అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today October 21st: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌:  అయోద్యపురం చేరుకున్న అకి, అభయ్‌ – మధ్యలోనే ఆగిపోయిన గౌరి, శంకర్‌

Prema Entha Madhuram  Today Episode:  బైకుల మీద అయోద్యపురం వెళ్తున్న శంకర్‌ వాళ్లు బైక్‌ ఆగిపోవడంతో మధ్యలోనే చిక్కుకుపోతారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode: అకి, అభయ్‌, జెండే, రాకేష్‌ అయోధ్యపురం రీచ్‌ అవుతారు. అక్కడి ఊరి ప్రజలు అకి, అభయ్‌లను చూసి హ్యాపీగా ఫీలవుతారు. అచ్చం మీ అమ్మానాన్నలను చూసినట్టు ఉందంటారు. మీ నాన్నగారు మా ఊరికి చేసిన అభివృద్ది పనులు చాలా గొప్పవి అని చెప్తారు. రాకేష్‌ మాత్రం  మనసులో తిట్టుకుంటాడు. పైకి అభయ్‌ మీ నాన్న గారు చాలా గొప్పవారు అంటాడు. ఇంతలో అందరూ కలిసి లోపలికి వెళ్తారు. గుమ్మం ముందు ఆర్య, అనులు చనిపోయిన చోట నిలబడి ఎమోషనల్ అవుతుంటారు.

జెండే: అభి, అకి లోపలికి వెళ్దాం పదండి

ఊరిజనం: సీతారామ్ములాంటి మీ అమ్మానాన్నాలను ఆ రాక్షసుడు ఇక్కడే పొట్టన పెట్టుకున్నాడు.

అకి: అమ్మా నాన్నా ఉన్నారు.. (అందరూ షాక్‌ అవుతారు.) మనతోనే మన జ్ఞాపకాల్లోనే

జెండే: అభయ్‌, అకి పదండి లోపలికి వెళ్దాం.

లోపలికి వెళ్తారు

అకి: ఫ్రెండ్‌ వీళ్లందరికీ అమ్మా నాన్నా తెలుసు కదా. ఇప్పుడు గౌరి, శంకర్‌ ఇక్కడికి వస్తే వీళ్లంతా గుర్తు పడితే ఎలా?

జెండే: అకి ఇది అమ్మవారి నిలయం అని జోగమ్మ చెప్పింది కదా. ఏదో మంచి జరుగుతుందనే వెళ్లమంది. వచ్చాం. మనం ఎలాంటి టెన్షన్‌ లేకుండా చూస్తుందాం. కచ్చితంగా మంచే జరుగుతుంది.

అకి: అలాగే ఫ్రెండ్‌..

లోపల రాజనందిని ఫోటో చూసి రాకేష్‌ షాక్అవుతాడు.

అభయ్‌: చెప్పాను కదా మా పెద్దమ్మ రాజనందిని గారు.

జెండే: చాలా పవర్‌ఫుల్‌ లేడీ. మా ఆర్యా అంటే ఆవిడకు పంచప్రాణాలు. ఆర్య జోలికి వెలితే ఎవ్వరినీ వదిలేది కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పడు ఆవిడ వర్థన్‌ కుటుంబానికి ఆమె ఒక శక్తికవచం.

రాకేష్‌: అభయ్‌ చెప్పాడు అంకుల్‌.

జెండే: అల్‌రెడీ సమాచారం తెలుసుకున్నావన్నమాట. అభయ్‌ ప్రెష్‌ అవుదురు కానీ రండి.

జెండే, అభయ్‌ వెళ్లిపోతారు. రాకేష్‌ రాజనందిని ఫోటో చూస్తుంటాడు. మా నాన్న పగ తీరినచోటే నా పగ తీరబోతుంది అనుకుంటాడు. మరోవైపు గౌరి, శంకర్‌ వాళ్లు బైకుల మీద వస్తుంటారు.

శంకర్: బైక్‌ మీద లాంగ్‌ డ్రైవ్‌ బాగానే ఉంటుంది కానీ నడిపేవాడికే సరదా తీరిపోతుంది. ఏంటండి నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు వెనక్కి చూస్తున్నారు.

గౌరి: మా చెల్లెల్లు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా..

శంకర్: మీ చెల్లెల్లు రావాలంటే మా తమ్ముళ్లు రావాలి కదండి. వాళ్లు నా స్పీడు కాదు కొంచెం స్లో..  అందుకే లేట్‌ అయి ఉంటుంది.

గౌరి: అదే నా భయం కూడా

శంకర్: చీకటి పడింది కదండి ఏ కాఫీకో టీ కో ఆపి ఉంటారు.

అని శంకర్‌ చెప్పగానే గౌరి బండి ఆపమని చెప్తుంది. వాళ్లు వచ్చాక అందరం కలిసి వెళ్దాం అంటుంది. దీంతో నా తమ్ముళ్లు నీ చెల్లెల్లను ఏడిపిస్తారనా..? అంటూ కోప్పడతాడు. ఇద్దరూ గొడవ పడుతుంటారు. ఇంతలో ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెల్లు వస్తారు. ఏమైందని అడుగుతారు. గౌరి మీరు రాలేదని టెన్షన్‌ పడుతుంది అని చెప్తాడు శంకర్‌. జర్నీ ఎలా ఉందని చెల్లెల్లను అడుగుతుంది గౌరి. బాగానే ఉందని వాళ్లు చెప్తారు. ఇక్కడే కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్దామనుకుంటారు.

శంకర్‌: హలో త్రిపుర సుందరి గారు మీరు సేద తీరడానికి పాన్పు రెడీ చేశాను వచ్చి సేద తీరండి.

గౌరి: అర్థం అయ్యేటట్టు  కాస్త తెలుగులో మాట్లాడతావా?

శంకర్: నేను మాట్లాడింది అచ్చ తెలుగులోనేనండి. అవును లేండి అర్థం చేసుకోవాలంటే కాస్త బ్రెయిన్‌ ఉండాలి.

గౌరి: మీతో ఉన్నవాళ్లు బ్రెయిన్‌ ఎక్కడ ఉంటుందండి. మీరే తినేస్తారు కదా..

పెద్దొడు: శ్రావణి గారు మీకు పిల్లో కావాలంటే నా బ్యాగ్‌ తీసుకోండి. పిల్లో లేకపోతే నాకు నిద్ర రాదు.

చిన్నొడు: వై నాట్‌ తీసుకొండి..

శ్రావణి : నీకు బ్యాగ్‌ ఉంది కదే..

సంధ్య: అందులో బ్యాంగిల్స్‌ ఉన్నాయి శ్రావణి పగిలిపోతాయి.

 అని మాట్లాడుతుండగా గౌరికి అకి కాల్‌ చేసి ఎక్కడున్నారు అని అడుగుతుంది. ఎక్కడ ఉన్నామో తెలియదు కానీ బైక్‌ ఆగిపోవడంతో ఇక్కడ ఉన్నాము అని చెప్తుంది. అయితే నేను కారు తీసుకుని వస్తాను అని అకి చెప్పగానే గౌరి వద్దని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konaseema News: వాలంటీర్‌ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్ అరెస్టు!
వాలంటీర్‌ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్ అరెస్టు!
Telangana Group 1 Exams : నేటి నుంచి తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు- అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
నేటి నుంచి తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు- అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Free Gas Cylinder: దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
Hyderabad News: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ప్రమాదం- అసలేం జరిగిదంటే?
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ప్రమాదం- అసలేం జరిగిదంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Owaisi on Palestine: హమాస్ చీఫ్ మృతిపై ఒవైసీ ఆవేదనవయనాడ్‌లో ప్రియాంక గాంధీకి పోటీగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్సొరంగంలో సిన్వర్ ఫ్యామిలీ, పాత వీడియో విడుదల చేసిన ఇజ్రాయేల్మరో యుద్ధానికి కాలుదువ్వుతున్న చైనా, ఈసారి పసికూనపై ప్రతాపం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema News: వాలంటీర్‌ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్ అరెస్టు!
వాలంటీర్‌ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్ అరెస్టు!
Telangana Group 1 Exams : నేటి నుంచి తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు- అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
నేటి నుంచి తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు- అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Free Gas Cylinder: దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
Hyderabad News: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ప్రమాదం- అసలేం జరిగిదంటే?
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ప్రమాదం- అసలేం జరిగిదంటే?
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి తుపాను ముప్పు, తెలంగాణలోనూ ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి తుపాను ముప్పు, తెలంగాణలోనూ ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్
Telangana News: తెలంగాణ వాహనదారులకు అలర్ట్ - అలా చేస్తే లైసెన్స్ రద్దు
తెలంగాణ వాహనదారులకు అలర్ట్ - అలా చేస్తే లైసెన్స్ రద్దు
Pawan Kalyan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ కళ్యాణ్ శుభవార్త
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ కళ్యాణ్ శుభవార్త
Hoax Bomb Threats To Indian Airlines: వారంలో వంద ఫేక్ కాల్స్‌- విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం-  కారకులు దొరికితే దబిడిదిబిడే
వారంలో వంద ఫేక్ కాల్స్‌- విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం- కారకులు దొరికితే దబిడిదిబిడే
Embed widget