవో కాదని అసలు విషయం చెప్పారు రాజశేఖర్. హీరోయిన్ బాగాలేదు మార్చాలని కోరానన్నారు. అయితే, మరుసటి రోజు పేపర్ లో హీరోను మార్చేశారని వార్త వచ్చిందన్నారు. మీరిద్దరు ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకోవాలని వెన్నెల కిశోర్ కోరవడంతో, నేను చేస్తే బెటర్, తను చేస్తే పారిపోతాం అని రాజశేఖర్ నవ్వించారు.
ఇక సెకెండ్ రౌండ్ కు వెళ్దాం సర్ అని వెన్నెల కిషోర్ అనగానే.. ‘‘ఇంకా ఫస్ట్ రౌండే ఇవ్వలేదు. అప్పుడే సెకెండ్ రౌండా?’’ అని రాజశేఖర్ అనడంతో మళ్లీ నవ్వులే నవ్వులు. తాము ప్రేమలో పడ్డప్పుడు రాఘవేంద్ర రావు తనను తిట్టారని జీవిత చెప్పారు. ‘‘రాజశేఖర్ విలన్ లా ఉన్నాడు. నమ్మకు’’ అన్నారట. ఇక తన ప్రేమ కోసం జీవిత ఓ షాకింక్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు రాజశేఖర్. బ్రిడ్జి మీది నుంచి తనను కిందికి తోసేసినట్లు చెప్పారు. ఆ తర్వాత తనను హాస్పిటల్లో చేర్పించి, దగ్గరుండి సేవలు చేసి మా పేరెంట్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేసిందని చెప్పారు.
ఇక షోలో రాజశేఖర్ జీవితకు గులాబీ మొక్కను ఇస్తూ లవ్ ప్రపోజ్ చేస్తారు. ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. రాజశేఖర్, జీవిత ఒకరికొకరు ముద్దు పెట్టుకున్నారు. ఈ ప్రోగ్రామ్ చూసి తమ ఇద్దరు పిల్లలు తిట్టుకుంటారని చెప్పారు రాజశేఖర్. ఆ షోలో ఆ లవ్ ప్రపోజ్ లు ఏంటని చీవాట్లు పెట్టడం ఖాయం అన్నారు. ఒకానొక సమయంలో తనను కాదని, మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాజశేఖర్ భావించారని చెప్పారు జీవిత. అప్పుడు తనకు ఎంతో ఏడుపు వచ్చింన్నారు. ఎప్పుడు తన పక్కనే కారులో కూర్చునేదని, ఆ అమ్మాయి రావడంతో వెనుక సీట్లో కూర్చున్నాని చెప్పారు. ఆ తర్వాత రాజశేఖర్ దగ్గరికి వెళ్లి, పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదు, నీతోనే ఉంటానని చెప్పిందట. చివరకు తన ప్రేమను దక్కించుకున్నాను అని జీవిత వెల్లడించింది. ఇక ఈ పూర్తి షో ఏప్రిల్ 11న ప్రసారం కానుంది.
Punch Prasad: ‘జబర్దస్త్’ పంచ్ ప్రసాద్కు ఏమైంది? రెండు కిడ్నీలు పాడవ్వడానికి కారణం అదేనా?
‘విమానం’ ఎలా ఉంది? అనసూయను తిట్టిస్తున్న విజయ్? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం
Punch Prasad Health: 'జబర్దస్త్' ప్రసాద్కు ఏపీ సర్కారు అండ, కిడ్నీ మార్పిడి కోసం ఆర్థికసాయం
Kevvu Karthik Marriage: కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి - హాజరైన పలువురు సెలబ్రెటీలు
Gruhalakshmi June 9th: రాజ్యలక్ష్మి మాటకి తలొంచిన దివ్య- లాస్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన భాగ్య
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్