అన్వేషించండి

Krishna Mukunda Murari October 10th: కృష్ణనా మజాకా.. ముకుందని చిటికెలో ఓడించేసిన తింగరి పిల్ల!

మురారీ కోసం కృష్ణ, ముకుంద పోటీ పడుతుండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Krishna Mukunda Murari Serial October 10th Episode: మురారీని ప్రభాకర్ పక్కకి తీసుకుని వెళతాడు. తమని చూశాడు ఏమోనని ముకుంద అనుకుంటుంది. ఏం జరుగుతుందోనని కృష్ణతో పాటు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ప్రభాకర్ తనలాగా మురారీకి పూల చొక్కా, లుంగీ వేసి రెడీ చేసి తీసుకొస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇక మామా అల్లుళ్లు ఇద్దరూ కలిసి మాస్ పాటకి డాన్స్ ఇరగదీస్తారు. కృష్ణని డాన్స్ చేయమని ప్రభాకర్ అంటాడు. ముకుంద ఆపి ఒడిపోయావ్ కదా మా నాన్నని రప్పిస్తానని చెప్పావ్ మర్చిపోయావా అంటుంది. ఒడిపోలేదు వస్తారని కృష్ణ ధీమాగా చెప్తుంది. ఒడిపోతే ఒక మూలన చీమలాగా పడి ఉండాలని అంటుంది. డీజే టిల్లు పాటకి కృష్ణ, మురారీ డాన్స్ వేస్తారు. గణేష్ లడ్డు వేలం పాట వేద్దామని కృష్ణ అంటుంది. కృష్ణ తన చేతిలో ఎలాగైనా ఓడిపోవాలని ముకుంద మనసులో అనుకుంటుంది. లడ్డూ వేలం పాట మొదలు అవుతుంది.

ముకుంద: నా పాట యాభై వేలు

ప్రభాకర్: ఇదేదో సరదాగా చేస్తున్నాం

ముకుంద: ఎందుకు మీకు అంత సీన్ లేదా?

Also Read: రాజ్ నాటకం తెలుసుకున్న సీతారామయ్య ఏం చేయబోతున్నారు - వియ్యాలవారిని కడిగిపడేసిన కనకం!

కృష్ణ: నా పాట లక్ష

అలా ముకుంద, కృష్ణ ఇద్దరూ పోటాపోటీగా పాట పెంచుకుంటూ పోతారు. చివరిగా ముకుంద ఆరు లక్షలకు లడ్డూ వేలం పాటలో గెలుస్తుంది. లడ్డు ముకుందకి ఇచ్చెయ్యండి కానీ డబ్బులు ఇప్పుడే ఇవ్వాలని కృష్ణ ఫిట్టింగ్ పెడుతుంది. నా దగ్గర మూడు లక్షలే ఉన్నాయి ఇప్పుడు ఎలా టైమ్​కి ఇంట్లో అత్తయ్యలు కూడా లేరని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే పక్కకి వెళ్లి తండ్రికి కాల్ చేసి మూడు లక్షలు కావాలని అడుగుతుంది. ఇంటి బయటకి వచ్చి ఫోన్ చేస్తే తనే వస్తానని అంటుంది. మధుకర్, అలేఖ్య తమ డాన్స్ పెర్ఫామెన్స్​తో ఇరగదీస్తారు. అప్పుడే శ్రీనివాస్ డబ్బులు తీసుకుని ఇంట్లోకి వస్తాడు. ఫోన్ చేశాను నువ్వు లిఫ్ట్ చేయలేదు వినిపించలేదని లోపలికి వచ్చేశానని చెప్పేసరికి ముకుంద ఫ్యూజులు ఎగిరిపోతాయి. పండగ రోజు మన ఇంటికి వచ్చారు ముకుంద వాళ్ల నాన్న అని కృష్ణ అంటుంది. నా దగ్గర ఆరు వందలు మాత్రమే ఉన్నాయి కావాలని ఆరు లక్షల పాట పాడించాను. నోరు మూసుకుని ఒక మూలన పడి ఉండమని హెచ్చరిస్తుంది.

ప్రభాకర్ దంపతులు బయలదేరుతూ ఉంటారు. పనులు ఉన్నాయని వెళ్లక తప్పదని అంటారు. కృష్ణ, మురారీ వాళ్లు వస్తారు. ముకుందకి మొగుడ్ని దొరకబెట్టుకుని తీసుకొస్తేనే మన బిడ్డ చల్లగా ఉంటుందని శకుంతల అంటుంది. ఇంటికి వచ్చిన వాళ్లకి కృష్ణ బట్టలు పెడుతుంది. కృష్ణని జాగ్రత్తగా చూసుకోమని మురారీకి చెప్తారు.

ప్రభాకర్: నీ కాపురం చల్లగా ఉండాలంటే ముకుంద పెనిమిటిని మిలటరీ నుంచి రప్పించడం తప్ప వేరే దారి లేదు. ఇదంతా నీకు తెలుసని చెప్తున్నా కాస్త జాగ్రత్తగా ఉండు

కృష్ణ: మీరు ఆ విషయం మర్చిపోండి నేను చూసుకుంటాను

Also Read: కాలేజ్ MDగా రిషి రీఎంట్రీ - దేవయాని, శైలేంద్రకి బిగ్ షాక్!

ప్రభాకర్: జాగ్రత్తగా లేకపోతే నువ్వు నష్టపోవాల్సి వస్తుంది. ముకుంద చాలా డేంజరస్ గుర్తు పెట్టుకో. నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను అది మర్చిపోకు

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తండ్రి కారు వెనుక పరుగులు పెట్టిన క్రిష్! లక్ష్మీ ఆచూకీ దొరుకుతుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తండ్రి కారు వెనుక పరుగులు పెట్టిన క్రిష్! లక్ష్మీ ఆచూకీ దొరుకుతుందా!
Godavari Serial Today July 16th: 'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
Prabhakar Podakandla: దూరదర్శన్‌తో కెరీర్ స్టార్ట్.. బుల్లితెర మెగాస్టార్ స్థాయికి.. యాక్టర్, ప్రొడ్యూసర్ ప్రభాకర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
దూరదర్శన్‌తో కెరీర్ స్టార్ట్.. బుల్లితెర మెగాస్టార్ స్థాయికి.. యాక్టర్, ప్రొడ్యూసర్ ప్రభాకర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today July 16th: నిండు మనసులు: గుడిలో ఇందిర కుట్ర! ఢీ అంటే ఢీ అనుకున్న రెండు ఫ్యామిలీలు!
నిండు మనసులు: గుడిలో ఇందిర కుట్ర! ఢీ అంటే ఢీ అనుకున్న రెండు ఫ్యామిలీలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget