Prema Entha Madhuram October 19th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ప్రాణత్యాగం చేసిన సూర్య కోసం అతని ఇంటికి వెళ్లిన ఆర్య - అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారుగా!
సూర్య కుటుంబం కోసం ఆర్య ఊహించని నిర్ణయం తీసుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema entha madhuram October 19th: సూర్య చనిపోయినందుకు ఆర్య ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు సుగుణ వేయి కనులతో తన కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది.
ఇంతలో అను, సుగుణ కి ఫోన్ చేస్తుంది.
అను: హలో నేను రాధని మాట్లాడుతున్నాను.
ఉష: రాధ గారు నేను ఉషాని.
అను: ఉష. ఆంటీ ఎలాగున్నారు? భోజనం చేశారా?
ఉష: లేదు రాధ గారు. అన్నయ్య ఎప్పుడు వస్తాడా అని భోజనం కూడా మానేసి అన్నయ్య కోసమే ఎదురు చూస్తుంది అమ్మ.
అను: ఒకసారి ఆంటీ కి ఫోన్ ఇవ్వు అని అనగా ఉష సుగుణ కి ఫోన్ ఇస్తుంది.
అను: ఏంటి ఆంటీ మీరు భోజనాలు మానేసి కొడుకు కోసం ఎదురు చూడటం ఏంటి?
సుగుణ: ఈ టైంకి వచ్చేయాలమ్మ ఇంకా రాలేదు.
అను: పని అంటే వాళ్ళు లేట్ చేస్తారు ఆంటీ చాలా ఫోరం లు నింపాలి. చాలా పని ఉంటుంది.
సుగుణ: 20 ఏళ్లలో ఎప్పుడు వస్తాడో తెలియ లేనప్పుడే ప్రతిరోజు ఎదురు చూసేదాన్ని. అలాంటిది మన ఊర్లోనే ఉన్నాడు అంటే ఎదురు చూడకుండా ఎలా ఉండగలను?
అను: భోజనం చేసి ఎదురు చూడండి ఆంటీ ఆరోగ్యం ముఖ్యం కదా టాబ్లెట్స్ వేసుకోండి నేను రేపు ఉదయం వచ్చి మిమ్మల్ని కలుస్తాను.
సుగుణ: సరే అమ్మ రేపు కచ్చితంగా ఇంటికి రా మా కొడుకుని కూడా పరిచయం చేపిస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది సుగుణ.
సుగుణ: ఒకసారి అన్నయ్యకి ఫోన్ చెయ్ అమ్మ
ఉష: లేదమ్మా అసలు ఫోన్ ఎత్తడం లేదు, పనిలో ఉన్నట్టున్నాడు. ఆగు మళ్ళీ చేస్తాను అని తిరిగి ఫోన్ చేస్తుంది ఉష. కాని మరోవైపు జెండే ఆ ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు.
జెండే: సూర్య ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఆర్య. మనం ఫోన్లో నిజం చెబుదామా లేకపోతే వాళ్ళని కలిసి వెళ్లి చెబుదామా?
ఆర్య: వాళ్లని ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు జెండే..
జెండే: అలాగని నిజం చెప్పకుండా దాయలేదు కదా ఆర్య
ఆర్య: ఫోన్ చెయ్యు మాట్లాడదాము అని అనగా జెండే కాల్ చేసి ఆర్యకి ఇస్తాడు.
మరోవైపు సూర్య ఫోన్ చేయడంతో సుగుణ ఆనందంగా ఫోన్ ఎత్తుతుంది.
సుగుణ: సూర్య ఎలా ఉన్నావురా? నేను నీకోసం ఎంతో ఎదురు చూస్తున్నాను ఆఖరికి ఇప్పుడు నా ఆశ తీరుతుంది. 20 ఏళ్ల తర్వాత నిన్ను మళ్ళీ కలుస్తున్నాను. త్వరగా ఇంటికి వచ్చేరా నీకోసం నీ తల్లి, చెల్లెలు ఎదురుచూస్తున్నారు అని అనగా ఆర్య చాలా ఎమోషనల్ అవుతాడు.
ఆర్య: అమ్మ మీ అబ్బాయి సూ.. అని అనేలోగే..
సుగుణ: అమ్మ! ఆ మాట నీ నోట్లో నుంచి విని ఎన్ని సంవత్సరాలు అవుతుంది రా. ఆ పేరు కోసమే నేను ఇంకా బతికున్నానేమో. ఈరోజు నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది ఒక అమ్మ నన్ను కాపాడింది. నిన్ను చూడడం కోసమే కాపాడిందేమో. నాకు తెలుసు రా నువ్వు ఎందుకు మాట్లాడటం లేదో.
చిల్లి గవ్వ కూడా లేకుండా తిరిగి ఇంటికి వస్తున్నాను అని మొహమాటంతో మాట్లాడడం లేదు కదా. ఏం పర్వాలేదు రా నువ్వు ఇక్కడికి వచ్చి కష్టపడు. ఇంటి బాధ్యతల్ని తీసుకో నేను నిన్ను చూసుకుంటూ హాయిగా బతికేస్తాను రా. అని అనగా ఆర్య ఎమోషనల్ అయ్యి ఒక నిర్ణయం తీసుకుంటాడు.
ఆర్య: వస్తున్నాను అమ్మ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆర్య.
ఆ తర్వాత సీన్లో ఇంట్లో నీరజ్ చాలా కోపంగా జెండే తో మాట్లాడతాడు.
నీరజ్: ఆ జలందర్ ని అసలు వదిలి పెట్టకూడదు తన వల్లే ఇదంతా వచ్చింది. కచ్చితంగా కోర్టులో కేసు ఫైల్ చేయాలి.
అంజలి: పాపం. సార్ ని కాపాడబోయి అమాయకుడైన మరొకరి ప్రాణం పోయింది అని బాధగా ఉంటుంది అంజలి.
జెండే: మరి దీని కోసం ఆర్య ఏ నిర్ణయం తీసుకున్నాడో అని అనుగా ఇంతలో ఆర్య ఒక మామూలు షర్టు ఫాంటు వేసుకొని సాధారణ మధ్యతరగతి కుటుంబం మనిషిలా కిందకి దిగుతాడు.
నీరజ్: ఏంటి దాదా ఇలా రెడీ అయ్యారు?
ఆర్య: నేనొక నిర్ణయం తీసుకున్నాను. 20 ఏళ్ల తర్వాత వాళ్ళ కొడుకు తిరిగి వస్తున్నారు అని ఆశలతో ఉన్న వాళ్ళ అమ్మకి వాళ్ల కొడుకు తిరిగిరాలేడు అని నిజాన్ని నేను చెప్పలేను. సూర్య స్థానంలో నేనే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ బాధ్యతల్ని తీరుస్తాను.
అంజలి: దానికోసం మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎందుకు సార్? వాళ్ళ చెల్లెకి మంచి ఉద్యోగం ఇప్పించి, మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేద్దాము.
ఆర్య: అలా చేయడానికి ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఆర్థిక సాయం కాదు అంజలి, బాధ్యత సాయం. వాళ్ల కొడుకు వచ్చి వాళ్ళ బాధ్యతలు తీసుకుంటాడు అని ఆశగా ఆ ఇంట్లో ఒక అమ్మ ఎదురుచూస్తుంది.
నాకోసం ప్రాణాలు విడిచిన సూర్య చివరి మాటగా వాళ్ళ ఇంటి సభ్యుల బాధ్యతల్ని తీసుకోమని చెప్పాడు. నేను నా మాటని నెరవేర్చి తీరుతాను. బిజినెస్ విషయంలో ఏవైనా మాట్లాడాలంటే జెండే కి కాంటాక్ట్ చేయు తనే అవి చూసుకుంటాడు అని నీరజ్ తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్య.
అంజలి: బాధపడొద్దు నీరజ్ సర్ ఏం చేసినా ఆలోచించే చేస్తారు అని నీరజ్ కి ధైర్యం చెబుతుంది అంజలి.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial