అన్వేషించండి

Podharillu Serial Today May 13th: మాధవ్ ఇంటికి భర్తతో కలిసి భోజనానికి వచ్చిన గాయత్రి...అడ్డుచెప్పబోయిన తల్లిపై మండిపాటు

Podharillu Serial Today Episode May 13th: గాయత్రి తన అత్తగారి ఇంటికి శాశ్వతంగా వెళ్లిపోతున్నానని చెప్పడంతో మాధవ్ వీడ్కోలు పలుకుతాడు, అలాగే వారి పాత విషయాన్ని భర్తకు చెప్పవద్దని ఆమెకు హితవు పలుకుతాడు.

Podharillu Serial Today Episode: గాయత్రి రాకతో మాధవ్‌ చాలా సంతోషిస్తాడు. ఇవాళ అత్తగారి ఇంటికి వెళ్లిపోతున్నానని...మళ్లీ తిరిగిరానని చెబుతుంది గాయత్రి. చివరిసారిగా నిన్ను చూసి వెళ్దామని వచ్చానని అంటుంది. ఆ మాటలకు మాధవ్‌ కూడా చాలా సంతోషిస్తాడు.నువ్వు ఎక్కడ ఉన్న సుఖంగా ఉండటమే నాకు కావాలని అంటాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ మన విషయం మీ భర్తకు చెప్పొద్దని చెబుతాడు. నువ్వు ఏం దాచకుండా చెప్పినా....ఇంకా ఏదో దాచావని మగాడు అనుకుంటాడని అంటాడు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మన విషయం తీసుకురావొద్దని చెబుతాడు. నువ్వు కూడా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని గాయత్రి చెబుతుంది.నీకు రాసిపెట్టిన భర్త దొరికినట్లే...నాకు రాసిపెట్టిన అమ్మాయి దొరకగానే చేసుకుంటానని చెబుతాడు.ఇదంతా చూస్తున్న కన్నాకు ఏం చేయాలో అర్థంకాదు. కేశవ్‌కు కూడా ఫోన్ చేసి అందరినీ ఇంటికి రమ్మంటాడు. గాయత్రి వచ్చిన దారినే తిరిగి ఇంటికి వెళ్లిపోతుంది.

ఇంతలో చక్రి,మహా,కేశవ్‌ అందరూ ఇంటికి వస్తారు. మాధవ్‌న ఏం అడగాలా అని తటపటాయిస్తుంటారు. ఇంతలో మాధవ్‌ బయటకు వచ్చి ఏం జరిగిందని అందరూ అదోలా  ఉన్నారని అడుగుతాడు. ఏం లేదని అబద్ధం చెబుతారు.ఇంతలో మాధవ్‌ కల్పించుకుని నీ సర్టిఫికేట్లు వచ్చాయా అని మహాను ప్రశ్నించగా...వచ్చాయంటూ సంతోషంగా చూపిస్తుంది. మరి ఎందుకు అందరూ అదోలో చూస్తున్నారని అడగ్గా.....గాయత్రి వచ్చిందంటగా అని చక్రి అడుగుతాడు. అవును వచ్చిందని మాధవ్ చెబుతాడు. అసలు ఎందుకు వచ్చిందని కేశవ్ మండిపడతాడు. ఇవాళ తను దుబాయ్‌ వెళ్లిపోతుందంటా చివరిసారిగా చూసి వెళ్దామని వచ్చిందని చెబుతాడు. దీంతో చక్రితోపాటు అందరూ గట్టిగా కోప్పడతారు. ఇప్పుడు ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే మళ్లీ గొడవ పెట్టుకుటుందని అంటారు. ఇంట్లో చెప్పే వచ్చిందని...మధ్యాహ్నం మన ఇంటికి భోజనానికి కూడా రమ్మని పిలిచానని చెప్పడంతో అందరూ షాక్ తింటారు.                  

గాయత్రి మాధవ్‌ వాళ్ల ఇంటికి వెళ్లడంతో తాయర్ చాలా మదనపడిపోతుంది. అక్కడ ఏం జరిగిందో...ఇది మళ్లీ ఏం కొంపలు ముంచుతుందోనని భయపడిపోతుంది. ఇంతలో గాయత్రి వచ్చి నేను, మా ఆయనతో బయటకు వెళ్తున్నానని చెప్పడంతో తాయరు ఎంతో సంతోషిస్తుంది. నా బంగారం అన్ని మర్చిపోయి బుద్దిగా భర్తతో సంతోషంగా ఉంటుందని అనుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నారని అడగ్గా....మాధవ్ బావ వాళ్ల ఇంటికి భోజనానికి అని చెప్పడంతో పురుషోత్తం,తాయర్ షాక్‌తింటారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే కాళ్లు ఇరగ్గొడతామని బెదిరిస్తారు. నాకు మీ పర్మిషన్ అవసరం లేదని...మా ఆయనకు చెప్పానని ఆయన వస్తానని అన్నారని అంటుంది.  ఇంతలో గాయత్రి భర్త బయటకురావడంతో తాయరు నోరుమూస్తుంది. అల్లుడు వెళ్లివస్తామని చెప్పడంతో కాదనలేక సరేనని అంటుంది.
                           

 గాయత్రి వస్తుందని తెలిసి నారాయణ కొడుకుపై మండిపడతాడు.అసలు నీకు బుద్ధి ఉందా అని నిలదీస్తాడు. మేం కూడా అదే చెప్పామని చక్రి అంటాడు. అయినా సరే అన్నయ్య వాళ్లకు అన్నిరకాల వంటలు చేసిపెడుతున్నాడని చెబుతారు. ఇంతలో మహా కల్పించుకుని మాట్లాడటంతో అందరూ సర్దుకుంటారు. ఎప్పటిలాగే గాయత్రి పెరటిగుమ్మం నుంచి రావడంతో...ఇప్పుడు మీరు మా  చుట్టాలని వీధిగుమ్మం నుంచి రమ్మని మాధవ్ చెప్పడంతో మళ్లీ వెళ్లి వస్తారు. గాయత్రి వాళ్లందరినీ పరిచయం చేసి చిన్నప్పటి నుంచి తాము ఎలా కలిసి ఆడుకున్నామో చెబుతుంది.అలాగే మా బావ చేసే వంటలన్నా,కూరలన్నా నాకు చాలా ఇష్టమని...ఎప్పుడూ మా అమ్మకు తెలియకుండా బాక్స్‌లో పెట్టి ఇస్తుంటాడని చెబుతుంది. మాధవ్‌ వాళ్లకు భోజనం వడ్డించగా..తిని తిరిగి వెళ్లిపోతారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
Podarillu Serial Today August 10th: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget