అన్వేషించండి

Podharillu Serial Today Feb 23th: మహా సర్టిఫికేట్లు కాల్చి బూడిద చేసిన ప్రతాప్‌...తండ్రిపై కోపంతో ఇంట్లో నుంచి ఆవేశంగా బయటకు వెళ్లిపోయిన మహాలక్ష్మీ

Podharillu Serial Today Episode February 23th:మహా సర్టిఫికేట్లు కాల్చి బూడిద చేసిన ప్రతాప్‌...తండ్రిపై కోపంతో ఇంట్లో నుంచి ఆవేశంగా బయటకు వెళ్లిపోయిన మహాలక్ష్మీ

Podharillu Serial Today Episode: మహాకు మాయమాటలు చెప్పి ఇంటికి రప్పించిన తల్లి...తనను శాశ్వతంగా ఇక్కడే ఉంచేలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే మహా మాత్రం...తన సర్టిఫికేట్లు ఇస్తే తాను వెళ్లిపోతానని చెప్పడంతో ప్రతాప్‌కు తీవ్రమైన కోపం వస్తుంది. అసలు తాను ఇళ్లు వదిలి వెళ్లిందే నా లక్ష్యం కోసమని...అది ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదని మహా అంటుంది. దీంతో వాళ్ల తల్లి కల్పించుకుని మహాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నువ్వు గడప దాటిన వెళ్లిన తర్వాత పోయిన  ఈ ఇంటి పరువు ఎలాగూ తిరిగిరాదని తెలిసినా...కన్నప్రేమపై మమకారంతో  మీ నాన్న నిన్న ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకున్నారని నీకు మరో ఛాన్స్‌ ఇచ్చారని మండిపడుతుంది.

అదంతా వదిలేసి నువ్వు ఎక్కడికో వెళ్తావని అంటున్నావేంటని  కోప్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ  నిన్ను ఇక్కడ నుంచి పంపించేది లేదని అంటుంది. ఆ తాళి తీసేసి నువ్వు పాత మహాలాగే ఇక్కడే ఉండాలని వాళ్ల నాన్న ఆదేశిస్తాడు. ఇంతలో ఆది కల్పించుకుని ఆ భూషణ్ నీ కోసం ఇంకా కెనడా వెళ్లకుండా ఎదురుచూస్తున్నాడని చెబుతాడు. ఒక్కరోజులోనే   నీకు విడాకులు తెప్పిస్తానని వాళ్ల నాన్న చెప్పడంతో...మహాకు విషయం మొత్తం అర్థమవుతుంది. నన్ను ప్లాన్ చేసి ఇక్కడికి రప్పించారని,  నాకు సర్టిఫికేట్లు ఇవ్వడానికి  కాదని అంటుంది. నిహారిక మాత్రం నాకు ఇదంతా తెలియదని...నన్ను కూడా వీళ్లు నమ్మించారని చెప్పడంతో  తల్లిపై మహా మండిపడుతుంది.

కుట్రలు చేసి నన్ను కావాలనే ఇక్కడికి రప్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మీకు కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా అని నిలదీస్తుంది. వాడిని పెళ్లిచేసుకోవడం ఇష్టం లేకే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే...మళ్లీ వాడికే ఇచ్చి కట్టబెడతామని చెప్పడానికి ఏమాత్రం సిగ్గనిపించడం లేదా అని వాళ్ల అన్నయ్యపై మహా మండిపడుతుంది. దీంతో ప్రతాప్‌ అవన్నీ తర్వాత...ముందు నువ్వు ఆ ఇంటిని వదిలేసి ఇక్కడికి వచ్చేయ్‌....నీకు కావాల్సినట్లు నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చని చెబుతాడు. దీనికి మహా అభ్యంతరం చెబుతుంది. నేను అక్కడ ఉంటేనే నా లక్ష్యం సాధించగలనని.....నా సర్టిఫికేట్లు నాకు ఇచ్చేస్తే వెళ్లిపోతానని అంటుంది.
                             ఆదితో సర్టిఫికేట్లు తెప్పించిన ప్రతాప్‌...మేం అక్కర్లేనప్పుడు  మేం చదవించిన చదువులతో నీకు పనేంటని నిలదీస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ అక్కర్లేదు కానీ...వాళ్లు చదివిస్తే చదివిన చదువులతో వచ్చిన ఈ కాగితాలు మాత్రం కావాలా అని అంటాడు. అవి ఉంటేనే నేను నా లక్ష్యం నెరవేర్చుకోగాలనని ఆమె అంటుంది. అయితే ఒక్కటే షరత్‌ అని ప్రతాప్‌ అంటాడు. నువ్వు ఆ ఇంటిని వదిలేసి వస్తేనే ఈ సర్టిఫికేట్లు ఇస్తానని...లేదంటే కాల్చి బూడిద చేస్తానని అంటాడు. దీనికి మహా ఒప్పుకోదు. అంతే ప్రతాప్‌ మహాకు చెందిన ఒరిజనల్ సర్టిఫికేట్లు అన్నీ కాల్చేపడేస్తాడు. దీంతో మహా చాలా ఏడుస్తుంది. నేను కష్టపడి రాత్రింబవళ్లు చదివి గోల్డ్‌మెడల్‌ తెచ్చుకున్న సర్టిఫికేట్లు కాల్చివేయడంతో  ఎంతో మదనపడుతుంది. దీంతో వాళ్ల తల్లిదండ్రులపై తీవ్రస్థాయిలో మండిపడుతుంది.మీరు  అసలు మనుషులే కాదని....మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తోందని అంటుంది.

ఎలాగూ  తలపై నీళ్లు చల్లుకుని నేను చచ్చిపోయానని అనుకున్నారు కదా...ఇక నాపై ఉన్న ఆశలు, ప్రేమ కూడా చంపేసుకోండని చెప్పి వెళ్లబోతుంది. దీంతో మహాను వాళ్ల అమ్మ, అన్నయ్య నిలువరిస్తారు. నా ఒంటిపై చేయివేస్తే ఒప్పుకునేది లేదని....ఇక మీకు నాకు  ఎలాంటి   సంబంధం లేదని హెచ్చరిస్తుంది. సర్టిఫికేట్లు లేకుండా బయటకు వెళ్లి ఏం చేస్తావని అనగా....కాగితాలు లేకపోయినా నాలో ప్రతిభకు ఎలాంటి లోటు లేదని మహా అంటుంది. మీరందరూ  గర్వపడేలా నేను పెద్ద ఉద్యోగం చేసి ,మీరు చెప్పిన మాటలన్నీ తప్పు అని నిరూపిస్తానని శపథం చేసి బయటకు వచ్చేస్తుంది.


                        బయట గేటు వద్ద వదిన కోసం ఎదురుచూస్తున్న కన్నా ఆమె ఏడుస్తూ రావడం చూసి కంగారుపడతాడు. మహా వెనకే ఆది,నిహారిక కూడా వస్తారు. గేటు వద్ద ఉన్న కన్నాను చూసి ఆది కోపంతో రగిలిపోతాడు. వీడు ఎందుకు వచ్చాడని కన్నా మీదకు వెళ్లబోతుంటే...మహా అడ్డుకుంటుంది. వాడి ఒంటిపై చేయివేశావంటే  అన్న అని కూడా చూడనని  హెచ్చరించి కన్నాను తీసుకుని వెళ్లిపోతుంది. మహా బాగా ఏడుస్తూ....తన కలన్నీ కాలి బూడదయ్యాయని, మానాన్న నా సర్టిఫికేట్లన్నీ కాల్చివేశాడని చెప్పడంతో ఎంతోబాధపడతాడు. నాకు సర్టిఫికేట్లు  ఇవ్వడానికి వాళ్లు ఇక్కడికి పిలవలేదని....నన్ను మోసం చేసి ఇక్కడే ఉంచేలా లోపల ఒత్తిడి చేశారని చెబుతుంది.

మా అమ్మ,నాన్న నన్ను నమ్మించి మోసం చేశారని చెప్పడంతో కన్నా కూడా చాలా బాధపడతాడు. వదిన ఏడుస్తూనే ఉండటంతో ఆమెను ఆ మూడ్ నుంచి బయటకు తెచ్చేందుకు నాకు ఆకలిగా ఉంది ఏదైనా తిందామని చెప్పడంతో  మహా వాడిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్తుంది. ఇక్కడ ఏమైందో తెలియక చాలా కంగారుపడుతున్న చక్రి కన్నాకు ఫోన్ చేసి అడగ్గా....మహా ఫోన్ తీసుకుని అవన్నీ ఫోన్‌లో చెప్పలేమని...ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చెబుతానని చెప్పడంతో ఈరోజు ఏపిసోడ్‌ ముగిసిపోతుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 13th: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
నువ్వులేక నేను లేను: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
Podarillu Serial Today August 13th:బావమరిదికి మాస్‌ వార్నింగ్ ఇచ్చిన నారాయణ...సత్రంలో తాయర్‌తో చక్రి గిల్లికజ్జాలు
పొదరిల్లు: బావమరిదికి మాస్‌ వార్నింగ్ ఇచ్చిన నారాయణ...సత్రంలో తాయర్‌తో చక్రి గిల్లికజ్జాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Embed widget