అన్వేషించండి

Prema Entha Madhuram January 1st Episode: అను దగ్గరకు వెళ్లి బాంబు పేల్చిన సుగుణ, ఉష తీసుకున్న నిర్ణయం సరైనదేనా?

Prema Entha Madhuram Today Episode: అను, ఆర్యల పెళ్ళి జరగాలని అబద్ధం చెప్పి మరీ సుగుణని పెళ్లికి ఒప్పించిన ఉష. ఈ విషయం మీద అను, ఆర్యలు ఎలా రియాక్ట్ అవుతారు అనే ఉత్కంఠతో కథలో  ఏర్పడుతుంది.

Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ముందు పెళ్లి గురించి పంతులుగారు ఏం చెప్పారు అని ఉష ని అడుగుతుంది సుగుణ.

ఉష: అప్పుడు జాతకాల వల్ల కొన్ని దోషాలు వచ్చి అలా జరిగిందటమ్మ. ఇప్పుడు అవన్నీ పోయాయట గ్రహాలన్నీ చాలా బాగున్నాయంట ఇకపై ఏ ఇబ్బందులు కూడా ఉండవట.

సుగుణ: ఇంకేమైనా చెప్పారా? ఏమైనా దోషాలు లాంటివి ఉన్నాయంటా?

ఉష: అబ్బా.. అమ్మ ఏమీ లేవట నీకు నమ్మకం లేకపోతే మళ్ళీ అడుగుతాను చూడు అని పంతులు గారిని పిలుస్తూ పంతులుగారు, ఒక్కసారి మీరు నాకు చెప్పింది మా అమ్మకి చెప్పండి అని అంటుంది ఉష

పంతులు: గ్రహాలన్నీ బాగా ఉన్నాయి ఏ దోషాలు లేవు. అంతా మంచే జరుగుతుంది అని చెప్తారు పంతులు. ఆ మాటలకు సుగుణ ఊపిరి పీల్చుకుంటుంది.

సుగుణ: అయితే ఇంక రాధ, సూర్యలతో వెళ్లి ఈ పెళ్లి విషయం మాట్లాడదాము వాళ్ళిద్దరూ ఒకటైతే అదే చాలు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ఉష: దేవుడా ఈ పెళ్లి జరగాలని అబద్ధం ఆడాను దయచేసి నన్ను క్షమించు అని దేవుడ్ని కోరుకుంటుంది ఉష.

ఆ తర్వాత సీన్ లో ఆర్య జెండేలు మాట్లాడుకుంటూ ఉంటారు.

ఆర్య: లగ్నపత్రికలు కూడా అయిపోయాయి జేండే. ఇంకా వాళ్లు డైరెక్ట్ గానో ఇండైరెక్టుగానో డబ్బు గురించి అడుగుతూ ఉన్నారు.

జేండే: సూర్య పేరు మీద వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు అయిపోయాయి. కన్స్ట్రక్షన్ సైట్ అవుతుంది కదా ఏం కంగారు పడొద్దు అంతా బానే జరుగుతుంది అని అనేలోగా ఆర్య కి ఒక ఫోన్ కాల్ వస్తుంది.

ఆర్య: ఎవరు మాట్లాడుతున్నారు?

అమ్మాయి: సూర్య గారే కదా మాట్లాడుతుంది! నేనెవరో మీకు తర్వాత చెప్తాను కానీ మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇలా ఫోన్లో కాదు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.

ఆర్య: ఎవరో అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడాలి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. పేరు కూడా చెప్పలేదు అని తిరిగి కాల్ చేయడానికి చూడగా తిరిగి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది.

జెండే: పోనీలే ఆర్య ఈమధ్య టీజింగ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. అవసరముంటే మళ్ళీ ఫోన్ చేస్తారు కదా అని అంటాడు. అప్పుడు ఆర్య ఆలోచనలో పడతాడు.

జెండే: ఏమైంది ఆర్య ఏం ఆలోచిస్తున్నావు?

ఆర్య: పిల్లల గురించి జెండే. అసలు ఆరోజు ఎటాక్ జరిగినప్పుడు పిల్లల మీద ఎందుకు దాడి చేశారో అర్థం కావట్లేదు.

జెండే: వాళ్లు నీ మీద దాడికి వచ్చి ఉండొచ్చు కదా, పిల్లల మీదనే ఎందుకు అనుకుంటున్నావు?

ఆర్య: లేదు వాళ్ళు వచ్చింది కచ్చితంగా పిల్లల కోసమే. అయినా పిల్లలు వాళ్ళు నాన్న కోసం అంతగా తపన పడిపోతున్నారు. ఆ రోజు నేను లేకపోతే పిల్లలు ఏమైపోయారు?  రాధ గారు కూడా తన భర్త గురించి అడిగితే అంతంత మాత్రమే చెప్తున్నారు అసలు ఏం చేయాలో తెలియట్లేదు. రాధ గారి  ప్రాబ్లంకి అసలు రీసన్ ఏంటో తెలుసుకోవాలి జెండే, తెలుసుకుంటాను అంటాడు.

ఆ తర్వాత సీన్ లో సుగుణ తన పిల్లలు ముగ్గురు హాల్లో ఉంటారు. అప్పుడే అక్కడికి అను ఫ్రూట్స్ పట్టుకుని వస్తుంది. అనుతో మాట్లాడమన్నట్టు ఉష సుగుణకు సైగ చేస్తుంది. దాన్ని అప్పుడే వచ్చిన యాదగిరి గమనిస్తాడు.

యాదగిరి: ఏంటి చిన్న మరదలా ఎగ్జామ్ లో స్లిప్పులు వాడేటట్టు అన్ని సైగలు చేసి చెప్తున్నావు?

ఉష: ఏమీ లేదు చదువుకుంటున్నాను అని అంటుంది ఉష. అదే టైంలో సుగుణ వెళ్లి అనుతో మాట్లాడుతుంది

సుగుణ: రాధా నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. అది నీ మంచి కోసమే అని అనుకుంటున్నాను. ముందు నేను చెప్పేది విను. ఈ మాట చెప్తున్నాను అని ఏమనుకోవు కదా?

అను: చెప్పండి ఆంటీ ఏం పర్వాలేదు. నేనేం అనుకోను.

సుగుణ: పిల్లలు మాల వేసుకున్నారు కదమ్మా వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి రావాలి అని మరి అంత కష్టపడుతున్న వాళ్లకి ఏమైనా ఉపయోగం ఉందా?

అను: ఇంకేం చేయలేం ఆంటీ ఈ జన్మకి వాళ్లకు నేనే నాకు వాళ్లే. వాళ్ళ ఆశలు తీరేవి కాదు.

సుగుణ: అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా కొడుకు సూర్య ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? అని అన్న వెంటనే అను ఆ మాటలకి షాక్ అయిపోతుంది.

అను: ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? జీవితమంతా నా భర్తగా ఆయనే ఉంటారు. ఆయన తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. ఇంకొక పెళ్లి అనేది జరగని పని .నాకు నా పిల్లలు, పిల్లలకి నేను ఈ జన్మకు ఇంతే ఇంక.

యాదగిరి: బాగా చెప్పావమ్మా అయినా మీరు ఎందుకు అలా అడుగుతున్నారు?

జ్యోతి: మా అన్నయ్య జైలు నుంచి వచ్చాడనే కదా నువ్వు అలా అనుకుంటున్నావు?

అను: లేదు. సూర్య గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన మీద అమితమైన గౌరవం ఉంది అలాగని నేను ఆయన్ని పెళ్లి చేసుకోలేను కదా

ఉష: పిల్లల కోసమైనా ఆలోచించాలి కదా రాధ గారు. పాపం తండ్రి లేకుండా వాళ్ళు ఎంత తపన పడుతున్నారో పెద్దయ్యక నాన్న ఎక్కడ అంటే ఏం చెప్తారు?

యాదగిరి: అమ్మా చిన్న మరదలా.. నీ వయసుకి నువ్వు మాట్లాడుతున్న వాటికి ఏమైనా సంబంధం ఉందా? ముందు వెళ్లి చదువు మీద దృష్టి పెట్టు. లేకపోతే మళ్ళీ సప్లీలు రాయాల్సి వస్తుంది.

అను: దయచేసి ఎవరూ గొడవ పడొద్దు. ఇంక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి ఆంటీ. మరెప్పుడు ఈ విషయం గురించి నాతో మాట్లాడొద్దు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అను.

యాదగిరి: ఈరోజుకు తప్పింది మళ్లీ ఎలాగ ఆపాలో అని అనుకుంటాడు యాదగిరి.

యాదగిరి: అయినా ఏంటి అత్తమ్మ!  కాని దాని కోసం ఇంతలా ఆలోచిస్తున్నావు ఇంక దీన్ని విడిచిపెట్టి పోయి పని చూసుకోమని చెప్తాడు.  ఆ మాటలకి సుగుణ అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది.

అభయ్: ఏంటి అక్కి అమ్మకి నాన్నకి పెళ్లి చేస్తాను అంటే అమ్మ వద్దంటుంది. ఈ విధంగా అయితే మనకి నాన్న ఎప్పుడు తిరిగి వస్తారు 

అక్కి: అవును నాకు కూడా చాలా బాధగా ఉంది అని అనుకుంటారు ఇద్దరూ.

ఆ తర్వాత సీన్లో అసలు పిల్లల మీదకు రౌడీలు ఎందుకు వచ్చారు అని దీర్ఘ ఆలోచనలో పడతాడు ఆర్య. ఇప్పుడే అక్కడికి సుగుణ, ఉషలు వస్తారు. వాళ్ళు రావడం ఒక మూల నుంచి యాదగిరి చూస్తూ ఈ మాటలు వింటాడు.

సుగుణ: ఏంటి సూర్య ఏదో ఆలోచిస్తున్నావ్?

ఆర్య: లేదమ్మా అసలు రౌడీలు పిల్లల మీదకు ఎందుకు వచ్చారు అని  ఆలోచిస్తున్నాను.

సుగుణ: కారణం తెలీదు కానీ దానికి పరిష్కారమైతే నా దగ్గర ఉంద.  ముందు నాకు ఒక మాట ఇవ్వు సూర్య అని అంటుంది సుగుణ.

యాదగిరి: కొంపతీసి సార్ దగ్గర పెళ్లి టాపిక్ తెస్తారా ఏంటి వీళ్ళు అని అనుకుంటాడు యాదగిరి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: అలా అనిపించకుండా చేస్తాం అన్నారు - ‘యానిమల్’లో ఇంటిమేట్ సీన్ ఎక్స్‌పీరియన్స్ బయటపెట్టిన తృప్తి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Embed widget