అన్వేషించండి

Prema Entha Madhuram October 10th: ఛాయాదేవి చెంప పగలగొట్టిన రోహిత్- ఆర్యను క్షమించమని వేడుకున్న సుబ్బు, పద్దు!

ఛాయాదేవి తను తీసుకున్న గోతిలో తానే పడడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema entha madhuram October 10th: ఈరోజు  ఎపిసోడ్ లో ఇదంతా మోసం. ఈ పెళ్లి అబద్ధం అని గట్టిగా అరుస్తుంది ఛాయాదేవి.

ఆర్య: ఏది మోసం? ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటానని ఆశలు పెట్టి రోహిత్ దగ్గర ఆస్తంతా కాజేయడం మోసం కదా? అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లికొప్పించి నా ఆస్తి కాచెయ్యాలనుకోవడం కూడా మోసం కాదా?

జెండే: ఇంత జరుగుతున్నప్పుడు ముందు కూడా ఇలాంటిదేదో జరిగే ఉంటాదని అనుమానం వచ్చే బ్యాగ్రౌండ్ చెక్ చేసుకుంటే రోహిత్ గురించి తెలిసింది.

ఆర్య: నీ గురించి అన్ని చెప్పినా సరే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అంటే తను నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకో. ప్రేమనేది జీవితంలో ఒకరి మీద మాత్రమే వస్తుంది అది దొరకడం అదృష్టం. నువ్వు నాకు చెడు చేయాలనుకున్న నీకు మంచే చేశాను అని అనగా వెంటనే జలంధర్ కోపంతో రగిలిపోయి అక్కడ ఉన్న పాత్రలన్నిటిని విసిరేస్తూ ఉంటాడు.

జలంధర్: ఇక్కడ అంతా మోసం జరుగుతుంది. పెళ్లి చేసుకుంటాను అని మా చెల్లిని ఒప్పించి నమ్మకద్రోహం చేశావు.

Also Read: కృష్ణనా మజాకా.. ముకుందని చిటికెలో ఓడించేసిన తింగరి పిల్ల!

ఆర్య: నేనెప్పుడూ పెళ్లి జరుగుతుందనే చెప్పానుకాని నాతో జరుగుతుందని ఏనాడు అనలేదు. అలా భ్రమపడి తప్పు చేసింది మీరు అనగా జలంధర్ ఆర్య మీద దాడి చేసే లోగ జెండే చిటికలు వేయడంతో బాడీగార్డ్స్ వచ్చి జలంధర్ ని చుట్టుముడతారు.

జెండే: ఇక్కడ అందరూ నీ మనుషులే అనుకుంటున్నావా? ఇది ఆర్య సంస్థానం ఇందులో పీల్చే గాలి కూడా ఆర్య చెప్పు చేతుల్లోనే ఉంటుంది అని అంటాడు జెండే.

ఛాయాదేవి: నేను ఈ పెళ్లికి ఒప్పుకోను నాకు ఆర్యతో పెళ్లి కావాలి అని అనగా రోహిత్ గట్టిగా ఛాయాదేవి చెంప పగలగొడతాడు.

రోహిత్: ఆల్రెడీ నీ మీద యుఎస్ లో చీటింగ్ కేసు ఫైల్ చేశాను. ఎప్పుడు కనిపిస్తావా అని వెతుకుతున్నారు ఆ పోలీసులు. నీకు ఈ పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకే ఆప్షన్ లేదు.

ఆర్య: నీ దగ్గర కాజేసిన ఆస్తిని కూడా లాయర్ తో మాట్లాడి తిరిగి నీకు ఇప్పించేలా చేస్తాను అని రోహిత్తో అంటాడు ఆర్య.

రోహిత్: థాంక్యూ సర్, థాంక్యూ వెరీ మచ్.

మాన్సి: పరిస్థితులు మన చేయి దాటిపోయాయి. అది మన మీదకి రాకముందే ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవడం బెటర్ అని వెనుక నుంచి వెళ్ళిపోతుంది మాన్సి.

జెండే: పెళ్లి బాగా జరిగింది కదా నౌ షట్ అప్ అండ్ గెటవుట్ అని అనగా జలంధర్ ని అక్కడ ఉన్న బాడీగార్డ్స్ బయటకు తీసుకొని వెళ్ళిపోతారు. రోహిత్ ఛాయాదేవిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు.

Also Read: కాలేజ్ MDగా రిషి రీఎంట్రీ - దేవయాని, శైలేంద్రకి బిగ్ షాక్!

అను, అభయ్ ఉన్న చోటుకు వెళుతుంది.

టీచర్: సారీ మేడం మా అమ్మ నాన్నల్ని బెదిరించి నా చేత ఈ పని చేయించారు. ఏమనుకోవద్దు అని గన్ పక్కన పారేస్తుంది. అప్పుడు అను అభయ్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

అందరూ వెళ్లిపోయిన తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులందరూ ఆర్య దగ్గర ఉంటారు.

పద్దు: నన్ను క్షమించండి సార్. మా అమ్మికి అంత మోసం జరుగుతుందని తెలిసి మేము ఉండలేకపోయాము. ఎక్కడ మా అమ్మికి అన్యాయం చేస్తారేమో అని మిమ్మల్ని అనరాని మాటలు అన్నాము.

అను: అను మీకు సొంత కూతురే కావచ్చు కానీ తను నా ప్రాణం. ఎప్పటికీ నా జీవితంలో నా భార్య స్థానం అనుకి మాత్రమే ఉంటుంది. వేరే ఎవరు రాలేరు, రారు.

సుబ్బు: ఇంత జరిగిన తర్వాత అప్పుడు కాదు సార్ ఇప్పుడు విషయం తాగి చావాలి అని అనిపిస్తుంది. మిమ్మల్ని అన్ని మాటలు అన్నాను మీ గురించి తెలిసి కూడా మిమ్మల్ని అనుమానించాము అని విషయం తాగుబోతుండగా ఆర్య వాళ్ళు వెళ్లి సుబ్బు ని ఆపుతారు.

Also Read: రోహిత్​తో ఛాయాదేవి పెళ్లి చేసిన ఆర్య.. దెబ్బ అదుర్స్ కదూ!

ఆర్య: అలా అనొద్దు సుబ్బు గారు. నన్ను అనుమానించి ప్రశ్నించే హక్కు మీకు ఉంది. మీరు మీ కూతురికి అన్యాయం జరుగుతుందని ప్రశ్నించారు అందులో మీ తప్పేమీ లేదు అని అనగా ఒక మూల నుంచి ఈ దృశ్యాన్ని అంతటినీ అను చూస్తూ ఉంటుంది.

నీరజ్: సారీ దాదా మీరు ఆ ఛాయాదేవిని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నుంచి నేను మిమ్మల్ని ఎన్నోసార్లు వద్దు అని చెప్పి ఇబ్బంది పెట్టాను. దయచేసి నన్ను క్షమించండి.

అంజలి: అవును సార్ మీరు ఎలాంటివారో మాకు తెలుసు. అయినా సరే స్కూల్ ని, పిల్లల్ని కాపాడదామని ఈ పెళ్లి చేసుకుంటున్నారని అనుకున్నాను. నన్ను కూడా క్షమించండి అని క్షమాపణలు కోరుతుంది అంజలి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Join Us On Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget