అన్వేషించండి

Podharillu Serial Today April 3rd:తమ్ముళ్లపై మాధవ్‌ కోప్పడటానికి కారణమేంటి..? పెద్దికి మహా ఎందుకు క్షమాపణలు చెప్పింంది.?

Podharillu Serial Today Episode April 3rd:తమ్ముళ్లపై మాధవ్‌ కోప్పడటానికి కారణమేంటి..? పెద్దికి మహా ఎందుకు క్షమాపణలు చెప్పింంది.?

Podharillu Serial Today Episode: గాయత్రి వాళ్ల ఇంటి దగ్గర గొడవ జరుగుతున్న విషయం మాధవ్‌కు చెబుతారు. మీ అన్నదమ్ములతోపాటు మీ చక్రి వాళ్ల ఆవిడ మహాలక్ష్మీని కూడా వాళ్లు అవమానిస్తున్నారని చెప్పడంతో మాధవ్‌ చాలా కోపంగా బయలుదేరతాడు. ఎంత బ్రతిమాలినా గాయత్రి తల్లిదండ్రులు వినకపోవడంతో మహాలక్ష్మీ వాళ్లందరినీ తీసుకుని వెనక్కి తీసుకుని వెళ్తుంది. ఇంటికి వెళ్లిన మహాతోపాటు కొడుకులను చూసి నారాయణ గట్టిగా  కోప్పడతాడు. నామాట వినకుండా వెళ్లినందుకు బాగా అయ్యిందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. 

చిన్నప్పటి నుంచి వాళ్లను చూస్తున్నారు...మీకు వాళ్ల సంగతి తెలియదా అని చక్రిపై కోప్పడతాడు. న్యాయంగా వాళ్లకు రావాల్సిన వాటా మొత్తం పంచుకున్నా....మళ్లీ గొడవ చేసి నా ఆస్తి కూడా కొట్టేయాలని చూస్తున్నారని చెబుతాడు. నేను ఈ ఇంటి ముందే ఎందుకు ఉంటున్నానో తెలుసా....ఈ ఇంటిని వాళ్లు కొట్టేయకుండా వాచ్‌మెన్‌లా కాపలా కాస్తున్నానని అంటాడు. నా బిడ్డలకు నిలువు నీడలేకుండా చేస్తారన్న భయంతోనే కుక్కలా ఈ ఇంటిని కాపాడుకుంటున్నానని అంటాడు. ఆ మాటలు విన్న కొడుకులు వాళ్ల నాన్నపై మండిపడతారు.

మీరు ఎప్పటికీ మీనాన్నను అర్థం చేసుకోలేరని మహాలక్ష్మీ అందరిపై మండిపడుతుంది. ఆయన తాగిపడేసే సీసాల లెక్కలు చూడటం మానేస్తే ఆయన మనసు ఎలాంటిదో తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆయన చేసే పనులు ఎలా ఉన్నా ఆయనలో మాత్రం మనకన్నా గొప్ప విషయం ఏదో ఉందని చెబుతుంది.లేకపోతే నేను చక్రిని ఇష్టంలేని పెళ్లిచేసుకున్నానని తెలిసినా, ఈ ఇల్లు వదిలి వెళ్లిపోతానని తెలిసినా....

నాకోసం యాదగిరిగుట్ట వరకు వచ్చారని...నా ప్రాణాల కాపాడటానికి తన ప్రాణాలు కూడా అడ్డుపెట్టారంటేనే ఆయన ఎంత మంచివాడో అర్థమవుతుందని అంటుంది. ఇంతలో అక్కడికి మాధవ్‌ వచ్చి అందరూ కలిసి ఎక్కడికి వెళ్లారని నిలదీస్తాడు. నీకు పెళ్లి చేయడానికి వీళ్లంతా పెద్దమనుషులై పెళ్లి సంబంధం కుదర్చడానికి వెళ్లారని నారాయణ మాధవ్‌కు చెబుతాడు. అక్కడ వాళ్లు చేసిన అవమానం గురించి చెబుతాడు. నా మాట అంటే అంత లెక్కలేకుండా పోయిందని మాధవ్‌ అందరిపై మండిపడతాడు. వాళ్లను ఏం అనవద్దని...మీ బాధ చూడలేక నేనే వాళ్లను తీసుకుని వెళ్లానని మహా చెబుతుంది. 

ఎవరు చెప్పారు నేను బాధపడుతున్నానని పెద్ది అంటాడు. మరి నువ్వు, గాయత్రి తెల్లవారుజామున ఎందుకు ఏడుస్తూ మాట్లాడుకున్నారని అంటుంది. మాకు ఎలాంటి బాధలేదని  చెప్పడంతో మహా బాధపడుతుంది. అందరికీ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తమ్ముళ్లపైనా మాధవ్‌ చాలా కోప్పడతాడు. తెల్లారి మళ్లీ మామూలుగా అందరితో కలిసిపోవడం చూసి మహాలక్ష్మీ ఆశ్చర్యపోతుంది. మీరు మీ తమ్ముళ్లతో రెండు,మూడురోజులు మాట్లాడరేమో అనుకున్నానని అంటుంది. అయినా మీరు చేసింది నాకోసమే అయినప్పుడు నేను ఎందుకు మీపై కోపం పెంచుకుంటానని అంటాడు. 

ఫోన్‌ కోసం మెకానిక్ షాపు దగ్గరకు వచ్చిన శైలూ అతన్ని బ్రతిమలాడుతుంది. నిజంగా  నాదగ్గర అన్ని డబ్బులు లేవని అంటుంది. కనీసం నా ఫాలోవర్స్ కోసం ఓ రీల్‌చేసుకోనివ్వమని అడిగితే...ఫోన్ తీసుకుని పారిపోకుండా ఉండేందుకు తన చేతిని శైలూ చేతితో కట్టిసే రీల్ చేసుకునేందుకు అంగీకరిస్తాడు. శైలూ రీల్స్‌ చేస్తుండగా....అతని గురింంచి పాటలు పాడుతున్న ఫీలింగ్ వస్తుంది కేశవ్‌కు. శైలూపైనా కేశవ్‌కు చిన్నచిన్నగా  ప్రేమ మొదలవుతుంది.   

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 15th: సుందరి కుటుంబానికి గాలం వేసిన రాధ...వరలక్ష్మీ పూజకు రాధ వచ్చిందా లేదా..?
నువ్వులేక నేను లేను: సుందరి కుటుంబానికి గాలం వేసిన రాధ...వరలక్ష్మీ పూజకు రాధ వచ్చిందా లేదా..?
Illu Illalu Pillalu Serial Today August 15th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టేసిన నర్మద! రామరాజు ఇంట్లో లంచం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టేసిన నర్మద! రామరాజు ఇంట్లో లంచం!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Embed widget