Prema Entha Madhuram Serial Today August 23rd: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గౌరి, శంకర్ ల మధ్య చెక్ గొడవ – రెండు ముక్కలైన చెక్కు
Prema Entha Madhuram Today Episode: బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో వచ్చిన చెక్ విషయంలో గౌరి, శంకర్ మధ్య గొడవ జరుగుతుంది. ఈ గొడవలో చెక్కు రెండు ముక్కలు కావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Prema Entha Madhuram Serial Today August 23rd: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గౌరి, శంకర్ ల మధ్య చెక్ గొడవ – రెండు ముక్కలైన చెక్కు Prema Entha Madhuram serial today episode August 23rd written update Prema Entha Madhuram Serial Today August 23rd: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గౌరి, శంకర్ ల మధ్య చెక్ గొడవ – రెండు ముక్కలైన చెక్కు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/23/7a339af8dcdd2f77ceb1779a42c4b7f51724380299747879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prema Entha Madhuram Serial Today Episode: బెస్ట్ కఫుల్ అవార్డులో వచ్చిన అమౌంట్ ఇంకా ఇవ్వలేదని లెక్కలేస్తుంది గౌరి. శ్రావణి వచ్చి అడగ్గానే మాటా మారుస్తుంది గౌరి. ఈవెంట్ డబ్బు ఇంకా ఇవ్వలేదని ఇప్పుడే వెళ్లి అడుగుతానని చెప్తుంది. అయితే నువ్వు వెళ్లి అడిగితే వాళ్లు మళ్లీ గొడవ చేస్తారని నేను వెళ్లి డబ్బులు అడుగుతానని శ్రావణి చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు తన తమ్ముళ్లకు జ్యూస్ ఇస్తాడు శంకర్. అసలు వాళ్లు అక్కాచెల్లెలు కాదురా ఎంత గొడవ చేశారు. అయినా చాలా ఘోరం తప్పిపోయింది అంటాడు. ఇద్దరు తమ్ముళ్లు కూడా అవునని అంటారు. దీంతో శంకర్ నేను గౌరి గారంటే మొగుడు పెళ్లాల్లాగా యాక్ట్ చేశాం కాబట్టి ఘోరం జరిగేది అంటే కరెక్టు కానీ వీళ్లెందుకు ఘోరం అంటున్నారు అని డౌట్ పోతాడు శంకర్. అదే విషయం తమ్ముళ్లను అడిగితే వాళ్లు రాఖీ కడితే వాళ్లకు మనం గిఫ్ట్ ఇవ్వాలి కదా అది మనకు అవసరమా? అన్నయ్యా అని చెప్పగానే శంకర్ కూల్ అయిపోతాడు. ఇంతలో శ్రావణి వస్తుంది. అన్నదమ్ముల మీద సెటైర్లు వేస్తుంది.
శంకర్: ఇదిగో అమ్మాయి పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి వచ్చి ఏంటిది సెటైర్లు.
పెద్దోడు: అయినా మా డబ్బు మేము ఏమైనా చేసుకుంటాము మీకేంటి ప్రాబ్లమ్.
శ్రావణి: మాకే ప్రాబ్లమ్. ఎందుకంటే అందులో మా అక్కకు రావాల్సిన షేర్ కూడా ఉంది కాబట్టి.
శంకర్: ఈ అమ్మాయి చెక్కు గురించి అడుగుతుందంటే గౌరి గారు కపుల్ కాంటెస్ట్ గురించి చెప్పేశారా? ( అని మనసులో అనుకుంటాడు) అవును మనలో మన మాట ఈ చెక్కు గురించి మీకెలా తెలుసు.
శ్రావణి: మా అక్క చెప్పింది. మా అక్క మా దగ్గర ఏ విషయం దాచదు. ఇద్దరు కలిసే కదా అంతా చేశారు. మరి మా అక్క షేరు మాకు రావాలి కదా?
అంటూ చెక్కు గురించి ఇద్దరి మధ్య ఆర్గుమెంట్ జరుగుతుంది. నీతో కాదు మీ అక్కతోనే తేల్చుకుంటాను అంటాడు శంకర్. అందరూ కిందకు వెళ్తారు. గౌరిని శంకర్ వెళ్లి నిలదీస్తాడు. ఈ ప్రైజ్‌మనీ గురించి ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నాం కదా? మరి మీ చెల్లెలికి ఎందుకు చెప్పారు అంటాడు. దీంతో అందరూ ప్రైజ్ మనీ ఏంటి అని షాక్ అవుతారు. ఇంతలో గౌరి తన చెల్లె్ల్లను శంకర్ తన తమ్ముళ్లను వెళ్లిపోండని చెప్తారు.
గౌరి: మీకసలు బుర్రా బుద్ది ఏమైనా ఉందా? వాళ్ల ముందు కాంటెస్ట్ విషయాలు అన్ని బయట పెడతారా?
శంకర్: అంటే మీ ముక్కపుడక చెల్లెలు వచ్చి చెక్కు, తొక్క అనేసరికి మీరు చెప్పేశారేమోనని చిన్న మిస్ అండస్టాండింగ్ జరిగిపోయింది.
గౌరి: అక్కడికి నేనే ఈవెంట్ అని హింట్ ఇస్తూనే ఉన్నాను కదా? అయినా కూడా మీ వాగుడు మాత్రం ఆగలేదు.
శంకర్: అంటే ఆవేశంలో ఫ్లో అలా తన్నుకొచ్చేసింది.
అని ఇద్దరూ మాట్లాడుకుంటారు. చెక్కు నేనే డిపాజిట్ చేసి క్యాష్ తీసుకొచ్చి ఇస్తానని ఇద్దరూ లాక్కుంటూ ఉంటే చెక్కు చిరిగిపోతుంది. దీంతో గౌరి బాధపడుతుంది. శంకర్ మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లి మరో చెక్కు అడుగుతానని చెప్తాడు. తర్వాత చిరిగిపోయిన చెక్కును తలో ముక్క పట్టుకుని ఆలోచిస్తూ కూర్చుంటారు గౌరి, శంకర్. ఇంతలో తమ్ముళ్లు, చెల్లెల్లు వచ్చి చెక్ చూసి వివరాలు ఆరా తీస్తారు. మీకెందుకు అంటూ వాళ్లను వెళ్లగొడతారు. తర్వాత ఇద్దరూ కలిసి వెళ్లి అకాంక్షను కొత్త చెక్కు అడుగుదామని డిసైడ్ అవుతారు గౌరి, శంకర్. తర్వాత రాకేష్ విశ్వనాథ శర్మ అనే జ్యోతిష్యుడిని అభయ్ ఇంటికి తీసుకొస్తాడు. అభయ్ కంపెనీ బాధ్యతలు చేపట్టబోతున్నాడు కదా అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. కంపెనీ బాధ్యతలు చేపట్టడానికి మంచి ముహూర్తం పెడతాడని చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: 'మారుతి నగర్ సుబ్రమణ్యం' రివ్యూ: హీరోగా రావు రమేష్ ఇరగదీశారా? సినిమా నవ్వించిందా? లేదా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)