Prema Entha Madhuram Serial Today December 24th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: రాకేష్‌ను పట్టుకున్న శంకర్ – ఓనరును కుమ్మేస్తానన్న యాదగిరి
Prema Entha Madhuram Today Episode: అభయ్ వాళ్ల ఇంటికి వచ్చిన రాకేష్‌ను శంకర్ పట్టుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: సెలబ్రేషన్స్ ఏర్పాట్లు జరుగుతుంటే అకి బాధ పడుతుంది. నాన్న మాట కాదనలేక రెడీ అయ్యాను అన్నయ్య అంటుంది. ఇంతలో రవి వచ్చి తనకు సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇష్టం లేదని చెప్తాడు. నాది సేమ్ ఫీలింగ్ రవి కానీ నాన్న చెప్పారు కదా..? అందుకే ఒప్పుకున్నాను వెళ్దాం పదండి అని చెప్పగానే ముగ్గురు బయటకు వెళ్తారు. మరోవైపు రాకేష్ తల పట్టుకుని ఉంటాడు. పెళ్లి అయిన వాళ్లకు మళ్లీ సెలబ్రేషన్స్ ఏంట్రా అంటూ కోపంగా రౌడీలను తిడుతుంటాడు. అసలు గౌరి కిడ్నాప్ అయిన విషయం వాడికి తెలుసా లేదా ఏంట్రా అంటాడు. అది కాకుండా ఆ ఓనరు గాడిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇక నేనే రంగంలోకి దిగుతాను అక్కడికి నేనే వెళ్తాను అంటాడు. రౌడీ వద్దని చెప్తాడు. వినకుండా రాకేష్ వెళ్తాడు. మాస్క్ పెట్టుకుని ఇంట్లోకి వెళ్తాడు రాకేష్. అకి, రవి రావడం చూసి సోపా పక్కన దాక్కుంటాడు. అకి, రవి స్టిల్స్ దిగుతుంటారు. ఇంతలో శంకర్, జెండే వస్తారు.
రాకేష్: శంకర్ నీ ఫేస్‌లో ఈ నవ్వు ఎక్కువ రోజులు ఉండదు. వీళ్లంతా ఇంత కూల్‌గా ఎందుకున్నారు. అసలు ఈ ఓనరు గాడు ఎక్కడున్నాడు ఎక్కడైనా గదిలో కట్టేశారా..? ( అని మనసులో అనుకుంటాడు)
యాదగిరి: సార్ మీరు చెప్పిన స్టోరీలో మరీ లీనమైపోయాడు ఆ ఓనరు గాడు. మరీ ఓవర్ చేస్తున్నాడు సార్.
జెండే: ఇంతకీ మనం అనున్నది అనుకున్నట్టు జరుగుతుందా..?
యాదగిరి: జరగుతుంది సార్..
శంకర్: అసలు ఎక్కడ ఉన్నాడు..
యాదగిరి: అదిగో వస్తున్నాడు..
ఓనరు వస్తాడు. యాదగిరి ఇరిటేటింగ్ గా ఫీలవుతాడు.
ఓనరు: ఏంటీ హడావిడి..
జెండే: అది మీ ముని మనవరాలికి పెళ్లి జరిగింది కదండి.. ఫోటో షూట్ ఏర్పాటు చేశాము.
ఓనరు: మంచి పని చేశారు. నేను కూడా ఒక ఫోటో తీసుకోవాలి.
రాకేష్: ఓనరు గాడికి ఏమైనా పిచ్చి పట్టిందా..? వీళ్లంతా వాడికి మర్యాద ఇవ్వడం ఏంటి…?
శంకర్: మీరు తప్పకుండా తీసుకుందురు కానీ తాతగారు.
ఓనరు: ఇదిగో యాదగిరి చిరుత పులి ఏమైనా దొరుకుతుందా..? కనీసం సింహం అయినా పర్వాలేదు. దాని తల మీద కాలు పెట్టి ఫోటో తీయించుకుంటాను.
యాదగిరి: చంపేస్తాను..నిన్ను..
శంకర్: అదే మిమ్మల్ని చంపేస్తాయి అంటున్నాడు.
అనగానే శంకర్ అకి, రవిలను పిలిచి ముత్తాత గారితో ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు. తర్వాత అందరం కలిసి ఫ్యామిలీ ఫోటో తీయించుకుందాం అంటాడు. ఫోటో లో సేవకులు మోకాళ్ల మీద నిల్చోవాలని ఓనరు చెప్పగానే యాదగిరి కోపంతో ఊగిపోతుంటాడు. చాటు నుంచి చూస్తున్న రాకేష్ షాక్ అవుతాడు. ఇంతలో శంకర్ ఏడుస్తూ కింద పడ్డట్టు నటిస్తుంటే..
ఓనరు: మనవడా ఆర్యా.. ఏమైంది.
శంకర్: ఏం లేదు తాతగారు. నా అనుతో కలిసి మీ ఆశీర్వాదం తీసుకోవాలని ఆశపడ్డాను కానీ నా అను ఎక్కడుందో ఎలా ఉందో.. తన జాడ ఎలా తెలుసుకోవాలి. తను దొరకాలని మీరు ఆశీర్వదించండి తాతగారు.
జెండే: రాజావారు మీ మనవడి బాధను మీరు మాత్రమే తగ్గించగలరు. మీ ఆలోచనే శాసనం ఆలోచించండి
అని జెండే చెప్పగానే ఓనరు ఆలోచిస్తూ పక్కకు వెళ్లిపోతాడు. జెండే గారు ఆ ఓనరు గాడు కంప్లీట్ గా మన గ్రిప్ లోకి వచ్చాడు. ఇక మనం చెప్పినట్లు చేస్తాడు. అని శంకర్ చెప్పగానే రాకేష్ అక్కడి నుంచి వెళ్లి ఓనరును రూంలోకి లాక్కెళతాడు. రాకేష్‌ను చూసిన ఓనరు నా మనవరాలిని వదిలేయ్ అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో రాకేష్ కోపంగా నిన్ను బకరాను చేశారు అంటూ చెప్పడంతో ఓనరు వినకుండా మర్యాదగా నా మవవరాలు ఎక్కడుందో చెప్పు అంటూ అడుగుతాడు. ఇంతలో అభయ్ వచ్చి రాకేష్‌ను చూసి శంకర్‌కు చెప్తాడు. వెంటనే రాకేష్ అక్కడి నుంచి పారిపోతాడు. వెనకాలే శంకర్, జెండే వెళ్తారు. కొద్ది దూరం వెళ్లాక రాకేష్‌ను రౌండప్ చేస్తారు శంకర్, జెండే. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!