Prema Entha Madhuram Serial January 18th: ఆర్యపై పగ తీర్చుకుంటానన్న ఘోర.. అనుకి బిక్షటనే శరణ్యం అంటున్న గురువుగారు!
Prema Entha Madhuram Serial Today Episode: ఆర్య తో నా ఆశయానికి అడ్డొచ్చావు కదా ఇకపై నీకు ప్రశాంతతని ఉండనివ్వను అని ఘోర కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోవటంతో కథలో కీలక మలుపులు ఏర్పడతాయి.
Prema Entha Madhuram Telugu Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో ఇంట్లోకి వచ్చిన ఘోర ని చూసి భయపడతారు పిల్లలు.వెళ్లి అను వెనుక దాక్కుంటారు. సుగుణ వాళ్ళు ఘోర ని బయటికి పొమ్మని కసురుకుంటారు. పిల్లల్ని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతుంటే హరీష్ అడ్డుకుంటాడు హరీష్ ని ఒక్క తోపు తోసి పిల్లల్ని తీసుకువెళ్లి పోతుంటే ఆర్య ఘోరని అడ్డుకుంటాడు.
ఘోర : నా ఆశయానికి అడ్డు రావద్దు నీకే నష్టం అని బెదిరిస్తాడు.
ఆర్య : నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను అని చెప్పి ఘోర ని బయటికి గెంటేసి పిల్లల దగ్గరికి వెళ్లి భయం లేదని ధైర్యం చెప్తాడు.
ఘోర : అక్కడినుంచి వెళ్ళిపోతూ నా ఆశయానికి అడ్డు వచ్చావు కదా ఇక ఈ ఇంట్లో ప్రశాంతత ఉండనివ్వను నీ పై పగ సాధిస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అను : ఆయనతో పెళ్లి అనగానే ఆయనకు ప్రమాదం ఎదురయింది అని కంగారు పడుతూ ఈ పెళ్లిని తప్పించుకోవటం ఎలా అని అనుకుంటుంది.
సుగుణ కూడా ఘోర బెదిరింపులకి భయపడిపోయి పరిహారం కోసం ఎవరికైనా స్వాములకు చూపించాలి అనుకుంటుంది.
ఆ తర్వాత అను రోడ్డు మీద వెళ్తుంటే జోగమ్మ కనిపిస్తుంది. ఆమెతో మాట్లాడాలి అనుకునే సమయానికి ఛాయాదేవి మాన్సీ కారులో వస్తూ జోగమ్మని కారు తో గుద్దేయాలి అనుకుంటారు. కానీ జోగమ్మ శక్తి వలన ఆమె గురువుగారి శక్తి వలన కారు బ్రేక్స్ ఫెయిల్ అయిపోయి వెళ్లి వేరే చెట్టుకి గుద్దుకుంటారు.
మాన్సీ : కంగారు పడిపోతూ ఎంత పెద్ద ప్రమాదం తప్పింది ఆ జోగమ్మ ఏదో చేసినట్లుగా ఉంది పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఛాయాదేవికి చెప్పడంతో ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
అను : కంగారుగా జోగమ్మ దగ్గరికి వచ్చి మీకు ఏమీ కాలేదు కదా, చూసుకోవాలి కదమ్మ అంటుంది.
జోగమ్మ : అమ్మ అన్ని చూస్తూనే ఉంటుంది, పాప పుణ్యాలను బేరీజు వేస్తూనే ఉంటుంది అంటుంది.
అను : మనసులో ఎలాంటి సంకోచం లేకుండా అడుగు ముందుకు వెయ్యమన్నావు కానీ నా మనసులో అనుమానం నన్ను అడుగు ముందుకు వెయ్యనివ్వడం లేదు.
జోగమ్మ : మనసులో అనుమానం పెట్టుకొని ఏ పని చేసిన అలాగే అనిపిస్తుంది. నీ మనసు కుదుటపడాలంటే గురువు బోధ అవసరం.నన్ను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిన మా గురువుగారి దగ్గరికి వెళ్ళు పరిష్కారం దొరుకుతుంది అని చెప్తుంది.
మరోవైపు సుగుణ ఆర్య ని తీసుకొని అదే గురువుగారి దగ్గరికి వస్తుంది.
సుగుణ జరిగింది గురువుగారికి చెప్పాలనుకుంటుంది కానీ గురువుగారు ఏమీ వినకుండానే నువ్వు ఏదో సమస్యని పరిష్కరించాలని అనుకుంటున్నావు కానీ అది మరేదో సమస్యని పరిష్కరిస్తుంది. మీ ఇంటికి ఈ నిమ్మకాయని దిష్టి తీసి ప్రవహించే నీటిలో పడేయ్ అని చెప్పి నిమ్మకాయ ఇస్తాడు అది తీసుకొని ఆమె వెళ్ళిపోతుంది. ఆర్య కూడా అక్కడ నుంచి వెళ్ళిపోబోతే
గురువుగారు: నాలో ఉన్న దేవుడు అని నేను గుర్తించాను నీలో ఉన్న తండ్రిని నువ్వు గుర్తించలేదా అని అడుగుతాడు.
ఒక్కసారి గా షాక్ అయిన ఆర్య మీరు ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతాడు.
గురువుగారు: నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అదే నిజం నీకు దగ్గరగా ఉన్న బంధాలని గుర్తించలేకపోతున్నావు అని ఒక నాణాన్ని ఆర్య చేతికి ఇచ్చి ఇది నిలబెట్టు నీ బంధాలు కూడా నిలబడతాయి అనడంతో నాణెం తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆర్య.
అప్పుడే అక్కడికి అను వస్తుంది. తన భయాన్ని గురించి చెప్తుంది.
గురువుగారు: మనం అనుభవించే ప్రతి కష్టం గత జన్మల పాపపుణ్యాల కర్మ ఫలితం. కర్మ పోవాలంటే నువ్వు భిక్షాటన చేయాలి ప్రతిరోజు వెయ్యినూటపదహార్లు బిక్ష ద్వారా సంపాదించి ప్రతి రూపాయి భగవంతుడికి సమర్పించాలి చేస్తావా అని అడుగుతాడు.
అను: నా కుటుంబం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటుంది అను.
ఎట్టి పరిస్థితిలోనూ దీక్షకి భగ్నం కలగకూడదు అని హెచ్చరిస్తారు గురువుగారు అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.