అన్వేషించండి

Podharillu Serial Today Feb 17th: కొత్త సిమ్‌తో తండ్రికి ఫోన్ చేసిన మహాలక్ష్మీ...తన కూతురు ఎప్పుడో చనిపోయిందని చెప్పి కట్‌చేసిన ప్రతాప్‌

Podharillu Serial Today Episode February 17th:కొత్త సిమ్‌తో తండ్రికి ఫోన్ చేసిన మహాలక్ష్మీ...తన కూతురు ఎప్పుడో చనిపోయిందని చెప్పి కట్‌చేసిన ప్రతాప్‌

Podharillu Serial Today Episode: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహాలక్ష్మీ దగ్గరకు వచ్చి తాయర్‌ ఆమెకు లేనిపోని మాటలు చెబుతుంది. ఈఇంట్లో ఉన్నవాళ్లు మంచివాళ్లు కాదని....అమ్మాయిలను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని ఆతర్వాత చంపేస్తుంటారని చెబుతుంది. నువ్వు వచ్చిన రోజే వెనక్కి వెళ్లిపోతే ఇక రావేమో అనుకున్నామని....మళ్లీ వచ్చి ఈ నరకంలో ఎందుకు పడ్డావని  అంటుంది.  వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోమమ్మని చెబుతుంది. అంతలో అక్కడికి నారాయణ వస్తాడు. తనకోడలకు ఏదో చెబుతోందని గ్రహించి దగ్గరకు వస్తాడు. నువ్వు చెప్పేచాడీలు చెప్పి చెడిపోయే రకం కాదు నా కోడలని అంటాడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా ఆంటూ పెద్ద బండరాయి పైకి ఎత్తుతాడు. దీంతో ఆమె భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. మహా ఇంటిలోకి వెళ్లిపోతుంది. ఉద్యోగం లేకపోవడంతో చక్రి వాళ్ల అన్నయ్య దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటాడు. తనను ఉద్యోగం నుంచి తీసివేశాడని....మా మామయ్యవాళ్లు వచ్చి ఇంటి అడ్రెస్‌ కోసం ఓనర్‌ను బెదిరించారంటా  దీంతో భయపడిపోయిన అతను నన్ను ఉద్యోగంలో నుంచి తీసివేశాడని చెబుతాడు. దీంతో కేశవ్‌ చక్రిపై మండిపడతాడు...ఎక్కడపడితే అక్కడ అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఇలాగే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో చక్రి, కేశవ్ మళ్లీ కొట్టుకుంటారు.
                               మహా కన్నాను తీసుకుని కొత్త సిమ్‌కార్డు కొనడానికి వెళ్తుంది. అక్కడ కూడా ఆధార్‌ కార్డు అడగటంతో కన్నా తన కార్డు తీసి సిమ్‌కొని  ఇంటికి తీసుకొస్తాడు. కొత్త సిమ్‌కార్డు రావడంతో మహా వాళ్ల నాన్నకు ఫోన్ చేస్తుంది. కొత్త నెంబర్‌ కావడంతో ప్రతాప్‌ ఫోన్‌ లిప్ట్‌ చేసి మాట్లాడతాడు. మహా మాట వినగానే  మండిపడతాడు. ఎలా ఉన్నారు నాన్న అని అడగ్గానే...ఎవరమ్మా నువ్వు ఇలా ఎవరినిపడితే వాళ్లను నాన్న అని పిలవకూడదని అంటాడు. నేను నీ కూతురుని అని చెప్పగా....నాకు ఒకప్పుడు కూతురు ఉండేదని...ఇప్పుడు చనిపోయిందని చెప్పడంతో మహా చాలా ఏడుస్తుంది. ఆమె చెప్పేది కూడా వినకుండానే  ఫోన్ పెట్టేస్తాడు.

ఇంతలో ఆది అక్కడికి వచ్చి ఏం జరిగిందని అనగా....మహా ఫోన్ చేసిందని ఈయన పెట్టేశారని చెబుతాడు. తను అక్కడ ఏం ఇబ్బందులు పడుతుందో తెలియక భయం వేస్తోందని ప్రతాప్ భార్య అంటుంది. తను బాధలు చెప్పుకోవడానికి ఫోన్ చేసిందేమోనని కంగారుపడుతుంది. ఏదైతే అది అవుతుంది మహాను ఇంటికి పిలవండని కోరుతుంది. తను ఎలా కోరుకుంటే అలాగే ఉండనిద్దామని బ్రతిమలాడుతుంది. దీంతో ప్రతాప్‌కు మరింత కోపం వస్తుంది. మనల్ని వదిలేసుకుని వెళ్లిపోయింది ఎలా ఉంటే మనకు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. బాధలుపడితేగానీ తనకు మన విలువ తెలిసిరాదని చెప్పి కోపంగా ఇంట్లోకి వెళ్లిపోతాడు.
                           

రాత్రికి కన్నా ఫోన్‌కు పెళ్లిళ్ల బ్రోకర్‌ ఫోన్ చేసి మంచి సంబంధం ఉందని చెప్పడంతో...మా ఇంటి గురించి అన్ని విషయాలు చెప్పిన తర్వాతే తీసుకురండని సగం సగం చెప్పి ఇ‌బ్బంది పెట్టొద్దని అంటాడు. మహా ఎవరికి పెళ్లి చూపులని అడిగితే మాధవ్ అన్నయ్యకు అని చెప్పి...గతంలో జరిగిన పెళ్లి చూపుల సంగతులన్నీ వివరించడంతో అందరూ నవ్వుకుంటారు. ఇంతలో మహా వాళ్ల వదిన హారికకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. కొత్త నెంబర్ తీసుకున్నానని చెబుతుంది.ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని...నాన్న ఏం చేస్తున్నాడని అన్ని విషయాలు అడుగుతుంది. అలాగే తాను ఇంట్లో నుంచి వచ్చేప్పుడు  ఆధార్‌కార్డులు, సర్టిఫికేట్లు తీసుకని రాలేదని..కొంచెం  కొరియర్‌లో పంపించగలవా అని అడుగుతుంది. అవన్నీ మీ అమ్మరూమ్‌లో ఉన్నాయని...నేను ఎలా తీసుకురాగలనని హారిక అంటుంది. పోనీ ఆధార్‌కార్డు  ఫొటో తీసి అయినా పంపించమని రిక్వెస్ట్‌ చేసింది. అప్పుడే ఆది ఆ గదిలోకి వస్తాడు. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావని భార్యపై కోప్పడతాడు. ప్రెండ్‌ అని చెప్పిన వినకుండా ఫోన్‌ లాక్కుని మహాతో మాట్లాడతాడు.

ఇంకోసారి ఇలా ఇంట్లో వాళ్లకు ఫోన్ చేస్తే బాగుండదని హెచ్చరిస్తాడు.  మా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావని అని ఫోన్ పెట్టేస్తాడు. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసిందని అడగ్గా....తన సర్టిఫికేట్ల కోసమని చెబుతుంది హారిక. తనకు సంబంధించిన ఏ వస్తువు అయినా ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిందని బాగుండదని భార్యను హెచ్చరిస్తాడు. ఇంట్లో వాళ్లందరికీ తనపై  కోపం ఇంకా పోలేదని మహా కూర్చుని ఏడుస్తుంటుంది. చక్రి వచ్చి ఆమెను ఓదార్చుతాడు.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
Nindu Manasulu Serial Today July 18th: నిండు మనసులు: కలిసిపోదాం గణ.. అర్థం చేసుకో.. ప్రేరణ ప్రపోజల్‌ని గణ ఒప్పుకుంటాడా!
నిండు మనసులు: కలిసిపోదాం గణ.. అర్థం చేసుకో.. ప్రేరణ ప్రపోజల్‌ని గణ ఒప్పుకుంటాడా!
Karthika Deepam 2 Serial Today July 18th: కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
Nindu Noorella Saavasam Serial Today July 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
Embed widget